E-Paper
Advertisement

Free Photoshop Acrobat: ఉచితంగా ఫొటోషాప్, పిడిఎఫ్ సాఫ్ట్‌వేర్.. ఎలా పొందాలంటే

Free Photoshop Acrobat: ఉచితంగా ఫొటోషాప్, పిడిఎఫ్ సాఫ్ట్‌వేర్.. ఎలా పొందాలంటే
Advertisement

Free Photoshop Acrobat ChatGPT | చాట్‌జీపీటీ, జెమిని ఏఐ, గ్రోక్ ఏఐ లాంటి జెనరేటివ్ AI టూల్స్ డిజిటల్ కంటెంట్ తయారు చేయడం, మేనేజ్ చేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇప్పుడు చాట్‌జీపీటీలోనే పాపులర్ అడోబ్ టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. అద్భుతమైన ఫోటోలు తయారు చేయడం, ఫోటోలు ఎడిట్ చేయడానికి చాలా మంది ఉపయోగించే ఫోటోషాప్‌తో పాటు పిడిఎఫ్ సాఫ్ట్ వేర్ అడోబ్ ఎక్స్‌ప్రెస్, అక్రోబాట్ లాంటి టూల్స్ అన్నీఒక్క చాట్ విండోలోనే ఉపయోగించవచ్చు. వేరే సాఫ్ట్‌వేర్ కొనాల్సిన అవసరం లేదు.

జెనెరేటివ్ ఏఐ టూల్స్ లోనే ఇవి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ సౌలభ్యంతో పనిచేసే సమయంలో ప్రత్యేకంగా మరో విండో ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఫోటోలు ఎడిట్ చేయడం, గ్రాఫిక్స్ డిజైన్ చేయడం, డాక్యుమెంట్స్ మేనేజ్ చేయడం.. అన్నీ చాట్‌లోనే జరుగుతాయి.

అడోబ్ ఎందుకు చాట్‌జీపీటీలో చేరింది?

Advertisement

AI టూల్స్ ఇప్పుడు కొంతవరకు సాఫ్ట్‌వేర్ పనులు చేస్తున్నాయి. సింపుల్ ప్రాంప్ట్స్‌తో ఇమేజ్‌లు, డిజైన్స్, డాక్యుమెంట్స్ తయారు చేయొచ్చు. దీని వల్ల ప్రత్యేక యాప్స్ మీద ఆధారపడటం తగ్గుతుంది. అడోబ్ ఈ మార్పుని ఎదుర్కొనే బదులుగా దానికి అనుకూలమైన స్ట్రాటెజీ మార్చుకుంది. తన సొంత AI టూల్స్ (ఫైర్‌ఫ్లై) అభివృద్ధి చేస్తూనే ఇతర AI ప్లాట్‌ఫామ్‌లతో కలిసి పని చేస్తోంది.

చాట్‌జీపీటీలో ఎప్పటి నుంచి అందుబాటులోకి అడోబ్

ఈ వారం నుంచి అడోబ్ యాప్స్ చాట్‌జీపీటీలో అందుబాటులో ఉన్నాయి. ప్రాంప్ట్ ఫీల్డ్‌లో యాక్టివేట్ చేసుకుంటే చాట్ విండో నుంచి బయటికి వెళ్లకుండానే పని చేయొచ్చు. ఇప్పుడిలా ఉచితంగా వాడొచ్చు. సింపుల్ ఇంగ్లీష్‌లో కమాండ్స్  ఇస్తే టూల్స్ పని చేస్తాయి. దీంతో పని చాలా సులువుగా, వేగంగా జరుగుతుంది.

ఫోటోషాప్‌లో ఏం చేయొచ్చు?

Advertisement

ఫోటోషాప్ బేసిక్ ఎడిటింగ్ ఫీచర్స్ ఇస్తుంది. బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్, ఎక్స్‌పోజర్ మార్చొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మార్చడం, క్రియేటివ్ ఎఫెక్ట్స్ పెట్టడం సులువు. అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఇంకా రాలేదు.

అడోబ్ ఎక్స్‌ప్రెస్ ఏం చేస్తుంది?

అడోబ్ ఎక్స్‌ప్రెస్ క్విక్ డిజైన్ పనులకి బెస్ట్. పోస్టర్స్, ఇన్విటేషన్స్, సోషల్ మీడియా గ్రాఫిక్స్ తయారు చేయొచ్చు. సింపుల్ ప్రాంప్ట్ ఇస్తే టెంప్లేట్స్ వస్తాయి. తర్వాత కమాండ్స్‌తో మార్చుకోవచ్చు.  ఫాస్ట్ కంటెంట్ క్రియేషన్‌కి సూపర్ ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది.

అక్రోబాట్ ఏం చేస్తుంది?

అక్రోబాట్ PDF పనులకి ఉపయోగపడుతుంది. టెక్స్ట్ ఎడిట్ చేయడం, పేజీలు ఎక్స్‌ట్రాక్ట్ చేయడం, సెన్సిటివ్ ఇన్ఫో రీడాకుమెంటేషన్ చేయడం, మల్టిపుల్ PDFలు మర్జింగ్ చేయడం.. అన్నీ చాట్‌లోనే జరుగుతాయి.

Also Read: సైబర్ దొంగల గేమ్ ఓవర్.. పవర్‌ఫుల్ యాంటీ ఫ్రాడ్ ఫీచర్ వచ్చేసింది

ఫీచర్స్ – లిమిటేషన్స్

ప్రస్తుతానికి చాట్‌జిపిటిలో ఫ్రీ అడోబ్ ఫీచర్ కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇండియాలో ఇంకా రాలేదు. ఆండ్రాయిడ్ యూజర్లకి అడోబ్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే ఉంది. పూర్తి ప్రొఫెషనల్ పనులకి అడోబ్ సబ్‌స్క్రిప్షన్ ఇంకా అవసరమే.

చాట్‌జీపీటీలోని ఉచిత టూల్స్ బేసిక్ పనులకి సరిపోతాయి. అడ్వాన్స్‌డ్ వర్క్‌కి అడోబ్ పెయిడ్ ప్లాన్స్ తీసుకోవాల్సిందే. కానీ మీ అవసరాలను బట్టి ముందు ఉచితంగా ట్రై చేసి చూడండి.

 

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×