E-Paper
Advertisement

స్పేస్‌ఎక్స్‌కు పోటీగా చైనా వేసిన ప్లాన్ రివర్స్.. గాలిలో పేలిన భారీ రాకెట్!

స్పేస్‌ఎక్స్‌కు పోటీగా చైనా వేసిన ప్లాన్ రివర్స్.. గాలిలో పేలిన భారీ రాకెట్!
Advertisement

China Rocket Crash: అంతరిక్ష పరిశోధనల్లో అగ్రరాజ్యం అమెరికాకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్న చైనాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌  స్టార్‌లింక్ ఉపగ్రహ వ్యవస్థకు సవాల్ విసిరేలా రూపొందించిన తియాన్‌లాంగ్‌-3 (Tianlong-3) రాకెట్ ప్రయోగం విఫలమైంది. శుక్రవారం బీజింగ్ సమీపంలోని ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించిన ఈ రాకెట్, గగనతలంలోకి వెళ్లిన కొద్దిసేపటికే అసాధారణ సాంకేతిక సమస్యతో కూలిపోయింది. చైనాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ పయనీర్ ఈ రాకెట్‌ను అభివృద్ధి చేసింది.

తియాన్‌లాంగ్‌-3 రాకెట్ ప్రయోగాన్ని చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇది స్పేస్‌ఎక్స్‌లోని Falcon 9 రాకెట్‌కు సమానమైన సామర్థ్యం కలిగి ఉంది. తిరిగి భూమికి చేరుకోగల సాంకేతికతతో రూపొందించబడింది. అయితే, ప్రయోగం జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఇంజిన్లలో తలెత్తిన అసాధారణ సమస్య కారణంగా రాకెట్ నియంత్రణ కోల్పోయింది. రాకెట్ గాలిలోకి దూసుకెళ్తున్న సమయంలో దాని బూస్టర్లు అనుకున్న సమయం కంటే ముందే విడిపోవడం లేదా విఫలం కావడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమిక సమాచారం.

Advertisement

ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్లో స్టార్‌లింక్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం వేలాది ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు తియాన్‌లాంగ్‌-3 వంటి భారీ రాకెట్లపై చైనా ఆధారపడింది. ఈ విఫల ప్రయోగం వల్ల చైనా శాటిలైట్ ఇంటర్నెట్ మిషన్ కొంత కాలం వెనక్కి పడే అవకాశం ఉంది. స్పేస్ పయనీర్ సంస్థ ఈ వైఫల్యంపై విచారం వ్యక్తం చేస్తూ, డేటాను విశ్లేషించి లోపాలను సరిదిద్దుకుంటామని ప్రకటించింది. రాకెట్ కూలిపోయిన సమయంలో శిథిలాలు సమీపంలోని నివాస ప్రాంతాల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు చైనా అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి మరిన్ని ప్రయోగాలు చేపట్టాలని చైనా యోచిస్తోంది.

Read Also: నింగిలోనూ తప్పని సాఫ్ట్‌వేర్ తిప్పలు.. ఆర్టెమిస్ II లో మొరాయించిన మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్!

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×