Born on 12th: మీరు 12వ తేదీలో పుట్టారా..? అయితే మీకు జీవితంలో అత్యంత కీలకమైన సమయం ఎప్పుడు వస్తుందో తెలుసా..? మీ జీవితం మలుపులు తిరిగి అభివృద్ది పథంలోకి దూసుకెళ్తుందో తెలుసా..? అయితే ఈ కథనంలో తెలుసుకుందాం.
న్యూమరాలజీ ప్రకారం ఏదైనా నెలలో 12వ తేదీన పుట్టిన వారిపై గురువు (Jupiter) ప్రభావం ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే 1+2 = 3. సంఖ్య 3 కి అధిపతి బృహస్పతి. వీరు చాలా తెలివైనవారు, క్రమశిక్షణ గలవారు మరియు నాయకత్వ లక్షణాలు కలిగిన వారని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెప్తున్నారు.
వ్యక్తిత్వం మరియు భవిష్యత్తు: 12 తేదీలో పుట్టిన వారు బహుముఖ ప్రజ్ఞాశాలలు అట. వీరు ఏ విషయాన్నైనా త్వరగా గ్రహిస్తారట. మాటకారి తనంతో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారట. వీరు పని పట్ల చాలా నిబద్ధతతో ఉంటారట. అన్యాయాన్ని అస్సలు సహించరట. వీరు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారట. ఎదుటివారికి సాయం చేసే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుందట.
ఏ రంగంలో స్థిరపడతారు? (Career): పన్నెండు తేదీలో పుట్టిన వారు మేధోపరమైన వృత్తుల్లో బాగా రాణిస్తారట. ముఖ్యంగా ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు లేదా విద్యాసంస్థల అధినేతలుగా రాణిస్తారట. లాయర్లు, జడ్జీలు లేదా ప్రభుత్వ ఉన్నతాధికారులుగా (IAS, IPS వంటివి) రాణించే అవకాశం ఉందట. అలాగే ఆర్థిక సలహాదారులుగా లేదా ఆధ్యాత్మిక గురువులుగా పేరు తెచ్చుకుంటారట. ఇంకా లెక్కల్లో వీరు దిట్ట కాబట్టి బ్యాంకింగ్ రంగం వీరికి బాగా కలిసి వస్తుందట. రచయితలుగా, కవులుగా లేదా ప్రసంగీకులుగా కూడా వీరు మంచి గుర్తింపు పొందుతారట.
లైఫ్ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు ఉంటుంది? (Success Age): సంఖ్యాశాస్త్రం ప్రకారం 12వ తేదీన పుట్టిన వారికి జీవితంలో కీలకమైన మార్పులు లేదా టర్నింగ్ పాయింట్లు సాధారణంగా 21 నుండి 24 ఏళ్లల్లో వచ్చే అవకాశం ఉంటుందట. ఈ వయసులోనే మొదటి ప్రధాన మార్పు లేదా విజయం లభిస్తుందట. ఇక 30 ఏళ్ల వయసులో జీవితంలో ఒక స్థిరత్వం ఏర్పడుతుందట. అలాగే 33 నుంచి 39 ఏళ్ల వయసులో వీరి జీవితంలో అత్యంత కీలకమైన కాలమని.. ఈ సమయంలోనే వీరు సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం లేదా ఆర్థికంగా భారీ వృద్ధిని సాధించడం జరుగుతుందని పండితులు చెప్తున్నారు.
పన్నెండవ తేదీలో పుట్టిన వారికి అనుకూలమైన రంగులు పసుపు, క్రీమ్ మరియు గులాబీ రంగులు కలిసి వస్తాయట. వీరికి అనుకూలమైన రోజులు.. గురువారం, ఆదివారం మంగళవారమట. 12వ తేదీ జాతకులు కొన్నిసార్లు అతిగా ఆలోచించడం (Overthinking) వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారట. అలాగే, ఇతరుల విషయంలో అతిగా జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.