E-Paper
Advertisement

కిడ్నీలో రాళ్లా? బీరు తాగితే కరిగిపోతాయా?

కిడ్నీలో రాళ్లా? బీరు తాగితే కరిగిపోతాయా?
Advertisement

Kidney Stones:పెద్దలు నాలుగు రాళ్ళు వెనకేయుమన్నారు.కాని ఇప్పటి యూత్ కష్టపడి కిడ్నీల్లో రాళ్ళు వెనకేసే పనిలో పడ్డారు. అవును ఈ బిజీ లైఫ్ లో పడిపోయి, ఏం తింటున్నారొ,ఎంత తింటున్నారొ తెలీకుండా తినేస్తున్నారు.ఈ క్రమంలో కిడ్నీల్లో రాళ్ళు రావడం కామన్ అయిపొయింది.ఇక కిడ్నీలో రాళ్ళు అనే మాట వినబడగానే చాలా మంది ఇచ్చే ఉచిత సలహా ఏంటో తెలుసా ..’ఒక్క బీర్ కొట్టు గురూ ..తన్నుకుంటూ బయటకొచ్చేస్తుంది’ అని. మరి నిజంగానే బీర్ తాగితే కిడ్నీలో రాళ్ళు తన్నుకుంటూ బయటకొచ్చేస్తాయా..? అసలు ఈ ఉచిత సలహా గురించి ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు చూసేద్దాం.

కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి మినరల్స్ 

Advertisement

ముందు మన కిడ్నీల్లో రాళ్ళు ఎలా ఏర్పడతాయో చూద్దాం.మనం తీసుకునే ఫుడ్ నుండి బాడీలో కలిసే కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి మినరల్స్
మూత్రపిండాల్లో జామ్ అయిపోయి చిన్న చిన్న స్ఫటికాలుగా మారుతాయి. కాల క్రమంలో ఇవే గట్టిగా అయిపోయి రాళ్ళలా మారిపోతాయ్,ఇక ఇవి మూత్ర నాళానికి అడ్డంగా వచ్చినప్పుడు భరించలేని నొప్పి లేదా యూరిన్ లో బ్లడ్ వంటి సిమ్ టమ్స్ కనిపిస్తాయి.ముఖ్యంగా కలిగే ఆ నొప్పి ఎలా ఉంటుందో రాళ్ళు వచ్చిన వారికి బాగా తెలుసు.

బీరు తాగడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది

Advertisement

అయితే కిడ్నీలో రాళ్ళు అనగానే బీర్లు తాగుతుంటారు చాలా మంది.బీరు తాగడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుందని, ఆ ఫోర్స్‌కు కిడ్నీలో రాళ్లు కొట్టుకుపోతాయని
నమ్ముతారు. కానీ బీర్లు తాగితే అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే అన్నది ఎక్స్పర్ట్స్ చెబుతున్న మాట. కానీ, మనం కావలసినంత నిమ్మరసం లేదా మంచినీళ్లు తాగితే ఎక్కువ బెన్ ఫిట్ ఉంటుందట. బీరు తాగడం వల్ల వచ్చే ఉపయోగాలు సున్నా ..పైగా డబ్బులు బొక్క.సో ఈసారి బీర్ కొట్టు గురూ ..తన్నుకుంటూ బయటకొచ్చేస్తుంది అంటే ఏం చేయాలో తెలుసు గా !

also read:విడాకులు నిజమేనా శర్వా…? ఇన్‌స్టా నుంచి ఫ్యామిలీ ఫోటోలు అవుట్..!

బీరు తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్

ఇక బీరులో ఉండే ఆల్కహాల్ కేవలం కిడ్నీలకే కాదు, మొత్తం బాడీకే నష్టం కలిగిస్తుంది.ముఖ్యంగా బీరు తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ (నీటి శాతం తగ్గడం) పెరుగుతుంది, ఇది కిడ్నీలకు అస్సలు మంచిది కాదు.ఇక బీరు తాగడం వల్ల ఒక్కసారిగా మూత్రం ప్రొడ్యూస్ అయ్యి ఆ రాయి గనుక మూత్రనాళంలో అడ్డం పడితే.. కిడ్నీలో వాపు వచ్చినా ఆశ్చర్యం లేదు.ఇక బీరు తాగడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ ఉండాల్సినదాని కన్నా ఎక్కువ అయిపోయి లివర్ ని కూడా నాశనం చేస్తుంది.సో కిడ్నీలలో రాళ్ళు అన్న సాకు తో తాగడం అలవాటు చేసుకుంటే అది వ్యసనంగా మారి జీవితాన్నే నాశనం చేస్తుంది.

మంచి నీళ్ళు తాగితే న్యాచురల్ గా యూరిన్ తో.

జనరల్ గా 5 మి.మీ. కంటే చిన్నగా ఉండే రాళ్లు కావలసినన్ని మంచి నీళ్ళు తాగితే న్యాచురల్ గా యూరిన్ తో బయటికి వెళ్లిపోతాయ్.నీరు మూత్రాన్ని పలుచగా చేసి,రాళ్లు ఈజీగా
కదిలేలా చేస్తుందన్న మాట.సో ..రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.

యూరాలజిస్ట్‌ను సంప్రదించాల్సిందే

అయితే ఇది కేవలం చిన్న సైజ్ ఉన్నవారికి మాత్రమే.రాయి గనుక పెద్ద సైజ్ లో ఉంటె లేదా నొప్పి తట్టుకోలేనప్పుడు ఖచ్చితంగా యూరాలజిస్ట్‌ను సంప్రదించాల్సిందే.
అవసరమైతే స్కానింగ్ చేయించుకుని,డాక్టర్ రిఫర్ చేసిన మందులు వాడాలి.చివరిగా బీరు తాగితే కిడ్నీ రాళ్లు మాయం అనేది ఒక భ్రమ కాబట్టి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు బీరుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

also read:టాలీవుడ్‌లో జాక్వెలిన్ ‘కిక్’.. డార్జిలింగ్ కొండల్లో సీక్రెట్ షూటింగ్! వివాదాల సుడిగుండం నుంచి వెండితెరకు.. రూ. 200 కోట్ల కేసు ఎఫెక్ట్ తగ్గేనా?

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×