E-Paper
Advertisement

CMF Phone 1 Offers: బడ్జెట్ ఫ్లాగ్‌షిప్.. CMF ఫోన్‌పై ఆఫర్లు.. కొత్తగా ట్రై చేశారు!

CMF Phone 1 Offers: బడ్జెట్ ఫ్లాగ్‌షిప్.. CMF ఫోన్‌పై ఆఫర్లు.. కొత్తగా ట్రై చేశారు!
Advertisement

CMF Phone 1 Offers: ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న నథింగ్ సబ్ బ్రాండ్ సీఎమ్‌ఎఫ్ ఫోన్ 1 ఎట్టకేలకు విడుదలై ఈ రోజు మొదటి సేల్‌కు రానుంది. ఇది సీఎమ్ఎఫ్ నుంచి వస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్ కావడం విశేషం. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో అనేక స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ బ్యాక్ కవర్‌ను మార్చుకోవచ్చు. అలానే దీని డిజైన్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది మొబైల్ యూజర్లకు లాన్యార్డ్స్ వంటి టూల్స్‌ను అటాచ్ చేసే ఫీచర్‌తో వస్తుంది. ఫోన్ మెడిటెక్ డైమన్సిటీ 7300 5జీ ప్రాసెసర్‌‌తో రన్ అవుతుంది. ఇది 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్‌రేట్‌తో అమ్లోడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఐపి52 బిల్డ్ కలిగి ఉంది. ఇందులో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది వైర్డ్, రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

ఇండియాలో సీఎమ్ఎఫ్ ఫోన్ 1 6జీబీ ర్యామ్+128 జీబీ, 8జీబీ ర్యామ్+128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.15,999, 17,999. ఇది బ్లాక్, బ్లూ, లైట్ గ్రీన్, ఆరెంజ్ కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా సీఎమ్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్, రిటైల్ స్టోర్ల నుంచి కూడా దక్కించుకోవచ్చు.

Advertisement

Also Read: Smartphones Under 20000: రూ.20 వేలల్లో బెస్ట్ ఫోన్లు.. సూపర్ ఫీచర్స్!

మొదటి సేల్‌లో భాగంగా దీనిపై ఆఫర్లు కూడా ప్రకటించింది. సీఎమ్ఎఫ్ ఫోన్ 1 బేస్ వేరియంట్ 6జీబీ ర్యామ్ మోడల్‌ను రూ.14,999కి కొనుగోలు చేయవచ్చు. టాప్ ఎండ్ మోడల్ 8 జీబీ ర్యామ్ కలిగిన ఫోన్‌ను రూ.16,999కి ఆర్డర్ చేయచ్చు. వీటిపై అనేక బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. వీటి కారణంగా రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. ఆఫర్ల పూర్తి వివరాలను ఫ్లిప్‌కార్ట్ నుంచి తెలుసుకోవచ్చు.

Advertisement

కంపెనీ ఈ ఫోన్ కొనుగోలుపై లాన్యార్డ్, స్టాండ్, కార్డ్ హోల్డర్ వంటి అనేక టూల్స్‌ను అదనంగా అందిస్తోంది. ఒక్కోదాని ధర సుమారు రూ.799. మీరు ఈ ఫోన్‌కు కొత్త లుక్ ఇవ్వడానికి బ్యాక్ కవర్‌ను మార్చుకోవచ్చు. దీన్ని కూడా విడిగా కొనుగోలు చేయాలి. ఈ రిమూవబుల్ బ్యాక్ కవర్ బ్లూ, బ్లాక్, ఆరెంజ్, లైట్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. ఒక్కోదాని ధర రూ.1,499.

ఫోన్ అమ్లోడ్ డిస్‌ప్లే, హెవీ ర్యామ్ కలిగి ఉంది. ఫోన్ డ్యూయల్ సిమ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా నథింగ్ ఓఎస్ 2.6పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌కు రెండేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, మూడేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు లభిస్తాయని కంపెనీ వెల్లడించింది. ఇది 120 హెచ్‌జెడ్ అడాప్టివ్ రీఫ్రెష్‌రేట్, 395 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 240 హెచ్‌జెడ్ టచ్ శాంపిల్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమ్లోడ్ ఎల్‌టీపీఎస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది.

ఫోన్‌లో ఫోటోగ్రఫీ కోసం సీఎమ్ఎఫ్ ఫోన్ 1 ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS)తో కూడిన సోనీ సెన్సార్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా,  2x జూమ్‌తో కూడిన 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కనెక్టివిటీలో 5G, 4G LTE, WiFi 6, బ్లూటూత్ 5.3, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇది సేఫ్టీ కోసం ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. వాటర్, డస్ట్ ప్రొటక్షన్ కోసం IP52 రేటింగ్ ఇవ్వబడింది.

Also Read: Colour Changing Phone: కొత్త టెక్నాలజీ.. రంగులు మార్చే ఫోన్.. ధర కూడా తక్కువే!

20 నిమిషాల్లో బ్యాటరీ 50 శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. కంపెనీ తన మొదటి స్మార్ట్‌ఫోన్‌లో 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించింది. ఇది 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే రెండు రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఈ ఫోన్ అందిస్తుంది.

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×