E-Paper
Advertisement

Smartphones Under Rs 20,000: రూ.20 వేలల్లో బెస్ట్ ఫోన్లు.. ఫీచర్స్ మాత్రం సూపర్!

Smartphones Under Rs 20,000: రూ.20 వేలల్లో బెస్ట్ ఫోన్లు.. ఫీచర్స్ మాత్రం సూపర్!
Advertisement

Smartphones Under Rs 20,000: ప్రస్తుతం టెక్ మార్కెట్‌లో కుప్పలు కుప్పలుగా స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. అందులో బడ్జెట్ ధర నుంచి ప్రీమియం ఫోన్లు ఉన్నాయి. అంతేకాకుండా రోజుకో ఫోన్ కొత్త కొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో విడుదల అవుతుంది. ఇందులో కొన్ని కెమెరా ఫోన్లు అయితే, మరికొన్ని పవర్ ఫుల్ బ్యాటరీ కలిగి ఉన్నాయి. కొన్ని ఫోన్లు డిజైన్ కారణంగా మొబైల్ ప్రియుల హృదయాలను గెలుచుకున్నాయి. ఈ నేపథ్యంలో జులైలో విడుదైన ఫోన్ల గురించి మాట్లాడితే ఈ నెల ప్రారంభంలోనే అనేక ఫోన్లు విడులయ్యాయి. వీటిలో రూ.20 వేల లోపు ధర కలిగిన ఫోన్లు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు బడ్జెట్ ప్రైస్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తుంటే అటువంటి వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

Vivo T3 Lite 5G
ఈ వివో టీ3 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్+2 మెగాపిక్సెల్ డ్యూయల్ రియల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఫోన్ 5000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.12,980కే కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Motorola G85 5G
ఈ మోటరోలా జీ 85 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ.17,999. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌ ఫోన్‌లో ఉంటుంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్+ 8 మెగాపిక్సెల్ డ్యూయల్ రియల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో వీడియోకాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. పవర్ కోసం 5000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంటుంది.

Also Read: మాటల్లేవ్.. ఐక్యూ న్యూ స్మార్ట్‌ఫోన్.. ఈసారి కొత్తగా వచ్చేస్తోంది!

Advertisement

CMF 1
నథింగ్ సీఎమ్ఎఫ్ ఫోన్ 1ను రూ.20 వేల లోపు బడ్జెట్‌లో తీసుకొచ్చింది. ఇందులో 6జీబీ ర్యామ్+128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ స్టోరేజ్‌ను 2టీబీ వరకు పెంచుకోవచ్చు. ఫోన్‌లో డైమన్సిటీ 7300 5జీ ప్రాసెసర్ ఉంటుంది. దీని డిస్‌ప్లే ఫుల్ హెచ్‌డీతో 6.67 అంగుళాలు. ఫోటోల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమోరా, బ్యాక్ 50 మెగాపిక్సెల్+2 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. రూ.15,999కి ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Realme C63
4జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్‌ను రూ.10 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అలానే ఈ ఫోన్‌పై ఈ కామర్స్ సైట్‌లో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఫోన్‌ను రూ.8,999కి కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల గురించి చెప్పాలంటే ఫోన్‌లో 6.74 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్‌లో T612 ప్రాసెసర్ ఉంటుంది. 5000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంది.

Also Read:  కొత్త టెక్నాలజీ.. రంగులు మార్చే ఫోన్.. ధర కూడా తక్కువే!

Infinix Note 40 5G
ఈ ఫోన్ రూ.20 వేలలో బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో రూ.19,999కి కొనుగోలు చేయవచ్చు.ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉంటుంది. అందులో 108,2,2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.ఫోన్‌లో డైమన్సిటీ 7020 ప్రాసెసర్,5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×