BigTV English

Colour Changing Phone: కొత్త టెక్నాలజీ.. రంగులు మార్చే ఫోన్.. ధర కూడా తక్కువే!

Colour Changing Phone: కొత్త టెక్నాలజీ.. రంగులు మార్చే ఫోన్.. ధర కూడా తక్కువే!

Colour Changing Phone: ప్రముఖ బడ్జెట్ ఫోన్ల తయారీ కంపెనీ ఐటెల్ భారతదేశంలో రంగులు మార్చే స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో రంగులు మార్చే బ్యాక్ ప్యానెల్‌తో ఐటెల్ కలర్ ప్రో 5 జీ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. లాంచ్‌కు ముందు, రాబోయే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. ఫోన్ డిస్‌ప్లే, ప్రాసెసర్ వివరాలను వెల్లడించారు. 15,000 కంటే తక్కువ ధరకే ఈ ఫోన్ లాంచ్ అయే అవకాశం ఉంది. రాబోయే ఫోన్‌లో ప్రత్యేకత, ఫీచర్లు, తదితర వివరాలు తెలుసుకుందాం.


Itel Color Pro 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను MySmartPrice వెల్లడించింది. ఈ రాబోయే ఐటెల్ స్మార్ట్‌ఫోన్‌లో HD ప్లస్ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల LCD ప్యానెల్ ఉంటుంది. అలానే సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్ ఉంటుంది. కలర్ ప్రో 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6080 5G ప్రాసెసర్‌తో వస్తుంది. ఇదే ప్రాసెసర్ Redmi Note 13 5G, Poco X6 Neo 5Gతో పాటు అనేక ఇతర ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించారు.

Itel Color Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ చిప్‌సెట్ 6nm ప్రాసెస్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది రెండు కార్టెక్స్ A76 కోర్లు, ఆరు కార్టెక్స్ A55 కోర్లుతో మాలి G57 MP2 GPU ఉన్నాయి. Itel ఈ స్మార్ట్‌ఫోన్‌ను NRCA (5G++)తో లాంచ్ చేస్తుంది. ఇది స్ట్రాంగెస్ట్ 5జీ కనెక్టవిటీని అందిస్తోంది.

ఫోన్ వెనుక ప్యానెల్‌పై సూర్యకాంతి పడినప్పుడు రంగు మారుతుంది. NRCA స్మార్ట్‌ఫోన్ తక్కువ నెట్‌వర్క్ సిగ్నల్స్ ఉన్న ప్రాంతాల్లో 4Gకి తిరిగి రాకుండా 5G కనెక్టివిటీని అందించడంలో సహాయపడుతుంది. ఫోన్ వెనుక ప్యానెల్‌లో IVCO టెక్నాలజీని ఉపయోగించినట్లు కంపెనీ ధృవీకరించింది. ఇది సూర్యరశ్మికి గురైనప్పుడు ఆటోమాటిక్‌గా రంగు మారుతుంది. రంగు మార్చే ప్యానెల్లు, 5G+++ని చేర్చడం ద్వారా కొత్త జనరేషన్ అట్రాక్ట్ చేయడం బ్రాండ్ లక్ష్యం.

Also Read: iQOO Neo 9S Pro Plus: మాటల్లేవ్.. ఐక్యూ న్యూ స్మార్ట్‌ఫోన్.. ఈసారి కొత్తగా వచ్చేస్తోంది!

ఐటెల్ స్మార్ట్‌ఫోన్‌లో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుందని వెల్లడైన క్యాంపెయిన్ బ్యానర్ సూచిస్తుంది. ఇతర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. త్వరలో వెల్లడిస్తామని కెంపెనీ తెలిపింది. ఐటెల్ ఈ నెలాఖరు నాటికి దేశంలో ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.

Related News

OnePlus 24GB RAM Discount: వన్ ప్లస్ 24GB RAM ఫోన్‌పై భారీ తగ్గింపు.. రూ.33000 వరకు డిస్కౌంట్

Youtube Ad free: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి

iPhone 16 vs Pixel 10: రెండూ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు.. ఏది బెస్ట్?

itel ZENO 20: రూ.5999కే స్మార్ట్ ఫోన్.. 5,000mAh భారీ బ్యాటరీతో ఐటెల్ జెనో 20 లాంచ్

New Realme Smartphone: మార్కెట్లో ఎప్పుడూ లేని బ్యాటరీ పవర్! రాబోతున్న రియల్‌మీ బిగ్ సర్‌ప్రైజ్

Google Pixel 10 Pro Fold vs Galaxy Z Fold 7: ఏ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెటర్?

Big Stories

×