E-Paper
Advertisement

Tech Company Flat Gift: ఉద్యోగులకు కోట్ల విలువైన ఇళ్లు కానుకగా ఇచ్చిన టెక్ కంపెనీ.. ఎందుకంటే

Tech Company Flat Gift: ఉద్యోగులకు కోట్ల విలువైన ఇళ్లు కానుకగా ఇచ్చిన టెక్ కంపెనీ.. ఎందుకంటే
Advertisement

Tech Company luxury Flat Gift To employees| కంపెనీలు సాధారణంగా ఉద్యోగులకు బోనస్ లేదా కానుకలు ఇస్తాయి. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల పనితీరు బాగుంటే, మంచి లాభాలు వస్తే.. కార్లు కూడా రివార్డ్‌గా ఇస్తాయి. అయితే ఒక టెక్ కంపెనీ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు లగ్జరీ ఫ్లాట్లను గిఫ్ట్‌గా ఇస్తోంది. ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వాళ్లకు ఈ ఫ్లాట్ దక్కుతుంది. ఈ అరుదైన బెనిఫిట్ చాలా అటెన్షన్ ఆకర్షించింది. ప్రతి ఫ్లాట్ విలువ రూ.1.5 కోట్ల వరకు ఉంటుంది.

రివార్డ్ ప్రోగ్రాం ఇచ్చిన కంపెనీ ఇదే

చైనాలో జెజియాంగ్ గువోషెంగ్ ఆటోమోటివ్ టెక్నాలజీ అనే కంపెనీ ఈ హౌసింగ్ ఇనిషియేటివ్ ప్రారంభించింది. ఈ కంపెనీ.. ఆటోమోటివ్ విడిభాగాలు (కంపోనెంట్స్) తయారు చేస్తుంది. కంపెనీలో 450 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్నారు. చాలా మంది స్కిల్డ్ టెక్నికల్, మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్. ఉద్యోగలు ఎక్కువ కాలం (లాంగ్ టర్మ్‌) తమతో పనిచేసేందుకు కంపెనీ యాజమాన్యం కోరుకుంటోంది. ఉద్యోగులు తమ వద్ద ఉద్యోగం మానేసి వెళ్లిపోతే కంపెనీకి ఆపరేషన్స్‌ సమస్య వస్తంది. దాన్ని పరిష్కరించడానికి కంపెనీ యజమాన్యం హౌసింగ్ ఇన్‌సెంటివ్స్ ప్రవేశపెట్టారు.

కంపెనీ ఫ్లాట్లు ఎందుకు ఇస్తోంది?

Advertisement

చాలా మంది ఉద్యోగులు సొంత ఊళ్లకు దూరంగా పని చేస్తున్నారు. అందుకే మైగ్రెంట్ వర్కర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. వీరందరికీ వర్క్‌ప్లేస్ సమీపంలో అఫోర్డబుల్ హౌసింగ్ (బడ్జెట్‌లో ఇల్లు) దొరకడం కష్టం. పైగా ఇండస్ట్రియల్ ఏరియాల్లో రెంట్ ఖర్చు ఎక్కువ. రెంట్ ఇళ్లు లాంగ్ టర్మ్ గా అనిశ్చితంగా ఉంటాయి. మరోవైపు చాలా మందికి ఆస్తులు కొనుగోలు చేసే స్థాయి ఉండదు. ఇదంతా గమనించిన కంపెనీ యజమాన్యం ఉద్యోగులు పని ప్రదేశానికి సమీపంలో సెటిల్ అవ్వాలని కోరుకుంది. వారందరికీ ఫ్లాట్లు ఇస్తే హౌసింగ్ స్ట్రెస్ తగ్గుతుంది. పనిపై మరింత ఫోకస్ పెరుగుతుందని కంపెనీ ఆలోచన.

వర్క్‌ప్లేస్ సమీపంలోనే ఇళ్లు

ప్రతి ఫ్లాట్ 1,076 నుంచి 1,615 స్క్వేర్ ఫీట్లు ఉంటుంది. అన్ని ఫ్లాట్లు కంపెనీ ఇండస్ట్రియల్ బేస్ దగ్గర ఉన్నాయి. ప్రతి ఫ్లాట్ వర్క్‌ప్లేస్ నుంచి 5 కిలోమీటర్ల లోపు ఉంటుంది. ట్రావెల్ టైమ్ తగ్గి వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది. రోజూ సులువుగా ప్రయాణం చేయవచ్చు. టైమ్, స్ట్రెస్ సేవ్ అవుతాయి. పంక్చువాలిటీ (సమయానికి ఉద్యోగానికి రావడం), ప్రొడక్టివిటీ పెరుగుతాయి.

ఫ్లాట్ల ధరలు, కంపెనీ మొత్తంగా ఎంత ఖర్చు చేసింది?

Advertisement

ప్రతి ఫ్లాట్ ధర రూ.1.3 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల వరకు ఉంటుంది. కంపెనీ మొత్తం 18 ఫ్లాట్లు ఇప్పటికే కొనుగోలు చేసింది. ఇది భారీ ఫైనాన్షియల్ కమిట్‌మెంట్. కంపెనీ ఉద్యోగుల శ్రేయస్సు, తమ బిజినెస్ ఉత్పాదకత పెంచుకోవడానికి ఇది లాంగ్ టెర్మ్ పెట్టుబడిగా చూస్తోంది. కార్పొరేట్ రివార్డ్ ప్రోగ్రామ్స్‌లో ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ అరుదు.

Also Read: ఏఐ కాదు ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్న ప్రపంచ కుబేరులు.. భవిష్యత్తులో ఇదే డిమాండ్

ఉద్యోగులకు ఫ్లాట్ ఓనర్‌షిప్ అప్పుడే రాదు

ఫ్లాట్ ఓనర్‌షిప్ వెంటనే రాదు. ఐదు సంవత్సరాల కంటిన్యూస్ సర్వీస్ పూర్తి చేయాలి. అప్పుడే ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇది లాయల్టీ, స్టెబిలిటీని ప్రోత్సహిస్తుంది. మధ్యలో వదిలేస్తే ఓనర్‌షిప్ కంపెనీ దగ్గరే ఉంటుంది. ఉద్యోగులు రెనొవేషన్ ఖర్చు మాత్రమే పే చేయాలి. కొనుగోలు ఖర్చు పూర్తిగా కంపెనీదే.

ఫ్లాట్ల డిస్ట్రిబ్యూషన్ టైమ్‌లైన్ ఏమిటి?

కంపెనీ ఫ్లాట్లను క్రమంగా డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ ఏడాది ఐదు మంది ఉద్యోగులకు ఇస్తోంది. మిగతావాళ్లకు వచ్చే ఏడాది దక్కుతుంది. దశల వారీగా ఇళ్ల పంపిణీ జరుగుతుంది.

ఉద్యోగుల రిటెన్షన్‌కు కొత్త మోడల్

ఈ హౌసింగ్ ప్రోగ్రాం బలమైన ఉదాహరణ. ప్రాపర్టీని ఇన్‌సెంటివ్‌గా ఇచ్చే కంపెనీలు చాలా తక్కువ. క్రియేటివ్ రిటెన్షన్ (ఉద్యోగులన తమ వద్దే ఉంచుకోవడం) స్ట్రాటజీలను హైలైట్ చేస్తోంది. స్టేబుల్ హౌసింగ్ ఉద్యోగుల సంతృప్తిని పెంచుతుంది. సంతోషంగా ఉన్న వాళ్లు ఎక్కువ కాలం ఉంటారు. ఉద్యోగి టర్నోవర్ రేట్ (ఉద్యోగం మానేసి వెళ్లిపోయేవారి సంఖ్య) తగ్గుతుందని కంపెనీ ఆశిస్తోంది. ఇలాంటి ఇనిషియేటివ్స్ ప్రపంచవ్యాప్తంగా ఇతర కంపెనీలకు ఆదర్శంగా నిలుస్తాయి.

Related News

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

Big Stories

Advertisement
×