E-Paper
Advertisement

Tech Billionaires Investment: ఏఐ కాదు ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్న ప్రపంచ కుబేరులు.. భవిష్యత్తులో ఇదే డిమాండ్

Tech Billionaires Investment: ఏఐ కాదు ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్న ప్రపంచ కుబేరులు.. భవిష్యత్తులో ఇదే డిమాండ్
Advertisement

Tech Billionaires Investment In Human Life| ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ రాజ్యమేలుతుంది. కానీ టెక్ రంగంలో ప్రముఖులైన బిలియనీర్లంతా మరో రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. అందుకోసం వారి మధ్య పోటీ కూడా నెలకొంది. జెఫ్ బెజోస్, మార్క్ జకర్‌బర్గ్, దీపిందర్ గోయల్ లాంటి టాప్ బిలియనీర్లంతా ఇప్పుడు లాంగెవిటీ (మానవ జీవిత కాలాన్ని) పెంచే టెక్నాలజీలో పోటాపోటీగా పెట్టుబడులు పెడుున్నారు.

వృద్ధాప్యాన్ని జయించడం ఒక సైంటిఫిక్ ఛాలెంజ్‌గా ప్రయోగాలు సాగుతున్నాయి. ఈ ప్రయోగాల్లో మరణాన్ని ఒక జీవవైవిధ్య ఇంజినీరింగ్ సమస్యగా భావిస్తున్నారు. గత దశాబ్దంలో ఈ రంగంలో బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పోసారు. సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీలతో ఈ ఆశయాన్ని సాధించాలని ప్రయత్నిస్తున్నారు.

లాంగెవిటీ రీసెర్చ్‌కు నాయకత్వం వహిస్తున్న టెక్ దిగ్గజాలు

Advertisement

టెక్ బిలియనీర్ల వద్ద భారీ మూలధనం ఉంది. ప్రయోగాలు దీర్ఘకాలం సాగినా వారికి ఓర్చుకునే సామర్థ్యం ఉంది. లాంగెవిటీ రీసెర్చ్‌కు సమయం, డబ్బు, అధునాతన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరం. తక్షణ లాభాల ఒత్తిడి లేకుండా ప్రయోగాలకు నిధులు ఇవ్వగలరు. వారి కంపెనీలు ఇప్పటికే సైన్స్, డేటా మధ్య పనిచేస్తున్నాయి. ఇది సంక్లిష్ట బయోలాజికల్, AI రీసెర్చ్‌కు సహాయపడుతుంది.

లారీ ఎలిసన్ వృద్ధాప్య శాస్త్రంపై భారీ బెట్టింగ్

ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ వృద్ధాప్య రీసెర్చ్‌ కోసం బలంగా సపోర్ట్ చేస్తున్నారు. ఎలిసన్ మెడికల్ ఫౌండేషన్‌కు 430 మిలియన్ డాలర్లు దానం చేశారు. ఈ నిధులు.. వృద్ధాప్య బయాలజీని అర్థం చేసుకోవడానికే ఉపయోగపడతాయి. వృద్ధాప్య ప్రక్రియను గణనీయంగా నెమ్మదించవచ్చని ఆయన నమ్ముతున్నారు.

జెఫ్ బెజోస్ సెల్యులార్ రిజువెనేషన్ రీసెర్చ్‌లో పెట్టుబడులు

Advertisement

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ లాంగెవిటీ స్టార్టప్‌లలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఆల్టోస్ ల్యాబ్స్‌కు మద్దతు ఇస్తున్నారు. ఈ కంపెనీ సెల్యులార్ రిజువెనేషన్ టెక్నాలజీని అధ్యయనం చేస్తోంది. వృద్ధాప్య లక్షణాలను బట్టి చికిత్స చేయడం కాకుండా వ్యాధులను రివర్స్ చేయడమే లక్ష్యంగా ఈ ప్రయోగాలు సాగుతున్నాయి.

గూగుల్ వ్యవస్థాపకులు యాంటీ-ఏజింగ్ సైన్స్‌ను ఎలా ప్రోత్సహిస్తున్నారు?

గూగుల్ సహ-వ్యవస్థాపకుడు లారీ పేజ్ కాలికో ల్యాబ్స్ ద్వారా పెట్టుబడులు పెడుతున్నారు. కాలికో ఆరోగ్యకరమైన మానవ జీవిత కాలాన్ని పెంచడంపై దృష్టి పెడుతోంది. సెర్గీ బ్రిన్ పార్కిన్సన్ వ్యాధి రీసెర్చ్‌కు 900 మిలియన్ డాలర్ల పైగా ఇచ్చారు.

సామ్ ఆల్ట్‌మాన్ బయోలాజికల్ లైఫ్‌స్పాన్ ఎక్స్‌టెన్షన్‌పై దృష్టి

ఓపెన్ AI సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ రెట్రో బయోసైన్సెస్‌కు మద్దతు ఇస్తున్నారు. దాదాపు 180 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. ఈ కంపెనీ సగటు మానవ జీవిత కాలాన్ని 10 సంవత్సరాలు పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.

జుకర్‌బర్గ్, చాన్ లైఫ్ సైన్స్ ఇన్నోవేషన్‌

మార్క్ జుకర్‌బర్గ్, ప్రిస్సిల్లా చాన్.. చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ ద్వారా లైఫ్ సైన్స్ రీసెర్చ్‌కు నిధులు ఇస్తున్నారు. బ్రేక్‌త్రూ ప్రైజ్‌ను ప్రారంభించారు.

Also Read: 2025లో బెస్ట్ గేమింగ్ ఫోన్స్.. మిడ్ రేంజ్‌లో మంచి ఆప్షన్స్ ఇవే

లాంగెవిటీ ఇండస్ట్రీ ట్రిలియన్ డాలర్ మార్కెట్‌?

బ్యాంక్ ఆఫ్ అమెరికా రిపోర్ట్ ప్రకారం.. లాంగెవిటీ సైన్స్ పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి. ఇండస్ట్రీ విలువ దాదాపు 54.2 ట్రిలియన్ రూపాయలకు చేరవచ్చు. మానవ జీవిత కాలాన్ని 120 సంవత్సరాలకు పెంచడమే లక్ష్యం.

బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌ల పురోగతి

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకారం.. బ్రెయిన్ టెక్నాలజీలో ఆసక్తి పెరుగుతోంది. దాదాపు 700 కంపెనీలు బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ రీసెర్చ్‌లో ఉన్నాయి. 2030 నాటికి ఈ సెక్టార్ 5.6 ట్రిలియన్ రూపాయలకు చేరవచ్చు.

భారత్ కూడా లాంగెవిటీ టెక్నాలజీ రేస్‌లో చేరిందా?

భారత్ కూడా లాంగెవిటీ టెక్నాలజీలో చేరుతోంది. జొమాటో, బ్లింకిట్ పేరెంట్ కంపెనీ ఎటర్నల్ ఈ ప్రయత్నానికి నాయకత్వం వహిస్తోంది. సీఈఓ దీపిందర్ గోయల్ “టెంపుల్” ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఇది బ్రెయిన్ యాక్టివిటీ సిగ్నల్స్ కొలిచే వేరబుల్ డివైస్.

ఫైనల్ అవుట్‌లుక్
లాంగెవిటీ టెక్నాలజీలో అపూర్వమైన ప్రపంచ పెట్టుబడులు వస్తున్నాయి. టెక్ బిలియనీర్లు మానవ వృద్ధాప్యాన్ని సైన్స్ మార్చగలదని నమ్ముతున్నారు. ఈ రీసెర్చ్ హెల్త్‌కేర్, మానవ జీవిత కాలాన్ని మార్చేసే అవకాశాలున్నాయి.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×