E-Paper
Advertisement

ఏసీ కొంటున్నారా? కాపర్ vs అల్యూమినియం.. ఏ కాయిల్ బెస్ట్?

ఏసీ కొంటున్నారా? కాపర్ vs అల్యూమినియం.. ఏ కాయిల్ బెస్ట్?
Advertisement

Copper Coil vs Aluminium Coil AC: సాధారణంగా కొత్త ఏసీ కొనేముందు చాలా మందిని ఓ సందేహం వెంటాడుతుంది. ‘కాపర్ కాయిల్ ఏసీ కొనాలా? అల్యూమినియం కాయిల్ ఏసీ కొనాలా? అని చాలా మంది తెగ ఆలోచిస్తుంటారు. విద్యుత్ ను ఆదా చేయడంలో ఏ కాయిల్ బెస్ట్ అని తెగ సెర్చ్ చేస్తుంటారు. ఈ గందరగోళాన్ని ఈ ప్రత్యేక కథనంలో పటాపంచలు చేసే ప్రయత్నం చేద్దాం. కాపర్ vs అల్యూమినియం కాయిల్స్ మధ్య తేడాలు, వాటి వల్ల కలిగే లాభనష్టాలు ఇప్పుడు చూద్దాం.

విద్యుత్ ఆదా పరంగా..

విద్యుత్ ఆదా పరంగా చూస్తే కాపర్ కాయిల్స్ ఏసీ స్పష్టమైన పైచేయి సాధించింది. సైన్స్ పరంగా చూస్తే అల్యూమినియం కంటే రాగికి (Copper) వేడిని త్వరగా గ్రహించే శక్తి ఉంటుంది. అదే విధంగా చాలా వేగంగా వేడిని బయటకు పంపగలదు. కాబట్టి కాపర్ కాయిల్స్ ఉన్న ఏసీలు గదిని చాలా వేగంగా చల్లబరుస్తాయని చెప్పవచ్చు. రూమ్ త్వరగా కూల్ అవ్వడం వల్ల ఏసీ కంప్రెషర్ తక్కువ సమయం పనిచేస్తుంది. దీనివల్ల కరెంట్ బిల్లు గణనీయంగా తగ్గుతుంది.

మన్నిక ఏది ఎక్కువంటే?

Advertisement

మన్నిక పరంగా చూసినా కూడా కాపర్ కాయిలే విజేతగా నిలుస్తోంది. అల్యూమినియంతో పోలిస్తే రాగి చాలా గట్టి లోహం. ఏసీ నడుస్తున్నప్పుడు లోపల ఉండే అధిక ఒత్తిడిని కాపర్ కాయిల్స్ సులభంగా తట్టుకుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు అల్యూమినియం కాయిల్స్ త్వరగా తుప్పు పట్టే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా తీరప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువ ఉన్న నగరాల్లో అల్యూమినియం కాయిల్స్ త్వరగా లీక్ దెబ్బతినే ప్రమాదముందని పేర్కొంటున్నారు. కాబట్టి అల్యూమియంతో పోలిస్తే.. కాపర్ కాయిల్స్ ప్రతీకూల పరిస్థితులను ఎక్కువ కాలం తట్టుకుంటాయని తెలియజేస్తున్నారు.

రిపేర్, మెయింటెనెన్స్

ఏసీ వాడుతున్నప్పుడు ఎప్పుడైనా కాయిల్స్ లీక్ అయితే కాపర్ కాయిల్స్‌కు సులభంగా వెల్డింగ్ చేసి రిపేర్ చేయవచ్చు. కానీ అల్యూమినియం కాయిల్స్ లీక్ అయితే వాటికి రిపేర్ చేయడం చాలా కష్టం. చాలా సందర్భాల్లో మొత్తం కాయిల్ సెట్‌నే మార్చాల్సి వస్తుంది. దీనివల్ల పెద్ద మెుత్తంలో ఖర్చయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి రిపేర్, మెయింటెనెన్స్ పరంగా చూసినా కాపర్ కాయిల్ ఉన్న ఏసీ బెస్ట్ అని చెప్పవచ్చు.

మరి బడ్జెట్ సంగతేంటి?

Advertisement

ఒక్క బడ్జెట్ విషయంలో మాత్రం.. అల్యూమినియం కాయిల్స్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. అల్యూమినియంతో పోలిస్తే రాగి ధర మార్కెట్లో ఎక్కువ కాబట్టి.. కాపర్ కాయిల్ ఏసీల ధరలు మార్కెట్లో కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ లో ఏసీ కొనాలనుకునే వారికి అల్యూమినియం కాయిల్ ఏసీలు తక్కువ ధరకే లభిస్తాయి.

Also Read: గంటకు రూ.4 ఖర్చుతో కూలింగ్.. మార్కెట్లోకి సరికొత్త ఏసీ.. ధర రూ.14,499 మాత్రమే!

ఓవరాల్‌గా ఏది కొంటే లాభం?

ఖర్చు పెట్టే బడ్జెట్ కు న్యాయం జరగాలన్నా, లాంగ్ రన్ లో కరెంటు బిల్లు ఆదా కావాలన్న కాపర్ కాయిల్ ఉన్న ఏసీని ఎంచుకోవడం మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొనేటప్పుడు కాపర్ ఏసీ ధర కొంచెం ఎక్కువగా అనిపించినప్పటికీ.. మన్నిక, విద్యుత్ ఆదా, తక్కువ రిపేర్లు బట్టి చూస్తే ఆ డబ్బు ఆదా అవుతుందని పేర్కొంటున్నారు. కాబట్టి కొత్తగా ఏసీ కొనేటప్పుడు స్పెసిఫికేషన్లలో ‘100% Copper’ ఉందో లేదో ఖచ్చితంగా చూసి కొనుగోలు చేస్తే బెటర్.

Also Read: ఇంటర్నల్ మెమరీ vs SD కార్డ్.. మీ స్మార్ట్‌ఫోన్‌కు ఏది ఉంటే బెస్ట్?

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×