Oakter Window AC: ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ హోమ్ అప్లయన్స్ బ్రాండ్ ‘ఓక్టర్’ (Oakter) నగరాల్లోని చిన్న గదుల కోసం సరికొత్త ఇన్వర్టర్ విండో ఏసీని మార్కెట్లోకి విడుదల చేసింది. ‘స్టూడియో ఏసీ 5000 (2026 మోడల్)’ పేరుతో వచ్చిన ఈ ఏసీ.. తక్కువ స్థలంలో ఫిట్ అవ్వడంతో పాటు విద్యుత్ ను చాలా పొదుపుగా వినియోగిస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. నగరాల్లో తక్కువ బడ్జెట్ లో ఏసీ కొనాలని చూస్తున్నవారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అంటూ తెలియజేస్తున్నాయి.
ఓక్టర్ తన సరికొత్త విండో ఏసీని 0.5 టన్ సామర్థ్యంతో 3-స్టార్ ఎనర్జీ రేటింగ్ తో లాంచ్ చేసింది. ఇది నగరాల్లోని స్టూడియో అపార్ట్‌మెంట్లు, చిన్న స్టడీ రూములు, ఆఫీస్ క్యాబిన్లు ఉన్న వారికి ఎంతో అనువుగా ఉండనుంది. దీని బరువు కేవలం 22 కేజీలు మాత్రమే ఉండడం వల్ల చాలా ఈజీగా గదిలో ఫిక్స్ చేయవచ్చు.
పాత మోడల్స్‌లోని ఫిక్స్‌డ్ స్పీడ్ కంప్రెసర్ స్థానంలో ఈ సరికొత్త మోడల్‌లో ఇన్వర్టర్ టెక్నాలజీని ఓక్టర్ ప్రవేశపెట్టింది. ఇది గది ఉష్ణోగ్రతకు అనుగుణంగా కూలింగ్‌ను అందిస్తూ 60% వరకు విద్యుత్‌ను ఆదా చేస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇది కేవలం 500 వాట్ల విద్యుత్‌ను మాత్రమే వాడుకుంటుందని పేర్కొన్నాయి. అంటే దాదాపు 2 గంటల పాటు రన్ చేసినా ఒక యూనిట్ కరెంట్ మాత్రమే ఖర్చు కానుంది. అంటే గంటకు కేవలం రూ.4 ఖర్చుతోనే ఇది చల్లదనాన్ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
ఈ ఏసీకి ఎలాంటి ప్రత్యేక వైరింగ్ అవసరం లేదని ఓక్టర్ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ఇంట్లోని సాధారణ 6A పవర్ సాకెట్‌కు కనెక్ట్ చేసి నేరుగా వాడుకోవచ్చని సూచిస్తున్నారు. అంతేకాకుండా పవర్ కట్ అయినప్పుడు ఇంట్లో ఉండే 1200VA నార్మల్ ఇన్వర్టర్‌పై కూడా ఇది రన్ అవుతుంది. ఇందులో ఇన్ బిల్ట్ సర్జ్ ప్రొటెక్షన్, యాంటీ డస్ట్ ఫిల్టర్, తక్కువ శబ్దం చేసే ఫీచర్లు ఉన్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.
Also Read: ఏసీ, కూలర్లు లేకున్నా.. పాత ఇళ్లు ఎందుకంత చల్లగా ఉంటాయ్? పూర్వీకుల ‘ఇంటి గుట్టు’ ఇదే!
ఈ సరికొత్త ఇన్వర్టర్ విండో ఏసీ ప్రారంభ ధర రూ. 14,499గా కంపెనీ నిర్ణయించింది. ఇది ఓక్టర్ అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. దీనిపై 1 సంవత్సరం ప్రొడక్ట్ వారంటీ, కంప్రెసర్‌పై 5 ఏళ్ల వారంటీని కంపెనీ ఆఫర్ చేస్తోంది. తక్కువ బడ్జెట్ లో విండో ఏసీని కోరుకునేవారు దీనిని ట్రై చేయవచ్చని నిపుణులు సైతం సూచిస్తున్నారు.
Also Read: ఏసీ గదిలో స్టాండ్ ఫ్యాన్.. తర్వాత జరిగే మ్యాజిక్కే వేరు.. నిజంగా ఆశ్చర్యపోతారు!