E-Paper
Advertisement

వైఫై కనెక్టివిటీతో పనిచేసే సీసీ కెమెరా.. కొత్త వాళ్లు కనిపిస్తే ఫోన్‌కు అలర్ట్

వైఫై కనెక్టివిటీతో పనిచేసే సీసీ కెమెరా.. కొత్త వాళ్లు కనిపిస్తే ఫోన్‌కు అలర్ట్
Advertisement

CP PLUS WiFi camera: ప్రస్తుతం ఇల్లు, ఆఫీస్ లేదా షాప్‌ల సేఫ్టీ ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండటం చాలా ముఖ్యం. మనం ఎక్కడో దూరంగా ఉన్నప్పటికీ, మన ఇంట్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా తెలుసుకోవడానికి సెక్యూరిటీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అయితే.. ఎక్కువ బడ్జెట్ పెట్టి పెద్ద సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోలేము అనుకునే వారి కోసం ప్రముఖ బ్రాండ్ ‘CP PLUS’ అత్యంత నమ్మకమైన, బడ్జెట్ ఫ్రెండ్లీ వైఫై కెమెరాలను అందిస్తోంది. అందులో మార్కెట్లో.. విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మోడల్  ఇది.  కేవలం రూ.2,249 ధరతో అందుబాటులో ఉన్న ఈ కెమెరా గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

అద్భుతమైన ఫుల్ హెచ్‌డి క్లారిటీ ,డిజైన్:

ఈ కెమెరా చిన్న సైజులో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది 2MP ఫుల్ హెచ్‌డి రెజల్యూషన్‌తో వస్తుంది. కాబట్టి దీని వల్ల రికార్డయ్యే వీడియోలు , ఇమేజ్‌లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. రాత్రి సమయంలో.. కూడా స్పష్టమైన విజువల్స్ అందించే నైట్ విజన్ ఫీచర్ ఇందులో ఉంది. ఇల్లు పూర్తిగా చీకటిగా ఉన్నా సరే..  ఏ మూలలో ఏం జరుగుతుందో ఇది స్పష్టంగా రికార్డ్ చేస్తుంది. అంతే కాకుండా చాలా అద్భుతమైన డిస్ ప్లే క్లారిటీ కలిగి ఉండటం కూడా దీని ప్రత్యేకత అని చెప్పొచ్చు.

360-డిగ్రీ పాన్ అండ్ టిల్ట్ కవరేజ్:

Advertisement

సాధారణ కెమెరాలు ఒకే దిశలో మాత్రమే రికార్డ్ చేస్తాయి. కానీ ఈ మోడల్ కెమెరా 360-డిగ్రీల కోణంలో తిరుగుతుంది. మొబైల్ యాప్ సహాయంతో.. మీరు ఎక్కడి నుంచైనా కెమెరాను పైకి, క్రిందకు, కుడికి, ఎడమకు తిప్పుకుంటూ ఇల్లు మొత్తం చెక్ చేయొచ్చు. దీనివల్ల ఏ ఒక్క మూల కూడా మీ దృష్టికి దూరం కాదు.

Also Read:  మార్కెట్‌లో దుమ్ము రేపుతున్న స్మార్ట్ వాచ్..యూత్‌కు పర్ఫెక్ట్

టూ-వే టాకింగ్ , స్మార్ట్ కనెక్టివిటీ:

Advertisement

ఈ కెమెరాలో ‘ప్రెస్ టు టాక్’ లేదా టూ-వే ఆడియో ఫీచర్ అందుబాటులో.. ఉంది. దీని ద్వారా మీరు ఆఫీస్ లో ఉండి కూడా మీ ఇంట్లో ఉన్న పిల్లలు లేదా పెద్ద వారితో నేరుగా మాట్లాడొచ్చు. అలాగే ఇంట్లో.. ఎవరైనా అనుమానాస్పదంగా తరిగితే మొబైల్‌కు వెంటనే అలర్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ కెమెరా వైఫై కనెక్టివిటీతో పని చేస్తుంది కాబట్టి సెటప్ చేయడం చాలా ఈజీ. అంతేకాకుండా ఇందులో 128 GB వరకు ఎస్డీ కార్డ్ సపోర్ట్ లభిస్తుంది. దీనివల్ల ఎక్కువ రోజుల వీడియో ఫుటేజ్‌ను సేఫ్ గా ఉంచుకోవచ్చు.

తక్కువ బడ్జెట్‌లో.. ప్రీమియం సెక్యూరిటీ ఫీచర్లు కోరుకునే వారికి ఈ మోడల్ వై ఫై కెమెరా నిజంగా ఒక సూపర్ ఛాయిస్. కేవలం రూ. 2,249 ధర లో లభించడం దీని అతి పెద్ద ప్లస్ పాయింట్. మీరు కూడా మీ ఇల్లు లేదా షాప్ సేఫ్టీ కోసం మంచి కెమెరా కొనాలని ప్లాన్ చేస్తుంటే.. దీనిని నిరభ్యంతరంగా మీ లిస్ట్ లో చేర్చుకోవచ్చు.

Related News

మార్కెట్‌లోకి కొత్త మోడల్ ఇయర్‌బడ్స్..ఇది నిజంగా సూపర్!

రూ.5,899 ధరకే.. 24 ఇంచుల థామ్సన్ టీవీ!

స్టైలిష్ లుక్, పవర్ ఫుల్ సౌండ్..ఏంటీ తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లా ?

iPhone 17 దూసుకెళ్తుంటే.. 17e మాత్రం టాప్-5లో లేదు, అసలు కారణం ఇదే!

ప్రొజెక్టర్ డిస్‌ప్లే మసకగా ఉందా? ఈ 4 మార్పులు చేస్తే సినిమా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పక్కా!

మార్కెట్‌లో దుమ్ము రేపుతున్న స్మార్ట్ వాచ్..యూత్‌కు పర్ఫెక్ట్

రూ.30,000 లోపు కన్వర్టిబుల్ రిఫ్రిజిరేటర్లు.. చిటికెలో ఫ్రీజర్‌ను ఫ్రిడ్జ్‌గా మార్చుకోవచ్చు!

Big Stories

Advertisement
×