E-Paper
Advertisement

GHMC property tax: ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై జీహెచ్ఎంసీ ఫోకస్.. 200 మందికి రెడ్ నోటీసులు

GHMC property tax: ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై జీహెచ్ఎంసీ ఫోకస్.. 200 మందికి రెడ్ నోటీసులు
Advertisement

GHMC property tax:  కోర్ అర్బన్ రీజియన్ ప్రజలకు పౌర, అత్యవసర సేవలందిస్తున్న మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇప్పటి వరకు సుమారు రూ. 2163 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ ను కలెక్షన్ చేసుకున్నాయి. మూడు కార్పొరేషన్ల ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై మూడు కార్పొరేషన్లు పోకస్ పెట్టయి. కార్పొరేషన్ల ఆర్థిక వనరుల్లో ప్రధానమైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై ఈ నెలాఖరు వరకు స్పెషల్ దృష్టి సారించాలని కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వేల కోట్లలో పేరుకుపోయిన మొండి బకాయిల వసూళ్ల కోసం ఈ సారి వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్)ను కాస్త ముందుగానే అమల్లోకి తెచ్చినా, అధికారులు అంచనాల మేరకు ట్యాక్స్ వసూలు కాలేదు.

రూ. 2163 కోట్ల ట్యాక్స్ వసూళ్లు 

దీనికి ఓటీఎస్ పై ప్రజల్లో సరైన అవగాహన కల్పించటంలో విఫలమైన జీహెచ్ఎంసీ వర్తమాన ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లోనైనా వీలైనంత ఎక్కువ ట్యాక్స్ ను వసూలు చేసుకునేందుకు ఓటీఎస్ పై అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయటంతో పాటు ప్రాపర్టీ ట్యాక్స్ కు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఆదివారం అన్ని సర్కిళ్లలో ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు కలెక్షన్ చేసిన మొత్తం రూ. 2163 కోట్ల ట్యాక్స్ వసూళ్లలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోని సుమారు రూ. 814 కోట్ల వరకు ట్యాక్స్ కలెక్షన్ చేసినట్లు, సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో కలిపి రూ. 1349 కోట్ల వరకు ట్యాక్స్ వసూలు చేసినట్లు వెల్లడించారు.

Advertisement

Also Read: New Passport Rules: పాస్‌ పోర్ట్ రూల్స్ ఛేంజ్, ఆ సర్టిఫికేట్ లేకపోతే ఇక అంతే సంగతులు!

టార్గెట్ రూ. 3 వేల కోట్లు చేరేనా?

మూడు కార్పొరేషన్ల పరిధిలో వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26) కు సంబంధించి రూ. 3 వేల కోట్ల ట్యాక్స్ కలెక్షన్ ను టార్గెట్ గా పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ. 2163 కోట్ల మేరకు ట్యాక్స్ కలెక్షన్ అయింది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా కేవలం 19 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. టార్గెట్ చేరుకునేందుకు ఇంకా మగిలిన రూ. 837 కోట్ల మేరకు ట్యాక్స్ వసూలు చేయాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో అధికారుల అంచనాలు, టార్గెట్లకు మించి ఏకంగా రూ. 2038 కోట్ల ట్యాక్స్ వసూలైంది. ఈ సారి 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో రూ. 3 వేల కోట్లను టార్గెట్ గా పెట్టుకున్నారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటైనప్పటికీ, ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఖాతాలోనే కొత్త కార్పొరేషన్ల ప్రాపర్టీ ట్యాక్స్ క్రెడిట్ అవుతున్నట్లు సమాచారం. మూడు కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 23 లక్షల 50 వేల ప్రాపర్టీలకు చెందిన ట్యాక్స్ క్రెడిట్ అవుతున్నట్లు తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఏప్రిల్ 1వ తేదీ నుంచి రెండు కొత్త కార్పొరేషన్లకు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతాలను తెరవనున్నట్లు సమాచారం.

ముమ్మరం కానున్న సీజింగ్ లు

Advertisement

జీహెచ్ఎంసీకి వర్తమాన ఆర్థిక సంవత్సరం ట్యాక్స్ బకాయిలు కాకుండా, ఏళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిలపై విధించిన వడ్డీని వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద 90 శాతం రాయితీ కల్పిస్తున్నా, అధికారులు ఆశించిన స్థాయిలో మొండి బకాయిదారులు పన్ను చెల్లించేందుకు ముందుకు రావటం లేదన్న విషయాన్ని గుర్తించిన అధికారులు టాప్ 200 మొండి బకాయిదారులను గుర్తించి, వారికి ఫైనల్ రెడ్ నోటీసులు జారీ చేసి, ప్రాపర్టీలను సీజ్ చేసే ప్రక్రియను మరింత ముమ్మరం చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే సీజింగ్ ప్రక్రియను అమల్లోకి తెచ్చిన జీహెచ్ఎంసీ త్వరలోనే పోలీసుల సహకారంతో బడా బకాయిదారుల ప్రాపర్టీలను సిద్దం చేసేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలిసి,ది.

Also Read: Car Mileage Tips: మీ కారు ఎక్కువ మైలేజ్ ఇవ్వాలా.. ఇలా చేయండి భయ్యా.. వద్దన్నా వెళ్తుంది!

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×