E-Paper
Advertisement

పెద్ద పెద్ద బ్రాండ్లకే చెమటలు పట్టించేలా.. భారీ బ్యాటరీతో Huawei Nova 15 Max లాంచ్, ఇక చూసుకో రచ్చ రచ్చే!

పెద్ద పెద్ద బ్రాండ్లకే చెమటలు పట్టించేలా.. భారీ బ్యాటరీతో Huawei Nova 15 Max లాంచ్, ఇక చూసుకో రచ్చ రచ్చే!
Advertisement

Huawei Nova 15 Max: లక్షల రూపాయలు పెట్టి కొన్న స్మార్ట్‌ఫోన్లలలో కూడా చాలామందికి ఎదురయ్యే కామన్ సమస్య.. బ్యాటరీ. సరిగ్గా ఇదే పాయింట్‌ను పట్టుకున్న ప్రముఖ టెక్ సంస్థ హువావే.. తమ కొత్త మోడల్ Nova 15 Maxను థాయ్‌లాండ్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. కొద్దిరోజుల నుంచి ఊరిస్తున్నట్లే.. ఈ ఫోన్‌ను భారీ ఫీచర్లతో మార్కెట్లోకి దించింది సంస్థ. ముఖ్యంగా దీనిలో ఉన్న 8,500mAh బ్యాటరీ ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి ఛార్జింగ్ గురించి మర్చిపోవచ్చు అని చెబుతోంది కంపెనీ.

పిచ్చెక్కించేలా ఫోన్ కలర్స్:

ఈ ఫోన్ లుక్ పరంగా చాలా రిచ్‌గా కనిపిస్తుంది. చైనాలో వచ్చిన Enjoy 90 Pro Maxకు ఇది అప్‌డేటెడ్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీనిలో 6.84 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఇచ్చారు. స్క్రోలింగ్ చేసేటప్పుడు చాలా స్మూత్‌గా ఉండేలా 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. దీంతో సినిమాలు చూసినా, గేమ్స్ ఆడినా ఆ ఎక్స్‌పీరియన్స్ వేరే లెవల్లో ఉంటుంది. ఇక కలర్స్ విషయానికొస్తే.. బ్లష్ గోల్డ్, గోల్డెన్ బ్లాక్, లేక్ సైయన్ వంటి అదిరిపోయే రంగుల్లో ఇది కనువిందు చేయనుంది.

Advertisement

Also Read: అమెజాన్‌లో పిచ్చెక్కించే సేల్.. శాంసంగ్ టాప్ ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్, స్టాక్ అయిపోయేలోపే పట్టేయండి!

కెమెరానే హైలైట్:

ఈ Huawei Nova 15 Max ఫోన్ వెనుక వైపు రౌండ్ షేప్‌లో ఉన్న కెమెరా సెటప్ చూడటానికి చాలా కొత్తగా ఉంది. దీనిలో 50MP మెయిన్ కెమెరా ఉంది. ఇది ఫొటోలను చాలా క్లారిటీగా తీస్తుంది. ఇక సెల్ఫీల కోసం 8MP కెమెరా ఇచ్చారు. ప్రాసెసర్ గురించి కంపెనీ క్లారిటీ ఇవ్వకపోయినా.. దీనిలో కిరిన్ 8000 చిప్‌సెట్ వాడి ఉండొచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ ఫోన్‌లో ఒక స్పెషల్ X బటన్ ఉంది. మనకు కావాల్సిన యాప్స్ లేదా షార్ట్‌కట్ పనులను దీని ద్వారా చిటికెలో చేసేయొచ్చు.

ధర వివరాలు ఇలా:

Advertisement

ఇక అసలు విషయానికొస్తే.. ఈ ఫోన్ మెయిన్ హైలైట్ ఆ భారీ బ్యాటరీనే. దీనికి తోడు 40W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉండటంతో బ్యాటరీ త్వరగానే ఫుల్ అవుతుంది. ఫోన్ గట్టితనం విషయంలో కూడా హువావే బాగానే ప్లాన్ చేసింది. దీనికి SGS ఫైవ్ స్టార్ సర్టిఫికేషన్ కూడా ఉంది. దీంతో కింద పడినా త్వరగా దెబ్బతినదు. ఐరోపాలో దీని ధర సుమారు రూ.40వేల పైచిలుకు ఉంది. త్వరలోనే మన దగ్గరకు కూడా వచ్చే అవకాశం ఉంది. బ్యాటరీ లైఫ్ ముఖ్యం అనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది.

Also Read: ఈ ప్రైస్‌లో ఇలాంటి TVs దొరకడం ఇంపాజిబుల్.. రూ.11 వేలకే గూగుల్ సాఫ్ట్‌వేర్, డాల్బీ సౌండ్‌తో థామ్సన్ కొత్త టీవీలు!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×