Prakasam Crime: ఏపీలో దారుణం జరిగింది. జైలులో ఉన్న భర్తకు బెయిల్ పై తీసుకొచ్చి మరీ హత్య చేయించింది భార్య. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలకు చెందిన శ్రీను ఇటీవల గంజాయి కేసులో పట్టుబడి జైలుకు వెళ్లాడు. అతడికి బెయిల్ ఇప్పించిన భార్య ఝాన్సీ, కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. శ్రీను జైలుకు వెళ్లే ముందే తన భార్యతో వివాహేతర సంబంధంపై తరచూ గొడవ పడేవాడని సమాచారం. తన భర్తతో ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని భావించిన ఝాన్సీ, జైల్లో ఉన్న భర్తకు బెయిల్ ఇప్పించి బయటకు రాగానే రూ. 2 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేసింది. అయితే భర్తను హత్య చేసేందుకు ఆమె తమ్ముడు సహకరించాడు.
ప్రియుడి మోజులో భర్తను హత్య చేయడం సంచలనంగా మారింది. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భార్య తన తమ్ముడి సాయంతో హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోర్నాలకు చెందిన అడపాల లాలు శ్రీను (38)కు సున్నిపెంటకు చెందిన ఝాన్సీతో 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. శ్రీను లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే కొంత కాలంగా శ్రీను చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. రెండు నెలల క్రితం గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టై ఒంగోలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఝాన్సీ.. తన సోదరుడి స్నేహితుడైన సూర్యనారాయణతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం భర్తకు తెలియడంతో వీరి మధ్య విభేదాలు పెరిగాయి.
జైలులో ఉన్న శ్రీనును చూసేందుకు వెళ్లిన ఝాన్సీతో.. ఆమెతో పాటు సూర్యనారాయణను చంపేస్తానని బెదిరించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. శ్రీను జైలు నుంచి విడుదలైతే తమ ప్రాణాలకు ముప్పు అని భావించిన ఝాన్సీ, సూర్యనారాయణతో కలిసి హత్యకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గుంటూరుకు చెందిన ఒక గ్యాంగ్‌కు రూ.2 లక్షలు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయాలని చెప్పింది ఝాన్సీ.
Also Read: రుణం తీర్చుకోలేక కాదు.. రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక! సామర్లకోటలో వ్యక్తి ఆత్మహత్య
జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన శ్రీనును చిమకుర్తి-పొదిలి మధ్యలో హత్య చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. అది ఫెయిల్ అయింది. పెద్దారవీడు మండలం అంకారమ్మ గుడి సమీపంలో మరోసారి హత్యకు ప్లా్న్ చేశారు. శ్రీను వస్తున్న కారును అడ్డుకుని.. బైక్‌పై వచ్చిన సూర్యనారాయణ, అతని స్నేహితుడు శ్రీను చేశారు. భార్య ఝాన్సీ, ఆమె తమ్ముడు కూడా ఈ దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాల పాలైన శ్రీను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.