E-Paper
Advertisement

Fake Doctor Couple Arrested: యశోద ఆసుపత్రిలో డాక్ట‌ర్ గా న‌టిస్తూ.. మత్తు ఇంజక్షన్‌తో రోగులను లూటీ చేస్తున్న కిలేడీ

Fake Doctor Couple Arrested: యశోద ఆసుపత్రిలో డాక్ట‌ర్ గా న‌టిస్తూ.. మత్తు ఇంజక్షన్‌తో రోగులను లూటీ చేస్తున్న కిలేడీ
Advertisement

Fake Doctor Couple Arrested: వైద్యురాలి ముసుగులో ఆసుపత్రుల్లోని అమాయక రోగులకు మత్తుమందు ఇచ్చి దోచుకుంటున్న ఒక మహిళను.. ఆమెకు సహకరిస్తున్న భర్తను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్.. మార్కెట్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో వికారాబాద్ జిల్లాకు చెందిన ఈ కిలేడీ దంపతులు పట్టుబడ్డారు. విలాసవంతమైన జీవితం కోసం.. సులభంగా డబ్బు సంపాదించేందుకు వీరు ఎంచుకున్న మార్గం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది.

వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలానికి చెందిన గౌండ్ల శిరీష (25) ప్రస్తుతం డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (Pharm.D) చదువుతోంది. తన వైద్య పరిజ్ఞానాన్ని నేరాలకు వాడుకోవాలని పథకం వేసింది. ఈ కుట్రలో ఆమె భర్త ఎడులపల్లి సాయి కుమార్ గౌడ్ (30) పూర్తిస్థాయిలో సహకరించాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు రోగులనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు తెరలేపారు.

Advertisement

నిందితురాలు శిరీష తెల్లటి డాక్టర్ ఆప్రాన్ ధరించి ప్రముఖ ఆసుపత్రులలోకి ప్రవేశించేది. వార్డుల్లో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళా రోగులను గుర్తించి తనను తాను డాక్టర్‌గా పరిచయం చేసుకునేది. వైద్య పరీక్షల పేరుతో బాధితులకు ‘డయాజెపామ్’ (Diazepam) అనే శక్తివంతమైన మత్తు ఇంజక్షన్‌ను ఇచ్చేది. రోగులు స్పృహ కోల్పోయిన వెంటనే వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరించి బయట వేచి ఉన్న భర్తతో కలిసి కారులో పరారయ్యేది. ఈ నెల 11న సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి.. చందానగర్‌లోని సిటిజన్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వీరు ఇదే తరహాలో చోరీలకు పాల్పడ్డారు.

పోలీసులు నిందితుల నుంచి సుమారు 11 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి వాడిన మారుతీ సుజుకీ బాలెనో కారు.. రెండు సెల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు. దొంగిలించిన సొమ్ముతో ఈ దంపతులు విలాసవంతమైన షాపింగ్.. ఇతర జల్సాలు చేసినట్లు విచారణలో తేలింది. వీరిపై మార్కెట్.. చందానగర్ పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

Advertisement

సికిందరాబాద్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ జె. రాజశేఖర్.. మార్కెట్ ఎస్.హెచ్.ఓ. వి. రామచందర్ బృందం అత్యంత చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకుంది. ఆసుపత్రులకు వచ్చే రోగులు అపరిచిత వ్యక్తులు ఇచ్చే మందులు.. ఇంజక్షన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు. ఆసుపత్రి సిబ్బంది కాని వారు వార్డుల్లోకి ప్రవేశించకుండా యాజమాన్యాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

Related News

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

Big Stories

Advertisement
×