Earbuds Sound Problem: వీకెండ్‌లో ల్యాప్‌టాప్‌లో మనసుకు నచ్చిన సినిమా పెట్టుకుని, ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా రెండు చెబుల్లో ఇయర్‌బడ్స్ పెట్టుకుని పాటల్లోని ప్రతి బీట్‌ను, సినిమాలో ప్రతి డైలాగ్‌ను మైమరిచిపోయి ఎంజాయ్ చేస్తున్న టైంలో… సడన్‌గా ఒక ఇయర్‌బడ్‌లో సౌండ్ తగ్గిపోతుంటుంది? అయ్యో.. అప్పుడే పాడైపోయిందా? మళ్లీ కొత్తది కొనాలా? అని వెంటనే మూడ్ ఆఫ్ అయిపోతుంటారు చాలామంది. ఒకవైపు ఫుల్ బేస్, ఇంకోవైపు సన్నటి రీసౌండ్ వింటూ ఆడియోను బ్యాలెన్స్ చేయడం నిజంగా చిరాకు. అయితే, తొందరపడి ఆ ఇయర్‌బడ్స్‌ను పక్కన పడేయకుండా.. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే.. రూపాయి ఖర్చు లేకుండా సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ముందుగా.. అసలు సమస్య మీ చెవిదా, ఇయర్‌బడ్స్‌దా లేక ఫోన్‌దా అని కచ్చితంగా అర్థం చేసుకోవాలి. మీరు వాడుతున్న కుడి ఇయర్‌బడ్‌ను ఎడమ చెవికి, ఎడమ ఇయర్‌బడ్‌ను కుడి చెవికి పెట్టుకుని చెక్ చేయండి. లేదా మీ ఫ్రెండ్స్‌ను ఆ ఇయర్‌బడ్స్ పెట్టుకుని వినమని చెప్పండి. అప్పుడూ ఒకే వైపు సౌండ్ తేడాగా వస్తే, కచ్చితంగా మీ ఇయర్‌బడ్స్‌లో లేదా ఫోన్ సాఫ్ట్‌వేర్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్లే అని ఫిక్స్ అవ్వొచ్చు.
Also Read: పెద్ద ట్విస్ట్ ఇచ్చిన యాపిల్.. ఫోల్డబుల్ ఐఫోన్ పేరు అల్ట్రా కాదట? లీకైన అసలు పేరు ఇదే!
ఇయర్‌బడ్స్ వాడేకొద్దీ వాటిలో దుమ్ము, చెవిలోని గులిమి పేరుకుపోయి సౌండ్ సరిగ్గా రాకుండా అడ్డుపడతాయి. కాబట్టి.. ఒక పొడి గుడ్డ లేదా కాటన్ స్వాబ్ తీసుకుని సున్నితంగా శుభ్రం చేయండి. అందులోని సిలికాన్ రబ్బర్ టిప్స్ తీసివేసి, గోరువెచ్చని సబ్బు నీటితో కడిగి ఆరబెట్టండి. ఇలా చేయడం వల్ల లోపల ఉన్న డ్రైవర్స్ దగ్గర అడ్డంకులు తొలగిపోయి, సౌండ్ క్వాలిటీ మళ్లీ మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది.
ఇయర్‌బడ్స్‌కు ఉండే సిలికాన్ రబ్బర్ టిప్స్ మీ చెవికి కరెక్టుగా సెట్ కాకపోతే బయటి శబ్దాలు ఎక్కువగా వినిపించి, మ్యూజిక్ క్వాలిటీ పడిపోతుంది. దీనివల్ల కూడా ఒకవైపు సౌండ్ సరిగ్గా రానట్లు అనిపిస్తుంది. కాబట్టి.. మీ చెవికి కరెక్టుగా సరిపోయే రబ్బర్ టిప్స్‌ను మార్చుకోండి. ఇలా చేస్తే సౌండ్ బయటకు పోకుండా, మీరు మంచి ఆడియోను ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.
మీరు ఇయర్‌బడ్స్‌ను క్లీన్ చేసినా కూడా సమస్య తీరలేదంటే.. ఒకసారి మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఆడియో సెట్టింగ్స్ చెక్ చేయండి. చాలా డివైజ్‌లలో లెఫ్ట్, రైట్ ఆడియో బ్యాలెన్స్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. పొరపాటున ఆ బ్యాలెన్స్ ఒకవైపు ఎక్కువగా ఉంటే దాన్ని మధ్యలోకి సెట్ చేసుకోండి. అప్పటికప్పుడు మ్యూజిక్ వినడానికి, తక్కువ సౌండ్ వచ్చే వైపు కొంచెం బ్యాలెన్స్ పెంచుకోవడం కూడా మంచి ట్రిక్.
Also Read: 13.3 అంగుళాల భారీ డిస్‌ప్లే.. 3 నానోమీటర్ చిప్.. షియోమీ కొత్త టాబ్లెట్ ఫీచర్లు ఇవే!