E-Paper
Advertisement

పాకిస్తాన్ క్రికెట్ వెంటిలేటర్‌పై నడుస్తోంది..ఏ క్ష‌ణ‌మైనా ఊపిరిపోతుంది

పాకిస్తాన్ క్రికెట్ వెంటిలేటర్‌పై నడుస్తోంది..ఏ క్ష‌ణ‌మైనా ఊపిరిపోతుంది
Advertisement

Shoaib Akhtar On Pakistan Team: పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. రోజు రోజుకు పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి దిగజారడం తప్ప… మెరుగుపడడం ఎక్కడ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ గడ్డపై పర్యటిస్తున్న పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ జట్టును ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్‌, రావాల్పిండి ఎక్స్ ప్రెస్‌ షోయ‌బ్ అక్త‌ర్ (Shoaib Akhtar On Pakistan Team) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం వెంటిలేటర్ పైన నడుస్తోందని… ఏ క్షణమైన ఊపిరి పోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. టెస్ట్ క్రికెట్ ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ కు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని వివరించారు. ఇంగ్లాండ్ గడ్డపై కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితిలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఉందని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, మాత్రం పాకిస్తాన్ టెస్ట్ జట్టును కాపాడడం ఎవరి తరం కాదని హెచ్చరించారు షోయబ్ అక్తర్. దీంతో షోయబ్ అత్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం వేపుతున్నాయి.

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకోవ‌డం ఇప్ప‌టికైనా మానుకోవాలి

ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ చెత్త ప్రదర్శన నేపథ్యంలో మాజీ ఫాస్ట్ బౌల‌ర్‌, రావాల్పిండి ఎక్స్ ప్రెస్‌ షోయ‌బ్ అక్త‌ర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉందని వెల్లడించారు. ప్రస్తుత పాకిస్తాన్ జట్టు నుంచి బోర్డు ఎలాంటి ఆశలు పెట్టుకోవడం లేదని బాంబు పేల్చారు. అందుకే ఈ జట్టు మొత్తాన్ని తొలగించి… కొత్త ఆటగాళ్ల‌ను తీసుకురావాలని ఈ బోర్డు ప్లాన్ చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. కొత్త రక్తం వస్తేనే పాకిస్తాన్ పరిస్థితి మెరుగవుతుందని కూడా చెప్పుకొచ్చారు. ఎంజాయ్ కోసం ఆడే వాళ్లను కాకుండా పాకిస్తాన్ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్లను మాత్రమే జట్టులోకి తీసుకురావాలని వెల్లడించారు. అలాంటి వాళ్లే జట్టులో ఉండాలని.. దానివల్ల పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి మెరుగవుతుందని పేర్కొన్నారు.

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

పాకిస్తాన్ జట్టులోకి కొత్త కుర్రాళ్ల‌ను తీసుకు వస్తే మాత్రం… షాహిన్ అఫ్రిది, నసీం షా అలాగే హారిస్ రవూఫ్
కెరీర్లు నాశనం కాకుండా కాపాడాలని తాను కోరుతానని వెల్లడించారు. ఈ ముగ్గురు బౌలర్లను డిస్టర్బ్ చేయకుండా కొత్త వాళ్లను తీసుకు వస్తే బెటర్ అన్నారు. ఈ ముగ్గురు బౌలర్లలో క్రికెట్ ఇంకా మిగిలి ఉందని గుర్తు చేశారు. భవిష్యత్తులో పాకిస్తాన్ జట్టు బలంగా ముందుకు వెళ్లాలంటే వీళ్ళ అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చారు. వెంటిలేటర్ పైన ఉన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టును కాపాడడం అందరి బాధ్యత అన్నారు. డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకోవ‌డం ఇప్ప‌టికైనా మానుకోవాలని కోరారు.

Advertisement

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో ఫిక్సింగ్ క‌ల‌కలం…రిజ్వాన్‌, ఇమామ్ ల‌పై బ్యాన్ ?

పాకిస్తాన్ హెడ్ కోచ్ గా గౌత‌మ్ గంభీర్‌…? ఇక టీమిండియా జ‌ట్టుకు న‌ర‌క‌మేనా !

పాకిస్తాన్ తో టీమిండియాకు బ‌ల‌వంతంగా పెట్టొద్దు…గంభీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఆసియా క‌ప్ ఆడ‌ట‌మే దండ‌గ..ట్రోఫీ గెలిచినా న‌ఖ్వీగాడు లేపేస్తాడు!

జై షా ఉన్న‌న్ని రోజులు…టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోవాల్సిందే

2021లో టీమిండియా ఓట‌మితోనే, పాకిస్తాన్ టీమ్ ప‌త‌నం మొద‌లైంది

ఇండియా, పాకిస్తాన్ మ‌ధ్య ట్రై సిరీస్‌…ఐసీసీ ప్లాన్ అదుర్స్‌

Big Stories

Advertisement
×