Dell 15 laptop 14th gen: రోజువారీ ఆఫీస్ పనులు, ఆన్ లైన్ క్లాసులు, కోడింగ్ లేదా ప్రాజెక్ట్ వర్క్స్ కోసం ఒక మంచి ల్యాప్ టాప్ ఉండటం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ అవసరమైంది. మార్కెట్లో రకరకాల బ్రాండ్లు ఉన్నప్పటికీ, లాంగ్ లైఫ్, క్వాలిటీ విషయంలో.. డెల్ ల్యాప్ టాప్లకు ఉండే క్రేజే వేరు. మునుపటి ఇన్స్పిరాన్ సిరీస్‌ను.. మరింత మెరుగు పరుస్తూ డెల్ సంస్థ విడుదల చేసిన.. ‘డెల్ 15’ ల్యాప్ టాప్ ఇప్పుడు మిడిల్ క్లాస్ బడ్జెట్లో అద్భుతమైన ఆప్షన్‌గా నిలుస్తోంది. ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ల్యాప్ టాప్ కార్బన్ బ్లాక్ కలర్లో.. చాలా ప్రొఫెషనల్‌గా ,స్టైలిష్‌గా కనిపిస్తుంది. దీని బరువు కేవలం 1.63 కేజీలు మాత్రమే ..ఉండటం దీనికి అతి పెద్ద ప్లస్ పాయింట్. కాలేజీకి వెళ్లే.. విద్యార్థులు లేదా ఆఫీసుకు ట్రావెల్ చేసే.. ఉద్యోగులు దీనిని తమ బ్యాగులో ఎక్కడికైనా చాలా ఈజీగా తీసుకెళ్లవచ్చు. స్లీక్ డిజైన్ కారణంగా .. ఇది చూడటానికి ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
ఈ ప్రైస్ రేంజ్లో.. డెల్ ఇస్తున్న అద్భుత మైన ఫీచర్లలో.. దీని డిస్ప్లే ఒకటి. ఇది 15.6 అంచుల ఫుల్ హెచ్డీ యాంటీ గ్లేర్ డిస్ప్లేతో ..వస్తుంది.ముఖ్యంగా .. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఇవ్వడం విశేషం. దీని వల్ల స్క్రీన్ స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. వీడియోలు చూసేటప్పుడు.. లేదా గేమ్స్ ఆడేటప్పుడు విజువల్స్ చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. 250 నిట్స్ బ్రైట్ నెస్ ఉండటం వల్ల.. ఇండోర్ లేదా ఆఫీస్ లైటింగ్‌లో పని చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఈ ల్యాప్ టాప్ లోపల పవర్ ఫుల్ 14వ జనరేషన్ ఇంటెల్ కోర్ i3/ కోర్ 3 100U ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది రోజు వారీ మల్టీ టాస్కింగ్ పనులను చాలా వేగంగా పూర్తి చేస్తుంది. దీనికి తోడుగా.. 8GB DDR4 RAM, ఫర్పా మెన్స్ 512GB SSD స్టోరేజ్ లభిస్తాయి. ఎస్సె అగర్ ల్యాప్ టాప్ బూట్ అవడానికి లేదా.. హెవీ ఫైల్స్ ఓపెన్ చేయడానికి.. క్షణాలు కూడా పట్టవు. ఆఫీస్ వర్క్, ఎక్సెల్ షీట్లు, బ్రౌజింగ్, ఆన్ లైన్ మీటింగ్స్ అన్నీ ఎలాంటి లాగ్ లేకుండా సాగి పోతాయి.
Also Read: రూ.937లకే పోర్టబుల్ స్పీకర్! డిస్కౌంట్లో కొనేయండి
ఇది లేటెస్ట్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. అంతే కాకుండా విద్యార్థులకు, ఉద్యోగులకు అత్యంత ఉపయోగ కరమైన మైక్రో సాఫ్ట్ ఆఫీస్ హోమ్ & స్టూడెంట్ ఇన్‌బిల్ట్‌గా లభిస్తుంది. దీని వల్ల మీరు వేల రూపాయలు పెట్టి సాఫ్ట్వేర్ కొనుగోలు చేయాల్సిన పని ఉండదు. కీబోర్డ్ టైపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా కంఫర్టబుల్‌గా.. ఉంటుంది.
అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లు, డెల్ బ్రాండ్ క్వాలిటీతో వస్తున్న.. ఈ ‘డెల్ 15′ ల్యాప్ టాప్ అధికారిక మార్కెట్ ధర రూ.51,990 గా ఉంది. బడ్జెట్ ధరలో.. పర్ఫెక్ట్ ఆల్-రౌండర్ ల్యాప్ టాప్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఎంపిక.
విద్యార్థులకు, ఐటీ ఉద్యోగులకు, సాధారణ ఇంటి అవసరాలకు.. ఒక పటిష్టమైన,పవర్ ఫుల్ ల్యాప్‌టాప్ కావాలంటే..’డెల్ 15’ ఒక అద్భుతమైన ఛాయిస్. మీ ల్యాప్ టాప్ కొనాలన్న ఆలోచన ఉంటే.. ఈ మోడల్‌ను కచ్చితంగా చెక్ చేయండి.