Viva Harsha:జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది తమ కెరియర్ ను ప్రారంభించి , ఆ తర్వాత దర్శకులుగా, హీరోలుగా, నిర్మాతలుగా సెటిల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జబర్దస్త్ కమెడియన్ గా పేరు సొంతం చేసుకున్న వేణు ఎల్దండి (Venu eldandi) బలగం సినిమా చేసి డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఎల్లమ్మ అనే మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అటు అదిరే అభి కూడా కర్మాఖ్య అనే థ్రిల్లర్ సినిమాతో అబ్బురపరిచాడు. ధనరాజ్ రామం రాఘవం అనే ఒక మంచి సినిమా తీసి ఆకట్టుకున్నారు. త్వరలో రాంప్రసాద్ , రచ్చరవి, కిరాక్ ఆర్పి వంటి వారు కూడా దర్శకులుగా మారుతున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి..అయితే ఇలా ఇప్పుడు కమెడియన్గా చేసి దర్శకుడిగా మారిన కమెడియన్స్ జాబితాలో బాబు కూడా చేరిపోయారు. తాజాగా ఈయన దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.
రచయితగా, కమెడియన్ గా పేరు సొంతం చేసుకున్న బాబు.. ఇప్పుడు దర్శకుడిగా మారారు. రైటర్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన బాబు.. ఆ తర్వాత పోవే పోరా, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు షోలకు రచయితగా పనిచేశారు. లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే వెబ్ సిరీస్ తో దర్శకుడిగా మారారు. వైవా హర్ష, హైపర్ ఆది, జీవన్ కుమార్, ఐశ్వర్య కీలక పాత్రల్లో సాఫ్ట్వేర్ కంపెనీ, బ్యాచిలర్స్ బ్యాక్ డ్రాప్ తో కామెడీ, ఎమోషనల్ కథాంశంతో వచ్చిన ఈ సిరీస్ ప్రస్తుతం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అలా ఈటీవీ విన్ లో మంచి రెస్పాన్స్ అందుకుంటూ దూసుకుపోతున్న నేపథ్యంలో డైరెక్టర్ గా మారిన బాబు అడిగిన కోరికను వైవాహర్ష తీర్చారు
also read:ఏంటి.. సుధీర్ కి అప్పుడే పెళ్ళైపోయిందా.. వైరల్ అవుతున్న పిక్స్!
ఇకపోతే వెబ్ సిరీస్ సక్సెస్ అయినా సందర్భంగా నీకేం కావాలో చెప్పు అని వైవా హర్ష అడగగా.. తనకు బైక్ కావాలని అడిగారు బాబు. ఇక అడిగిన వెంటనే వైవా హర్ష రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను బాబుకి బహుమతిగా అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఎమోషనల్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే బాబు అందుకున్న ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్ మోడల్ ఖరీదు ఎంత అనే విషయానికొస్తే.. ఈ మోడల్ బేస్ వేరియంట్ ధర సుమారుగా రూ.1,65,161 నుండి సుమారుగా రూ.2,18,532 వరకు ధర ఉంటుంది. ముఖ్యంగా ఎంచుకున్న మోడల్, బీమా ప్యాకేజ్ ని బట్టి ధర మారుతూ ఉంటుంది.. మొత్తానికి అయితే ఇంతటి ఖరీదైన బహుమతిని వైవాహర్ష నుండి బాబు సొంతం చేసుకోవడంతో ఈయనకు సర్వత్రా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అటు వైవా హర్ష గొప్పతనానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.
?utm_source=ig_web_copy_link&psln=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==