E-Paper
Advertisement

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి
Advertisement

Dell Inspiron 15 3530: ప్రస్తుత డిజిటల్ యుగంలో ల్యాప్‌ టాప్ అనేది అందరి జీవితంలోనూ ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు వినడానికి, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి లేదా రోజువారీ ఆఫీస్ పనులు చక్కబెట్టుకోవడానికి మంచి ల్యాప్‌టాప్ కచ్చితంగా అవసరం. మార్కెట్లో అనేక బ్రాండ్లు ఉన్నప్పటికీ, నమ్మకానికి, మన్నికకు డెల్ సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ కోవకే చెందిన లేటెస్ట్ , మోస్ట్ పాపులర్ మోడల్ Dell Inspiron 15 3530. సాధారణ యూజర్లు, ప్రొఫెషనల్స్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని అత్యంత ఖచ్చితత్వంతో రూపొందించారు.

పూర్తి ఫీచర్లు: 

డిజైన్ ,లుక్స్ :

ఈ ల్యాప్‌టాప్ డిజైన్ చాలా క్లాసీగా , ప్రొఫెషనల్‌గా ఉంటుంది. కార్బన్ బ్లాక్ లేదా ప్లాటినం సిల్వర్ కలర్ ఆప్షన్లతో.. వస్తున్న ఈ డివైస్ చూడటానికి చాలా సన్నగా, తేలికగా ఉంటుంది. దీన్ని బ్యాగ్‌లో వేసుకుని కాలేజీకి లేదా ఆఫీస్‌కి ఈజీగా మోసుకెళ్లవచ్చు. దీని బాడీ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అంతే కాకుండా రోజువారీ వాడకానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.

Advertisement

డిస్‌ప్లే, రిఫ్రెష్ రేట్ :

ఈ ల్యాప్‌టాప్‌లో అద్భుతమైన 15.6 ఇంచుల ఫుల్ హెచ్‌డి యాంటీ గ్లేర్ డిస్‌ప్లేను అందించారు. దీని నారో బోర్డర్స్ వీడియోలు చూసేటప్పుడు .. మంచి విజువల్ ఫీల్ ఇస్తాయి. అంతేకాకుండా..కొన్ని వేరియంట్లలో లభించే 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ కారణంగా స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఆన్‌లైన్ క్లాసులు లేదా మీటింగ్స్ అటెండ్ అయ్యేటప్పుడు కంటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇది కాపాడుతుంది.

పర్ఫార్మెన్స్, ప్రాసెసర్:

Advertisement

ఈ మోడల్ పనితీరు విషయంలో ఎక్కడా రాజీపడదు. ఇది పవర్ ఫుల్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. రోజువారీ ఆఫీస్ పనులు, ఎంఎస్ ఆఫీస్ డాక్యుమెంట్లు తయారు చేయడం, ఇంటర్నెట్‌లో.. బ్రౌజింగ్ చేయడం, జూమ్ కాల్స్ మాట్లాడటం వంటి మల్టీటాస్కింగ్ పనులను ఇది చాలా ఈజీగా.. ఎలాంటి లాగ్ లేకుండా హ్యాండిల్ చేస్తుంది. ఇందులో ఉండే ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్ వల్ల ల్యాప్‌ టాప్ క్షణాల్లో ఆన్ అవుతుంది. అంతే కాకుండా ఫైల్స్ చాలా వేగంగా ట్రాన్స్ఫర్ అవుతాయి.

Also Read: బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు :

ఈ డివైస్‌లో అవసరమైన అన్ని రకాల పోర్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. యూఎస్‌బీ పోర్ట్‌లు, హెచ్‌డీఎంఐ పోర్ట్, ఆడియో జాక్ వంటివి ఉండటం వల్ల పెన్‌డ్రైవ్‌లు, మానిటర్లు లేదా ఇతర డివైజెస్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్, వై-ఫై సపోర్ట్ కూడా లభిస్తుంది. కంఫర్టబుల్ కీబోర్డ్ టైపింగ్ ఫీల్ మరింత ఈజీ చేస్తుంది.

ధర :

ఈ మోడల్ ల్యాప్‌టాప్ ధరలు, ప్రాసెసర్‌ను బట్టి మారుతుంటుంది. మార్కెట్లో దీని ప్రారంభ ధర సుమారు రూ.38,090 నుంచి ప్రారంభమై వేరియంట్‌ను బట్టి పెరుగుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అలాగే డెల్ అధికారిక వెబ్‌సైట్ లేదా రిటైల్ స్టోర్లలో ఇది అందుబాటులో ఉంది. క్రెడిట్ కార్డ్ ఆఫర్లు లేదా.. ఎక్స్ఛేంజ్ బోనస్‌లను ఉపయోగిస్తే.. దీన్ని ఇంకా మంచి డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు.

నమ్మకమైన బ్రాండ్ నుంచి అరుదైన ఫీచర్లు, మంచి స్పీడ్ , బడ్జెట్ ధరలో లభించే.. ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నట్లయితే ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. స్టూడెంట్స్, బిజినెస్ పర్సన్స్ . సాధారణ అవసరాలకు ఇది వంద శాతం న్యాయం చేస్తుంది.

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×