E-Paper
Advertisement

Dell Gaming Laptop: 18 ఇంచ్ డిస్‌ప్లేతో పెద్ద గేమింగ్ ల్యాప్‌టాప్స్ లాంచ్ చేసిన డెల్.. CES 2026లో హైలైట్

Dell Gaming Laptop: 18 ఇంచ్ డిస్‌ప్లేతో పెద్ద గేమింగ్ ల్యాప్‌టాప్స్ లాంచ్ చేసిన డెల్.. CES 2026లో హైలైట్
Advertisement

Dell 18 Inch Gaming Laptop| అమెరికాలో జరుగుతున్న సీఈఎస్ 2026 టెక్ మేళాలో డెల్ కంపెనీ కొత్త ఏలియన్‌వేర్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్‌లు హార్డ్‌కోర్ గేమర్ల కోసం పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. పెద్ద డిస్‌ప్లేలు, హై రిఫ్రెష్ రేట్స్, అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్‌లతో వస్తున్నాయి. కొత్త లైనప్‌లో ఏలియన్‌వేర్ 16 ఏరియా-51, ఏలియన్‌వేర్ 18 ఏరియా-51, స్లిమ్ మోడల్ ఏలియన్‌వేర్ 16X అరోరా ఉన్నాయి. అన్నీ హై పెర్ఫామెన్స్, మంచి కూలింగ్‌పై దృష్టి పెట్టాయి.

అన్ని మోడల్స్‌లో పవర్‌ఫుల్ హార్డ్‌వేర్

కొత్త ఏలియన్‌వేర్ ల్యాప్‌టాప్‌లన్నీ ఇంటెల్ కోర్ అల్ట్రా 200HX ప్రాసెసర్లతో వస్తాయి. NVIDIA జిఫోర్స్ RTX 50-సిరీస్ ల్యాప్‌టాప్ గ్రాఫిక్స్ కార్డులు ఉన్నాయి. ఈ హార్డ్‌వేర్ హై-ఎండ్ గేమింగ్, ప్రొఫెషనల్ వర్క్‌లోడ్స్‌కు సరిపోతుంది. ఆధునిక గేమ్స్, మల్టీటాస్కింగ్, క్రియేటివ్ యాప్లికేషన్లకు బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తాయి.

Alienware 16 Area-51: OLED గేమింగ్ ఎక్స్‌పీరియన్స్

Advertisement

ఏలియన్‌వేర్ 16 ఏరియా-51 ఫ్లాగ్‌షిప్ మోడల్. ఇందులో 16 అంగుళాల యాంటీ-గ్లేర్ OLED డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 2560 × 1600 WQXGA. 240Hz రిఫ్రెష్ రేట్, 0.2ms రెస్పాన్స్ టైమ్ ఉన్నాయి. 120 శాతం DCI-P3 కలర్ వాల్యూమ్, ClearMR 9000 సర్టిఫికేషన్ ఉన్నాయి. HDR బ్రైట్‌నెస్ 620 నిట్స్ వరకు వస్తుంది. యాంటీ-గ్లేర్ కోటింగ్ రిఫ్లెక్షన్స్ 32 శాతం తగ్గిస్తుంది. NVIDIA G-SYNC, అడ్వాన్స్‌డ్ ఆప్టిమస్ సపోర్ట్ ఉన్నాయి. ComfortView Plusతో కళ్లకు సౌకర్యం ఉంటుంది.
ఈ స్పెషల్ ల్యాప్‌టాప్‌లో 240W గేమింగ్ పవర్, Cryo-Chamber కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి. 24GB RAM, 12TB స్టోరేజ్ వరకు సపోర్ట్ చేస్తుంది.

Alienware 18 Area-51: పెద్ద స్క్రీన్ గేమర్లకు

ఏలియన్‌వేర్ 18 ఏరియా-51లో 18 అంగుళాల WQXGA LCD డిస్‌ప్లే ఉంది. 300Hz అల్ట్రా-ఫాస్ట్ రిఫ్రెష్ రేట్, 3ms రెస్పాన్స్ టైమ్ ఉన్నాయి. 100 శాతం DCI-P3 కలర్ స్పేస్, 500 నిట్స్ బ్రైట్‌నెస్ వస్తాయి. G-SYNC, అడ్వాన్స్‌డ్ ఆప్టిమస్ సపోర్ట్ ఉన్నాయి. థండర్‌బోల్ట్ 5 (GPUపై ఆధారపడి), 2.5Gb ఈథర్నెట్, వై-ఫై 7 ఉన్నాయి. 96Whr బ్యాటరీ, 360W GaN అడాప్టర్ ఉన్నాయి. బరువు 4.34 కిలోగ్రాములు. 280W గేమింగ్ పవర్, 35 శాతం మెరుగైన ఎయిర్‌ఫ్లో, 15 శాతం తక్కువ ఫ్యాన్ నాయిస్ ఉన్నాయి. 24GB RAM, 12TB స్టోరేజ్ సపోర్ట్ ఉంది.

Advertisement

Also Read: మ్యూజికల్ లాలిపాప్.. నోట్లో పెట్టుకోగానే మ్యూజిక్ వినిపిస్తుంది.. ఇయర్‌బడ్స్ అవసరం లేదు

Alienware 16X Aurora: స్లిమ్, పోర్టబుల్ గేమింగ్

ఏలియన్‌వేర్ 16X అరోరా పోర్టబిలిటీ కోసం డిజైన్ చేశారు. బరువు 2.66 కిలోగ్రాములు, మందం 19.2mm మాత్రమే. 16 అంగుళాల యాంటీ-గ్లేర్ WQXGA OLED డిస్‌ప్లే, 240Hz రిఫ్రెష్ రేట్, 0.2ms రెస్పాన్స్ టైమ్ ఉన్నాయి. CPU ఆప్షన్లు Core Ultra 5 235HX నుంచి Core Ultra 9 275HX వరకు ఉన్నాయి. 64GB DDR5 మెమరీ, NVMe SSDతో RAID 0 సపోర్ట్ ఉన్నాయి. వై-ఫై 7, థండర్‌బోల్ట్ 4, HDMI 2.1 ఉన్నాయి. 90Whr బ్యాటరీతో వస్తుంది.

ఈ కొత్త ఏలియన్‌వేర్ ల్యాప్‌టాప్‌లు గేమర్లకు హై పెర్ఫామెన్స్, మంచి డిస్‌ప్లేలు, అడ్వాన్స్‌డ్ కూలింగ్‌తో బెస్ట్ ఆప్షన్స్‌గా నిలుస్తాయి.

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×