Rishabh Pant injury: న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా ( India vs New Zealand, 1st ODI) మధ్య నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ 3 వన్డేల సిరీస్ నేపథ్యంలో టీమిండియా జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. జనవరి 10 అంటే శనివారం రోజున నెట్ ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ గాయపడ్డాడు. ఓ బౌలర్ వేసిన బంతి రిషబ్ పంత్ నడుముకు చాలా బలంగా తాకింది. ఈ గాయం తీవ్రతరం కావడంతో న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగే 3 వన్డేల సిరీస్ ( India vs New Zealand) నుంచి రిషబ్ పంత్ ను తప్పించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.
టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ కు గాయమైన సంగతి తెలిసిందే. గౌతమ్ గంభీర్, గిల్ సమక్షంలోనే నిన్న రిషబ్ పంత్ ప్రాక్టీస్ చేశాడు. రెండు భారీ సిక్సర్లు కూడా తన ప్రాక్టీస్ సమయంలో కొట్టడం జరిగింది. ఆ తర్వాత వేగంగా వచ్చిన ఓ బంతి, రిషబ్ పంత్ నడుముకు తాకింది. దీంతో ఉలిక్కిపడ్డాడు రిషబ్ పంత్. గాయం బాగా కావడంతో మళ్లీ ప్రాక్టీస్ చేయలేకపోయాడు. అక్కడే కుప్పకూలి గిలగిల కొట్టుకున్నాడు రిషబ్ పంత్. దీంతో అక్కడే ఉన్న టీమిండియా సభ్యులందరూ రిషబ్ పంత్ దగ్గరకు చేరుకున్నారు.
కానీ సమీపంలోనే ఉన్న కోచ్ గౌతమ్ గంభీర్ అలాగే టీమిండియా కెప్టెన్ గిల్ ఇద్దరు చీమకుట్టినట్లు కూడా వ్యవహరించలేదు. తోటి ప్లేయర్ కింద పడిపోయాడు? అన్న సానుభూతి కూడా లేకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరించారు ఈ ఇద్దరు. రిషబ్ పంత్ కిందపడి కొట్టుకుంటూ ఉంటే… సరదాగా సినిమా చూసినట్లు అతన్ని చూశారు గౌతమ్ గంభీర్ అలాగే గిల్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ గౌతమ్ గంభీర్ అలాగే గిల్ ను దారుణంగా తిడుతున్నారు. వీళ్లు అసలు మనుషులేనా ? దుర్మార్గులా? అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. కొంచెం కూడా దయ లేని రాక్షసులు అంటూ ఫైర్ అవుతున్నారు.
నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు రిషబ్ పంత్ ( Rishabh Pant). ఆ గాయం తీవ్రతరం కావడంతో న్యూజిలాండ్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ నుంచి రిషబ్ పంత్ ను తప్పించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. దీంతో రిషబ్ పంత్ స్థానంలో మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ను తీసుకువచ్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది బీసీసీఐ.
Heartbroken 💔 moments when Rishabh Pant injured and literally crying but our coach Gautam Gambhir and Shubhman Gill completely ignored him . pic.twitter.com/h55Wmd8ykQ
— Cricket Central (@CricketCentrl) January 10, 2026
?igsh=cWc0Z3NjZnBodDM2