E-Paper
Advertisement

Brother And Sister Incident: అక్క భ‌ర్తతో చెల్లి ఎఫైర్‌.. న‌డిరోడ్డుపై అక్కను త‌మ్ముడు ఎంత ఘోరంగా చంపాడంటే!

Brother And Sister Incident: అక్క భ‌ర్తతో చెల్లి ఎఫైర్‌.. న‌డిరోడ్డుపై అక్కను త‌మ్ముడు ఎంత ఘోరంగా చంపాడంటే!
Advertisement

Brother And Sister Incident: ఖమ్మం ఖిల్లా ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. అయితే గత కొంత కాలంగా అక్రమ సంబందాల పేరిట ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి. ఎన్నో హత్యలు కూడా జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్న చట్ట రీత్యాల నేరాలు అనుభవిస్తున్నా.. ఒకవైపు జైల్లో ఉండిపోతున్న కానీ ప్రజలు మాత్రం మారడం లేదు..

ప్రస్తుతం ఇప్పడు కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కొత్తగూడెం మండలం మైలారం గ్రామానికి చెందిన ప్రమీలకు, ఆర్ఎంపీ డాక్టర్ నరసింహారావుతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరి సంసారం కొంతకాలం సాఫీగానే సాగినా, సంతానం కలగకపోవడంతో దంపతుల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో భర్తతో విభేదించిన ప్రమీల, అతనికి దూరంగా ఖమ్మంలోని ఒక పీజీ (PG)లో ఉంటూ బట్టల షాపులో పని చేస్తోంది. అయితే, అక్కడే ఉంటున్న ఆమె తన సొంత అక్క భర్తతో (బావ) వివాహేతర సంబంధం పెట్టుకోవడం కుటుంబంలో తీవ్ర వివాదానికి దారితీసింది.

Advertisement

హెచ్చరికలు లెక్కచేయని వైనం
సొంత అక్క జీవితం నాశనమవుతోందని, పద్ధతి మార్చుకోవాలని ప్రమీలను ఆమె తమ్ముడు రాజేష్ పలుమార్లు హెచ్చరించాడు. కుటుంబ గౌరవం బజారున పడుతుందని, బావతో సంబంధం తెంచుకోవాలని గట్టిగా చెప్పినప్పటికీ ప్రమీల ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ విషయమై కుటుంబ సభ్యుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తన అక్క కాపురం కూలిపోతుందనే ఆవేదన, చెల్లెలు మాట వినడం లేదనే కోపం రాజేష్‌ను కక్ష పెంచుకునేలా చేశాయి.

పథకం ప్రకారం నడిరోడ్డుపై హత్య
ప్రమీల ప్రవర్తనతో విసిగిపోయిన రాజేష్, ఎలాగైనా ఆమెను అడ్డుతొలగించుకోవాలని పథకం పన్నాడు. ఈ క్రమంలో ఖమ్మం ఖిల్లా ప్రాంతానికి ఆమె వచ్చిన సమయంలో, అర్థరాత్రి వేళ నడిరోడ్డుపై ప్రమీలను అడ్డగించాడు. వీరి మధ్య మరోసారి వాగ్వాదం జరగడంతో ఆవేశానికి లోనైన రాజేష్, తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. మెడ, తల భాగాల్లో తీవ్రంగా నరకడంతో ప్రమీల రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

Advertisement

Also Read: సంక్రాంతి దోపిడీ.. ప్రైవేటు ట్రావెల్స్ అరాచకం.. పండుగ పూట సామాన్యుడి జేబుకు చిల్లు!

చట్టం ముందు నిందితుడు
ఈ ఘోర కలికానికి పాల్పడిన అనంతరం రాజేష్ అక్కడి నుండి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమ సంబంధాలు ప్రాణాల మీదకు తెస్తాయని, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు రెండు కుటుంబాలను రోడ్డున పడేస్తాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×