E-Paper
Advertisement

ఐఫోన్ వాడితే పిల్లలు పుట్టరా? లైఫ్‌లో పేరెంట్స్ కాలేరా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!

ఐఫోన్ వాడితే పిల్లలు పుట్టరా? లైఫ్‌లో పేరెంట్స్ కాలేరా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
Advertisement

iPhone Fertility Study: స్మార్ట్‌ఫోన్ మన జీవితాలను ఎంతగా మార్చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చేతిలో ఫోన్ లేకపోతే ముద్ద దిగదు, నిద్ర పట్టదు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది పలికిన ‘ఐఫోన్’ (iPhone) రాకతో ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు (Fertility Rates) దారుణంగా పడిపోతోందని ఇటీవల జరిగిన ఒక ఆసక్తికరమైన పరిశోధన వెల్లడించింది. ఐఫోన్ ఒక ‘బర్త్ కంట్రోల్’ (గర్భనిరోధక) సాధనంలా పనిచేస్తోందంటూ పరిశోధకులు చెప్తున్న విషయాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

వివరాల్లోకి వెళ్తే..

నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. 1980 నుండి 2007 మధ్య అమెరికాలో సాధారణ సంతానోత్పత్తి రేటు ప్రతి 1,000 మంది మహిళలకు 65-70 మధ్య స్థిరంగా ఉండేది. అయితే ఐఫోన్ మార్కెట్లోకి విడుదలైన 2007 ఏడాది నుంచి జననాల రేటు గణనీయంగా తగ్గడం మెుదలైందని సదరు అధ్యయనం పేర్కొంది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా జననాల రేటులో స్పష్టమైన తగ్గుదల కనిపించడం ప్రారంభమైనట్లు పరిశోధకులు గుర్తించారు. అంతకుముందు వరకు స్థిరంగా లేదా పెరుగుతూ వచ్చిన ఫర్టిలిటీ రేట్లు.. 2007 నుంచి మాత్రం క్రమం తప్పకుండా తగ్గుతూ వస్తున్నాయని పేర్కొన్నారు. 2024 నాటికి వచ్చేసరికి జననాల రేటు కాస్త 54కి చేరుకుందని తెలిపారు. అంటే ఐఫోన్ వచ్చిన 17 ఏళ్ల కాలంలో జననాల రేటు ఏకంగా 22 శాతం పడిపోయిందని అధ్యయనం పేర్కొంది.

సంతానోత్పత్తి తగ్గుదల.. లెక్కలివే!

Advertisement

ఐఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 15-19 ఏళ్ల వయసు యువతుల్లో 4.5 నుండి 8 శాతం వరకూ సంతానోత్పత్తి తగ్గిందని పరిశోధకులు తెలిపారు. అలాగే 20-24 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలల్లో ఇది 3.2 శాతం నుంచి 6.6 శాతంగా నమోదైందని పేర్కొన్నారు. ఈ అంచనాలన్నీ కలిపి చూస్తే ప్రధానంగా 2007 – 2011 కాలంలో 15 నుండి 44 ఏళ్ల వయస్సు గల మహిళల్లో సాధారణ సంతానోత్పత్తి రేటు తగ్గుదలలో 33 నుండి 52 శాతం వరకు తగ్గిందని అధ్యయనం పేర్కొంది. ఈ లెక్కలన్నీ పరిశీలిస్తే ఐఫోన్ కారణంగానే సంతానోత్పత్తి రేటు తగ్గుతూ వస్తోందని పరిశోధకులు ఆరోపిస్తున్నారు. అటు 2007-2024 లెక్కలు చూస్తే 15-19 ఏళ్ల యువతుల్లో జననాల రేటు 70 శాతం, 20 – 24 ఏళ్ల యువతుల్లో 47 శాతం తగ్గిందని నిపుణులు పేర్కొన్నారు. అటు 30-34 ఏళ్ల వారిలో 7 శాతం, 35-79 వయస్సుల వారిలో 14 శాతం జననాల రేటు తగ్గిందని చెప్పుకొచ్చారు.

Also Read: క్రేజీ కదిలే ఫ్యాన్.. ఎక్కడికెళ్లినా చల్లగాలి మీ వెంటే.. చుక్క చెమట పట్టనివ్వదు!

ఐఫోన్ వల్లే జననాల రేటు తగ్గాయా?

Advertisement

జననాల రేటు తగ్గడానికి మిగతా కారణాలు కూడా ఉన్నప్పటికీ ఐఫోన్ మాత్రం మేజర్ రోల్ పోషించిందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఐఫోన్ సహా ఇతర స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో.. ప్రజలు భౌతికంగా స్నేహితులతో గడిపే సమయాన్ని తగ్గించుకున్నారని తెలియజేస్తున్నారు. దీని వల్ల లైంగిక కార్యాకలాపాలు తగ్గి.. అశ్లీల చిత్రాల వినియోగం పెరిగిందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఈ అధ్యయన కాలంలో పోర్న్ కోసం యువత ఎక్కువగా పరిశోధించడాన్ని గతంలో కంటె రెట్టింపు కావడాన్ని తాము గుర్తించినట్లు చెప్పుకొచ్చారు.

Also Read: ఇలాంటి ఇల్లు ఉంటే.. లైఫ్‌లో ఏసీ, కూలర్ అక్కర్లేదు.. 40 ఏళ్లుగా 10°C ఉష్ణోగ్రత!

Related News

వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బిగ్ షాక్.. భారత్‌లో OxygenOS శకం ముగిసినట్లేనా?

బెడ్‌టైమ్ స్టోరీస్ కోసం మెటా కొత్త ప్రయత్నం.. ఈ StoryKit యాప్ ఎలా పనిచేస్తుందంటే?

బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్.. Vi రూ.479 రీఛార్జ్‌తో లభించే బెనిఫిట్స్ ఇవే!

వర్షాకాలంలో ACలో ఉన్న ఈ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే.. ఉక్కపోత మాయం, కరెంట్ బిల్లు సగం!

ఆన్‌లైన్‌లో మీ డేటా సేఫ్ ఉండాలంటే.. ఈ 5 గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వండి!

ఓరి నాయనో.. నిజమా? కలా? Samsung Z Fold 7పై ఏకంగా రూ.75,000 దాకా తగ్గింపు!

టీవీ కొనాలనుకుంటున్నారా? Mini LED లేదా OLED.. ఏది బెస్ట్ ఆప్షన్?

మెటా యాప్స్‌లో మన డేటాను AI వాడకుండా ఎలా ఆపాలో తెలుసా?

Big Stories

Advertisement
×