E-Paper
Advertisement

డుకాటి To హార్లీ.. ఇండియాలో అత్యంత ఖరీదైన 5 బైక్స్ ఇవే!

డుకాటి To హార్లీ.. ఇండియాలో అత్యంత ఖరీదైన 5 బైక్స్ ఇవే!
Advertisement

Top 5 Most Expensive Motorcycles: ఇండియన్ టూ వీలర్ బైక్స్ మార్కెట్‌ లో ఇప్పుఉ సాధారణ బైక్‌ లే కాదు.. ప్రపంచ స్థాయి సూపర్‌ బైక్‌ లు, లగ్జరీ టూరింగ్ మోటార్‌ సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. హై పర్ఫార్మెన్స్, అత్యాధునిక సాంకేతికత, ప్రీమియం డిజైన్ కోరుకునే కొనుగోలుదారుల కోసం పలు అంతర్జాతీయ బ్రాండ్లు అత్యంత ఖరీదైన మోడళ్లను భారత మార్కెట్లో విక్రయిస్తున్నాయి. కొన్ని బైక్‌ ల ధరలు రూ. 80 లక్షలకు పైగానే ఉండటం విశేషం. ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.డుకాటి పానిగాలే V4 R – రూ. 84.99 లక్షలు

ప్రస్తుతం దేశంలో లభిస్తున్న అత్యంత ఖరీదైన మోటార్‌ సైకిల్ డుకాటి పానిగాలే V4 R. ఇది 998 సీసీ ఇంజిన్‌ తో వస్తుంది. డుకాటి రేసింగ్ ఎక్స్ పీరియెన్స్ ను అందించేలా ఈ బైక్‌ ను రూపొందించారు. తేలికైన ఫ్రేమ్, అధునాతన సస్పెన్షన్, ఆకర్షణీయమైన ఏరోడైనమిక్ డిజైన్ ఈ బైక్ ప్రత్యేకతలు. ట్రాక్‌ పై అత్యుత్తమ పనితీరు కోరుకునే రైడర్లకు ఇది ప్రత్యేకంగా నచ్చుతుంది.

2.హార్లీ డేవిడ్సన్ CVO రోడ్ గ్లైడ్ – రూ. 67.36 లక్షలు

Advertisement

అమెరికన్ బ్రాండ్ హార్లీ డేవిడ్సన్‌ కు చెందిన CVO రోడ్ గ్లైడ్ లగ్జరీ టూరింగ్ సెగ్మెంట్‌ లో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఇందులో 1.9 లీటర్ భారీ ఇంజిన్ ఉంటుంది. సుదూర ప్రయాణాల కోసం రూపొందించిన ఈ బైక్‌ లో సౌకర్యవంతమైన సీట్లు, పెద్ద ఫెయిరింగ్, స్థిరమైన రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ లభిస్తాయి. హైవేలపై సుదూర ప్రయాణాలను ఇష్టపడేవారికి అద్భుతమైన ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

3.BMW M 1000 RR – రూ. 55 లక్షలు

BMW M 1000 RR  ట్రాక్ ఫోకస్డ్ సూపర్‌ బైక్. 999 సీసీ ఇంజిన్‌ తో వచ్చే ఈ బైక్ వేగం, హ్యాండ్లింగ్ పరంగా మంచి గుర్తింపు పొందింది. రేసింగ్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ఈ మోడల్‌ లో ఏరోడైనమిక్ వింగ్‌ లెట్స్, తక్కువ బరువు, అధునాతన ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఉన్నాయి. ట్రాక్‌ లోనూ, రోడ్డుపైనూ అద్భుతంగా దూసుకెళ్తుంది.

4.హోండా గోల్డ్ వింగ్ టూర్ – రూ. 43.12 లక్షలు

Advertisement

లాంగ్ టూరింగ్ బైక్‌ లలో హోండా గోల్డ్ వింగ్ టూర్‌ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1.8 లీటర్ ఆరు సిలిండర్ల ఇంజిన్‌ తో ఇది వస్తుంది. ఏడు స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్, విశాలమైన సీటింగ్, మంచి సౌకర్యంతో అందుబాటులో ఉంది.  వందల కిలోమీటర్ల ప్రయాణం చేసినా అలసట తక్కువగా ఉండేలా దీనిని రూపొందించారు.

5.కవాసకి నింజా ZX-10R – రూ. 20.79 లక్షలు

కవాసకి నింజా ZX-10R పూర్తి స్థాయి సూపర్‌ బైక్. 998 సీసీ ఇంజిన్‌ తో వచ్చే ఈ మోడల్ BS6 నిబంధనలకు అనుగుణంగా అప్‌ డేట్ చేశారు. లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ మేనేజ్‌ మెంట్, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పనితీరు పరంగా అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్‌ బైక్‌ లలో ఒకటిగా కొనసాగుతోంది.

Read Also: భారత్‌ లో ఈవీ బైక్‌ల జోరు.. త్వరలో మార్కెట్‌ లోకి అడుగు పెట్టనున్న 5 మోడళ్లు ఇవే!

Related News

కొనుగోలుదారులకు ఎంజీ షాక్.. కామెట్ ఈవీ ధరల పెంపు!

బడ్జెట్‌ లో బెస్ట్ రేంజ్.. రూ.15 లక్షల లోపు టాప్ ఈవీ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 200 కిమీ రేంజ్.. భారత్‌ లో బెస్ట్ EV స్కూటర్లు ఇవే!

2026 బ్రెజ్జా Vs హ్యుందాయ్ వెన్యూ.. ఏ SUV కొనడం బెస్ట్?

రైళ్ల భద్రతకు డిజిటల్ టెక్నాలజీ.. మూడు కొత్త యాప్‌లను ప్రారంభించిన ఇండియన్ రైల్వే!

ఒక్కొక్కటి కాదు.. ఒకేసారి 10 కొత్త మోడల్స్.. హోండా దూకుడు మామూలుగా లేదుగా!

హోండా మాస్టర్ స్ట్రోక్.. భారత్‌ లో తొలి E85 మ్యాక్సీ స్కూటర్ లాంచ్!

రూ.1 లక్షలో హీరో కొత్త EV.. మార్కెట్‌ను షేక్ చేయనున్న విడా!

Big Stories

Advertisement
×