E-Paper
Advertisement

Dishwasher Tips: డిష్ వాషర్‌ను గుడ్డిగా వాడేస్తున్నారా? ఈ తప్పులు చేశారో.. మిషన్ పని గోవిందా!

Dishwasher Tips: డిష్ వాషర్‌ను గుడ్డిగా వాడేస్తున్నారా? ఈ తప్పులు చేశారో.. మిషన్ పని గోవిందా!
Advertisement

Dishwasher Tips: ప్రస్తుత రోజుల్లో చాలా కుటుంబాలు తమ వంటగదిలో డిష్ వాషర్లను వినియోగిస్తున్నాయి. వంటగది సింక్ లోకి వచ్చిపడిన అంట్లను.. డిష్ వాషర్లలో పడేసి వాటిని శుభ్రం చేయిస్తున్నారు. అయితే డిష్ వాషర్లను ఏ విధంగా ఉపయోగించాలన్న దానిపై చాలా మందిలో సరైన అవగాహన ఉండటం లేదని నిపుణులు అంటున్నారు. స్వీయ తప్పిదాలతో వాటి మన్నికను దెబ్బతీస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డిష్ వాషర్ల విషయంలో సాధరణంగా చేసే తప్పులు? వాటి మన్నిక పెంచే 4 ప్రధాన చిట్కాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.

గిన్నెలను అమర్చే విధానం

డిష్ వాషర్ లో గిన్నెలను ఏ విధంగా అమరుస్తారన్నది చాలా ప్రధానమైనది. అడుగున ర్యాక్ లో(Bottom Rack) ప్లేట్లు, పెద్ద గిన్నెలు కడాయిలను పెట్టాలి. పై ర్యాక్ లో కప్పులు, గ్లాసులు, చిన్నపాటి గిన్నెలను ఉంచాల్సి ఉంటుంది. ముఖ్యంగా గిన్నెలను బోర్లించి (Upside down)పెట్టాలి. అప్పుడే నీరు లోపలికి వెళ్లి శుభ్రం చేస్తుంది. ఎక్కువ అంట్లు ఉన్నాయని ఒకదానిపై ఒకటి పెట్టడం వల్ల నీరు సరిగ్గా గిన్నెలకు తగలదు. దీనివల్ల వంట పదార్థాలు అలాగే ఉండిపోయి బ్యాక్టీరియాకు ఆవాసాలుగా మారతాయి. తద్వారా మీకు ఆనారోగ్యాన్ని గురిచేస్తాయి. అదే సమయంలో పరిమితికి మించి గిన్నెల వేయడం వల్ల మిషన్ పై ఒత్తిడి పెరిగి.. దాని మన్నిక దెబ్బతినవచ్చు.

మిగిలిన ఆహారాన్ని తొలగించండి

Advertisement

సాధారణంగా సింక్ లోని వంటపాత్రలను అలాగే తీసుకెళ్లి డిష్ వాషర్ లో పెడుతుంటారు. ఇది సరైన విధానం కాదు. ఎండిపోయిన అన్నం మెతుకులు, కూర ముక్కలను (Food Scraps) స్పూన్‌తో తీసేసి డిష్‌వాషర్‌లో పెడితే మంచిది. ఇలా చేయడం వల్ల డిష్ వాషర్లు గిన్నెకు అంటిన నూనె, జిడ్డుపై సమర్థవంతంగా పనిచేసి వదలకొడతాయి. ఒకవేళ ఆహార పదార్థాలతో అలాగే డిష్ వాషర్ లో పెడితే ఫిల్టర్ బ్లాక్ అయ్యే ప్రమాదముంది. అలాగే అధిక మెుత్తంలో నీరు ఖర్చు కొవొచ్చు.

సరైన డిటర్జెంట్ ముఖ్యం

మనం చేత్తో కడిగే సాధారణ లిక్విడ్ సబ్బులు డిష్‌వాషర్‌లో వాడకూడదు. మార్కెట్ లో లభించే డిష్‌వాషర్ టాబ్లెట్స్ లేదా పౌడర్ ను మాత్రమే వాడాలి. మరోవైపు రిన్స్ ఎయిడ్ వంటి ప్రొడెక్ట్స్ గిన్నెలు త్వరగా ఆరిపోవడానికి వాటిపై నీటి చారలు పడకుండా ఉండటానికి దోహదం చేస్తాయి. అలాగే ‘డిష్‌వాషర్ సాల్ట్’.. నీటిలోని కఠినత్వాన్ని తగ్గించి మెషీన్ పాడవకుండా చూస్తుంది.

ఫిల్టర్‌ను శుభ్రం చేయడం

Advertisement

సాధారణగా ప్రతీ డిష్ వాషర్ అడుగు భాగంలో ఒక ఫిల్టర్ ఉంటుంది. వారానికి ఒకసారి ఆ ఫిల్టర్‌ను తీసి శుభ్రం చేయండి. ఫిల్టర్ శుభ్రంగా ఉంటేనే బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. గిన్నెలు వాసన రాకుండా మెరుస్తాయి.

Also Read: AC Cleaning Tips: ఏసీ కూలింగ్ రావట్లేదా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి.. దెబ్బకు సెట్ అవుతుంది!

గిన్నెలు బాగా మురికిగా ఉంటే..

అధునాతన డిష్ వాషర్లలో గిన్నెలను శుభ్రం చేసే అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి. గిన్నెలు బాగా మురికిగా, జిడ్డుగా అనిపిస్తే ‘Heavy Duty’ లేదా ‘Intensive’ మోడ్‌ను ఉపయోగించండి. తక్కువ గిన్నెలు ఉన్నప్పుడు ‘Eco Mode’ వాడితే కరెంటు, నీరు ఆదా అవుతాయి.

Also Read: Dishwasher vs Hand Washing: అంట్లు తోమడానికి .. రెండింటిలో ఏది బెస్ట్.. పైచేయి మనిషిదా? మిషన్‌దా?

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×