Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే వార్త వచ్చేసింది. టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ క్రేజీ కాంబినేషన్ అయిన పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మళ్ళీ మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కీలక ప్రకటన రానుంది. దర్శకుడు హరీష్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్ ఇద్దరూ పవన్ కళ్యాణ్‌ను స్వయంగా కలిశారు. ఈ భేటీ ప్రధానంగా సినిమా ప్రస్తుత స్థితిగతులు విడుదల ప్రణాళికల చుట్టూ సాగింది. ముఖ్యంగా సినిమాను అనుకున్న సమయం కంటే ముందుగానే అంటే ప్రీ-పోన్ చేసే అంశంపై పవన్ కళ్యాణ్‌తో చర్చించినట్లు సమాచారం. పవన్ కూడా సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మార్చి 19, 2026 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Raed also-Ustaad Bhagat Singh: బుక్ మై షో లో ఫ్యాన్స్ కి నిరాశ.. టెన్షన్ పెడుతున్న ఉస్తాద్!
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రీ-రిలీజ్ వేడుకపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈనెల 16వ తేదీన గ్రాండ్‌గా ఈ వేడుకను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుక ఎక్కడ జరగాలనే విషయంలో కొన్ని ఆప్షన్స్ పరిశీలనలో ఉన్నాయి. అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, అందరికీ అందుబాటులో ఉండేలా ఒక భారీ బహిరంగ ప్రదేశాన్ని ఎంపిక చేయబోతున్నారు. దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్ అంటే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం. ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా ఉండాలని హరీష్ శంకర్ & టీమ్ రేయింబవళ్లు కష్టపడుతోంది. కేవలం మాస్ మసాలా మాత్రమే కాకుండా, అభిమానులకు ఒక అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఎక్కడా రాజీ పడటం లేదు. డిజిటల్ వర్క్, సౌండ్ మిక్సింగ్ మరియు ఎడిటింగ్ పనులను హరీష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
Read also-Dhurandhar Trailer: రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్: ద రివేంజ్’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?
దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే ఒక ఊపు ఊపుతోంది. భగత్ సింగ్ గర్జన బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా బీజీఎమ్ కోసం ఇప్పటికే థమన్ రంగంలోకి దిగారు. ముందు అనుకున్న తేదీ కంటే వారం ముందుగానే అంటే మార్చి 19నే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ దూకుడు చూస్తుంటే, బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ పాత రికార్డులన్నీ చెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌ను వెండితెరపై చూడటానికి ఫ్యాన్స్ కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు. ఓజీ తో మంచి జోష్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో తన జోష్ కొనసాగిస్తారో లేదో చూడాలి.