E-Paper
Advertisement

AC Cleaning Tips: ఏసీ కూలింగ్ రావట్లేదా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి.. దెబ్బకు సెట్ అవుతుంది!

AC Cleaning Tips: ఏసీ కూలింగ్ రావట్లేదా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి.. దెబ్బకు సెట్ అవుతుంది!
Advertisement

AC Cleaning Tips: వేసవిలో పెద్ద ఎత్తున ప్రజలు ఏసీలను వినియోగిస్తుంటారు. భానుడి తాపం నుంచి తప్పించుకొని.. ఏసీ చల్లదనంలో హాయిగా సేద తీరుతుంటారు. అయితే పాత ఏసీల విషయంలో కొందరిని కూలింగ్ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏసీని 20 కంటే తక్కువ పెట్టినప్పటిప్పటికీ గదిలో ఉక్కపోతగా అనిపిస్తుంటుంది. చల్లదనం తగ్గిపోవడంతో పాటు దుమ్ము – వాసన రావడం వంటి సమస్యలు సైతం ఫేస్ చేస్తుంటారు. అయితే ఏసీని క్రమం తప్పకుండా క్లీన్ చేయకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రొఫెషనల్స్ అవసరం లేకుండానే సులభమైన పద్దతుల్లో ఏసీని ఇంట్లోనే క్లీన్ చేసుకునే చిట్కాలను ఇక్కడ అందించడం జరుగుతోంది.

అవసరమైన వస్తువులు..

ఏసీని శుభ్రం చేసే క్రమంలో ముందుగా మీరు కొన్ని వస్తువులను రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మృదువైన బ్రష్ లేదా వాక్యూమ్ క్లీనర్ తప్పసరిగా ఉండాలి. అలాగే సబ్బు నీరు, పాత క్లాత్, నీటి స్ప్రే బాటిల్ దగ్గర ఉంచుకోవాలి. ఇక క్లీనింగ్ ప్రక్రియ ప్రారంభించే ముందు ఏసీని ఆఫ్ చేయడం చాలా ముఖ్యం.

ఫిల్టర్లను శుభ్రం చేసే విధానం

Advertisement

ఫిల్టర్లను శుభ్రం చేయడంలో భాగంగా ముందుగా ఏసీ పైభాగాన ఉన్న ప్యానెల్ ను నెమ్మదిగా తెరవాలి. అప్పుడు లోపల నెట్ లాంటి ఎయిర్ ఫిల్టర్లు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా బయటకు తీసి వాటికి అంటిన దుమ్ము, దూళిని బ్రష్ లేదా వాక్యూమ్ క్లీనర్ సాయంతో తొలగించండి. మెుండి జిడ్డు ఉంటే ముందుగానే సిద్ధం చేసుకున్న సబ్బు నీరుతో దానిని వదిలించండి.

కూలింగ్ కాయిల్స్ శుభ్రం చేయడం

ఫిల్టర్లు తీసిన తర్వాత ఏసీ లోపల అల్యూమినియం రెక్కలు కనిపిస్తాయి. వాటిపై కూడా ఒక్కోసారి పెద్ద ఎత్తున దుమ్ము పేరుకుపోయి ఉంటుంది. ఈ నేపథ్యంగా సాఫ్ట్ గా ఉన్న బ్రష్ ను తీసుకొని నిలువుగా వాటిని తుడవండి. ఒకవేళ అడ్డంగా తుడిస్తే రెక్కలు వంగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది కష్టంగా అనిపిస్తే మార్కెట్ లో దొరికే ‘ఏసీ క్లీనర్ స్ప్రే’లను కూడా ఇందుకు బదులుగా వాడొచ్చు.

డ్రెయిన్ పైపు తనిఖీ

Advertisement

ఒక్కోసారి ఏసీ నుంచి గదిలోనికి నీరు కారుతుంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఏసీ నీరు బయటకు వెళ్లే పైపును పరిశీలించండి. లోపల ఏమైనా అడ్డంకులు ఉన్న సమయాల్లోనే ఇలా లీకులు జరుగుతుంటాయి. పైపులో ఏదైనా బ్లాక్ గుర్తిస్తే.. లోపలికి ఫోర్స్ గా నీటిని పంపించి శుభ్రం చేయండి.

అవుట్‌డోర్ యూనిట్ క్లీనింగ్

ఇండోర్ యూనిట్ తో పోలిస్తే బయట ఉండే యూనిట్ మీద ఇంకా ఎక్కువ దుమ్ము, దూళి ధూళి ఉంటాయి. దీనిపై నేరుగా వాటర్ పైపుతో నీటిని చల్లి కడగవచ్చు. అయితే లోపల ఉన్న వైర్లు, ఫ్యాన్ మోటార్ మీద నీరు పడకుండా జాగ్రత్త పడటం ముఖ్యం.

Also Read: Dishwasher vs Hand Washing: అంట్లు తోమడానికి .. రెండింటిలో ఏది బెస్ట్.. పైచేయి మనిషిదా? మిషన్‌దా?

క్లీనింగ్ తర్వాత ఇలా చేయండి..

క్లీనింగ్ పూర్తయ్యాక వెంటనే ఏసీ ఆన్ చేయవద్దు. కనీసం 30 నిమిషాలు ఆగాలి. తర్వాత ఏసీని ఫ్యాన్ మోడ్ (Fan Mode)లో 10 నిమిషాలు రన్ చేయండి. దీనివల్ల లోపల ఉన్న తేమ ఆరిపోతుంది. మెుత్తంగా ఈ స్టెప్స్ ఫాలో అయ్యి తేలిగ్గా మీ ఏసీని క్లీన్ చేసుకోవచ్చు. ఏసీలోని దుమ్ము, దూళి మెుత్తం పోయి.. కొత్తదానిలా చల్లదనాన్ని ఇస్తుంది.

Also Read: Best Split Air Conditioners: ఏంటి భయ్యా నిజమా.. రూ.25వేల లోపే బ్రాండెడ్ స్ప్లిట్ ఏసీలా? డోంట్ మిస్!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×