E-Paper
Advertisement

ఇకపై ఫోన్‌పే, గూగుల్ పేలతో పని లేదు.. వాట్సాప్‌లోనే మొబైల్ రీఛార్జ్‌.. ఎలాగో చూడండి!

ఇకపై ఫోన్‌పే, గూగుల్ పేలతో పని లేదు.. వాట్సాప్‌లోనే మొబైల్ రీఛార్జ్‌.. ఎలాగో చూడండి!
Advertisement

WhatsApp Mobile Recharge: మనలో చాలామంది పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎక్కువగా వాడే యాప్ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా వాట్సప్ మాత్రమే. అలాంటి వాట్సప్ ఇప్పుడు మన భారతీయుల కోసం ఒక క్రేజీ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై మనం చాటింగ్ చేసుకునే గ్యాప్‌లోనే మన ఫోన్ రీఛార్జ్ కూడా చేసేసుకోవచ్చు. దీనికోసం వాట్సప్ సంస్థ PayU అనే పేమెంట్ సంస్థతో చేతులు కలిపింది. ఇప్పటికే మనం వాట్సప్‌లో మెట్రో టికెట్లు బుక్ చేయడం, కరెంటు బిల్లులు కట్టడం వంటివి చేస్తున్నాం కదా.. ఇప్పుడు ఆ లిస్టులోకి మొబైల్ రీఛార్జ్ కూడా వచ్చి చేరింది.

అందరికీ అందుబాటులోకి వచ్చేస్తోంది..

ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న వారికి, అలాగే ఐఫోన్ వాడుతున్న వారికి కూడా అందుబాటులోకి రానుంది. దీనివల్ల లాభం ఏంటంటే.. రీఛార్జ్ చేసుకోవడానికి మనం ప్రత్యేకంగా వేరే యాప్‌లు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు జియో, ఎయిర్‌టెల్ లేదా వొడాఫోన్ ఐడియా (Vi) ఇలా ఏ సిమ్ వాడుతున్నా సరే.. ఈజీగా రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి కొందరికి మాత్రమే కనిపిస్తున్న ఈ ఫీచర్, వచ్చే కొద్ది వారాల్లో అందరి ఫోన్లలో దర్శనమివ్వనుంది.

Advertisement

Also Read: ఐఫోన్, శాంసంగ్ క్రేజ్ ఖతమ్.. అతి తక్కువ ధరకే మోటో కొత్త ఫోల్డబుల్ ఫోన్, రేజర్ 70 ఫీచర్లు ఇవే..

రీఛార్జ్ చేయడం మరింత ఈజీ..

మరి వాట్సప్‌లో రీఛార్జ్ ఎలా చేయాలో తెలుసా? మన వాట్సాప్ హోమ్ స్క్రీన్‌పై కెమెరా గుర్తు పక్కనే ఒక రూపాయి (₹) గుర్తు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే పేమెంట్స్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిలోకి వెళ్లి మన నెంబర్ ఇచ్చి, మనకు నచ్చిన ప్లాన్‌ను సెలెక్ట్ చేసుకోవడమే. మనం ఎప్పుడూ వాడే UPI, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డులతో పేమెంట్ ఫినిష్ చేయొచ్చు. కావాలంటే ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు చాట్ బాక్స్‌లో ఉండే రూపాయి గుర్తుతో కూడా ఈ పని కానిచ్చేయొచ్చు.

పైసా పోదు.. అంతా సేఫ్..

Advertisement

వాట్సప్‌లో డబ్బులు కడితే సేఫేనా అని చాలామందికి డౌట్ రావచ్చు. కానీ వాట్సాప్ దీనిపై పూర్తి భరోసా ఇస్తోంది. UPI వాడేటప్పుడు ఎప్పటిలాగే మనం పిన్ నెంబర్ కొడితేనే డబ్బులు కట్ అవుతాయి. రీఛార్జ్ అవ్వగానే మన ప్లాన్ ఏంటి, ఎన్ని రోజులు వస్తుంది అనే వివరాలతో ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది. మనం ఎప్పుడు ఎవరికి రీఛార్జ్ చేశామో కూడా పేమెంట్స్ హిస్టరీలో చెక్ చేసుకోవచ్చు. నిత్యం వాడే యాప్‌లోనే ఇలాంటి సదుపాయం రావడం నిజంగా మన అందరికీ పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి.

Also Read: ఈ పెద్దాయన 72 ఫోన్లతో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు, ఎందుకో తెలిస్తే వావ్ అంటారు!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×