E-Paper
Advertisement

డబుల్ డోర్ ఫ్రిడ్జ్ స్టైల్ కోసమే అనుకుంటే పొరపాటే.. దీని వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు!

డబుల్ డోర్ ఫ్రిడ్జ్ స్టైల్ కోసమే అనుకుంటే పొరపాటే.. దీని వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు!
Advertisement

Double Door Refrigerators: ఫ్రిడ్జ్ డోర్ తీయగానే ఏదో ఒక డబ్బా కాలి మీద పడటం, లేదంటే వెజిటేబుల్స్ మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలు సర్దడానికి చోటు లేక ఇబ్బంది పడటం.. మనలో చాలామందికి రోజూ ఇలాంటి తలనొప్పులు ఉంటాయి కదా. ఒకప్పుడు చిన్న ఫ్రిడ్జ్ సరిపోయేది కానీ, నేటి బిజీ లైఫ్‌లో అది అస్సలు చాలడం లేదు. వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకున్నా.. వండిన పదార్థాలు పెట్టుకోవాలి అనుకున్నా ఇప్పుడు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనేది కేవలం స్టైల్ కోసం కాదు.. అత్యవసర వస్తువుగా మారిపోయింది.

స్థలం ఆదా..

డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అంటే కేవలం ఖరీదైనది అని మాత్రమే చూడకండి.. అది మన పనిని ఎంత సులభం చేస్తుందో ఆలోచించండి. దీనిలో ఉండే 450 నుండి 700 లీటర్ల ఖాళీ వల్ల, వస్తువులను ఒకదానిపై ఒకటి కుక్కాల్సిన అవసరం ఉండదు. ఏ వస్తువు ఎక్కడుందో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా డోర్లు వెడల్పుగా ఉండటం వల్ల, లోపల మూలల్లో ఉన్న పాలు, చట్నీ డబ్బాల కోసం వెతుక్కునే పని తప్పుతుంది. ప్రతి పదార్థాన్ని చక్కగా పెట్టుకోవచ్చు.

Advertisement

Also Read: ఇకపై ఫోన్‌పే, గూగుల్ పేలతో పని లేదు.. వాట్సాప్‌లోనే మొబైల్ రీఛార్జ్‌.. ఎలాగో చూడండి!

కూరగాయలు ఫ్రెష్‌గా..

ప్రస్తుతం దొరుకుతున్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లలో ఉండే మంచి సౌకర్యం ఏమిటంటే.. ఫ్రీజర్‌కు, కింద ఉండే భాగాలకు వేర్వేరుగా కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి. దీనివల్ల ఫ్రీజర్‌లో ఉన్న ఐస్‌క్రీమ్‌కు పక్కనే ఉన్న కూరగాయల వాసన అంటుకోదు. ఆకుకూరలు వాడిపోకుండా, గడ్డకట్టకుండా రోజుల తరబడి తాజాగా ఉంటాయి. మనం కష్టపడి మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలు పడేయాల్సిన పని లేకుండా, వండినప్పుడు అప్పుడే తెచ్చినంత రుచిగా ఉంటాయి.

కరెంట్ బిల్లు తక్కువే..

Advertisement

చాలామంది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనగానే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందేమో అని భయపడతారు. కానీ పాత ఫ్రిడ్జ్‌ల కంటే ఇవే తక్కువ కరెంట్ వాడుకుంటాయి. దీనిలో ఉండే ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీ వల్ల, అది అవసరమైనంత వరకే కూలింగ్ ఇస్తూ కరెంట్‌ను ఆదా చేస్తుంది. అలాగే ఈ ఫ్రిడ్జ్‌లలో సౌండ్ కూడా ఎక్కువగా రాదు. ఇక డిజిటల్ కంట్రోల్స్, వాటర్ డిస్పెన్సర్ వంటి ఫీచర్లు మన పనులను మరింత ఈజీ చేసేస్తాయి.

కొనేముందు..

ఆవేశపడి ఏదో ఒక ఫ్రిడ్జ్ కొనేయకుండా.. మీ ఇంట్లో ఆ ఫ్రిడ్జ్ పట్టేంత ఖాళీ ఉందో లేదో ముందే కొలుచుకోండి. అలాగే ఫ్రిడ్జ్ చుట్టూ గాలి ఆడేందుకు కొంచెం గ్యాప్ ఉండాలి. అప్పుడే అది బాగా పనిచేస్తుంది. ఒకవేళ చిన్న ఫ్యామిలీ అయితే 450 లీటర్లు సరిపోతుంది. అదే పిల్లలతో కలిపి నలుగురైదుగురు ఉంటే మాత్రం 600 లీటర్ల మోడల్ తీసుకోవడం ఉత్తమం.

Also Read: ఐఫోన్, శాంసంగ్ క్రేజ్ ఖతమ్.. అతి తక్కువ ధరకే మోటో కొత్త ఫోల్డబుల్ ఫోన్, రేజర్ 70 ఫీచర్లు ఇవే..

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×