E-Paper
Advertisement

Washing Machine Tips: మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా? ఈ తప్పులు చేయకండి.. చేశారో మర్నాడు షెడ్డుకే!

Washing Machine Tips: మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా? ఈ తప్పులు చేయకండి.. చేశారో మర్నాడు షెడ్డుకే!
Advertisement

Washing Machine Tips: ప్రస్తుతం ప్రతీ ఇంట్లో వాషింగ్ మిషన్ అత్యవసరంగా మారిపోయింది. పేద, ధనిక అన్న తారతమ్యాలు లేకుండా ప్రతీ ఒక్కరు వాషింగ్ మిషన్లను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్న వాషర్లు.. యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మీరు తెలియక చేసే కొన్ని పొరపాట్లు కారణంగా వాషింగ్ మిషన్ త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వాషింగ్ మిషన్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాధారణంగా చేసే పొరపాట్ల గురించి ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పరిమితికి మించి బట్టలు కుక్కడం

చాలా మంది పని త్వరగా అయిపోవాలన్న ఉద్దేశంతో వాషింగ్ మిషన్ సామర్థ్యానికి మించి అందులో బట్టలు కుక్కుతారు. దీనివల్ల బట్టలు సరిగా శుభ్రం కాకపోవడమే కాకుండా.. వాషింగ్ మిషన్ లోని డ్రమ్, మోటార్ పై అధిక భారం పడుతుంది. ఫలితంగా అవి త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మిషన్ లో బట్టలు వేసే ప్రతీసారి డ్రమ్ లో ఒక జానెడు ప్రాంతం ఖాళీగా ఉండేలా జాగ్రత్త వహించింది.

సర్ఫ్ ఎక్కువగా వాడటం

Advertisement

సాధారణంగా చాలా మందిలో ఒక అపోహ ఉంది. ఎంత ఎక్కువగా సర్ఫ్ వేస్తే బట్టల మురికి అంత సమర్థవంతంగా వదులుతాయని భావిస్తుంటారు. కానీ అందులో నిజం లేదు. సర్ఫ్ ఎక్కువ వేయడం వల్ల వాషింగ్ మిషన్ దెబ్బతినే ప్రమాదముంది. నురగ ఎక్కువ రావడం వల్ల అది మిషన్ పైపుల్లో పేరుకుపోయి బ్యాక్టీరియా, దుర్వాసనకు దారి తీయవచ్చు. ఇది వాషింగ్ మిషన్ల సెన్సార్లను పాడు చేయవచ్చు.

తడి బట్టలు అలాగే వదిలేయడం

కొందరు వాషింగ్ పూర్తైన తర్వాత కూడా బట్టలను బయటకు తీయకుండా గంటల తరబడి అలాగే మిషన్ లో ఉంచేస్తారు. దీని వల్ల లోపలి భాగంలో తేమ అలాగే ఉండిపోయి.. బట్టలు, మిషన్ నుండి విపరీతమైన దుర్వాసన వస్తుంది. డ్రమ్ లోపల ఫంగస్ చేరే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇక మీదట అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడింది.

Advertisement

Also Read: AP Council Sessions 2026: మండలిలో మరోసారి గందరగోళం.. మంత్రి పయ్యావుల ఉగ్రరూపం, ఈసారి..

మిషన్ క్లీనింగ్‌లో నిర్లక్ష్యం

బట్టలు శుభ్రం చేసే వాషింగ్ మిషన్ కు మళ్లీ క్లీనింగ్ ఎందుకని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ఇది చాలా తప్పు. బట్టలు ఉతికిన అనంతం వాటి తాలుకూ మురికి, సర్ఫ్ అవశేషాలు టబ్ లేదా మిషన్ లో పేరుకుపోతాయి. ఇది దాని పనితీరును దెబ్బతీయవచ్చు. కాబట్టి నెలకు ఒకసారి టబ్ క్లీన్ (Tub Clean) ను చేస్తే చాలా మంచింది. వెనిగర్, బేకింగ్ సోడా వేసి ఖాళీ మిషన్ ను రన్ చేస్తే దానంతటా అదే క్లీన్ అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Vivo V70 Elite: 50MP ట్రిపుల్ కెమెరా, 6500mAh బ్యాటరీతో ప్రీమియం మిడ్ రేంజ్ ఫోన్స్ లాంచ్ చేసిన వివో.. ధర, ఫీచర్స్ ఇవే

Related News

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×