E-Paper
Advertisement

Project Silica: 10000 సంవత్సరాల వరకు డేటాను భద్రపరిచే కొత్త చిప్.. 4TB గ్లాస్ చిప్ తయారు చేసిన మైక్రోసాఫ్ట్

Project Silica: 10000 సంవత్సరాల వరకు డేటాను భద్రపరిచే కొత్త చిప్.. 4TB గ్లాస్ చిప్ తయారు చేసిన మైక్రోసాఫ్ట్
Advertisement

Project Silica| దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఒక కొత్త స్టోరేజ్ డివైస్‌ను తయారు చేసింది. ఈ డివైస్‌లో దాదాపు 10,000 సంవత్సరాల పాటు డేటా భద్రంగా ఉంటుంది. దీన్ని ప్రాజెక్ట్ సిలికా అనే ప్రత్యేక పరిశోధన కార్యక్రమంలో అభివృద్ధి చేశారు. ఈ డివైస్ తయారీ కోసం సాధారణ మ్యాగ్నెటిక్ హార్డ్ డిస్క్‌ల బదులు లేజర్‌ గ్లాస్ ఉపయోగించారు. ఈ గాజు చిప్‌లో వందల, వేల సంవత్సరాల పాటు డేటా దెబ్బతినకుండా ఉంటుంది. ఒకే గాజు చిప్‌లో 4 టెరాబైట్ల (TB) డేటా నిల్వ చేయవచ్చు. అంటే లక్షలాది డాక్యుమెంట్లు లేదా వేలాది అల్ట్రా హై-డెఫినిషన్ సినిమాలు సులభంగా భద్రపరచవచ్చు. దీర్ఘకాలిక డిజిటల్ ఆర్కైవ్‌లు తయారు చేయడమే ఈ టెక్నాలజీ లక్ష్యం.

డేటాను డెలీట్ చేయడం కుదరదు

ఈ గాజు చిప్‌లో ఒకసారి డేటా రాసిన తర్వాత దాన్ని తొలగించడం లేదా మార్చడం సాధ్యం కాదు. ఇది చరిత్రకు సంబంధించిన ముఖ్య రికార్డులకు, కీలక డాక్యుమెంట్లకు చాలా ఉపయోగకరం. సాధారణ హార్డ్ డిస్క్‌లలా రీ-రైట్ చేయలేం. లేజర్ పల్స్‌లతో గాజు లోపల చిన్న చిన్న డేటా లేయర్లు సృష్టిస్తారు. ఈ లేయర్లు వేల సంవత్సరాల పాటు దెబ్బతినకుండా ఉంటాయి. గాజు మందం కేవలం 2 మిల్లీమీటర్లు మాత్రమే. బోరోసిలికేట్ మెటీరియల్‌తో తయారు చేశారు. దీనివల్ల గాజు చాలా బలంగా, స్థిరంగా ఉంటుంది.

సిలికా అంటే ఏమిటి?

Advertisement

సిలికా అనేది అత్యంత బలమైన మెటీరియల్. నిప్పు, నీరు, మైక్రోవేవ్ రేడియేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్‌లు ఏవీ దీన్ని దెబ్బతీయలేవు. సాధారణ స్టోరేజ్ డివైస్‌లు ఇలాంటి పరిస్థితుల్లో డ్యామేజ్ అవుతాయి. ఈ చిప్‌లో డేటాను 3D స్ట్రక్చర్లలో (వాక్సెల్స్) నిల్వ చేస్తారు. ప్రతి వాక్సెల్ ఒక 3D పిక్సెల్ లాంటిది. లేజర్‌లతో గాజు లోపల శాశ్వతంగా మార్పులు చేస్తారు. తర్వాత AI అల్గారిథమ్‌లతో డేటాను సరిగ్గా చదవగలరు. ఒక చిప్‌లో సుమారు 4.8 టెరాబైట్ల డేటా ఉంటుంది. దాదాపు 20 లక్షల పుస్తకాలు లేదా 5,000 UHD సినిమాలు భద్రంగా స్టోర్ చేయవచ్చు.

ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?

ప్రపంచవ్యాప్తంగా స్టోరేజ్, ఆప్టికల్ డివైస్‌లు నిపుణులు కలిసి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. స్విన్‌బర్న్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఆప్టికల్ రీసెర్చ్‌లో సహకరించారు. జేమ్స్ చోన్, పీటర్ కజాన్స్కీ వంటి ఆప్టికల్ ఫిజిసిస్టులు కీలక పాత్ర పోషించారు. ప్రాజెక్ట్ సిలికా రీసెర్చ్ డైరెక్టర్ రిచర్డ్ బ్లాక్ దీని గురించి వివరించారు. గాజు లక్షణాలను బాగా అధ్యయనం చేసి, లేజర్‌లు ఎలా పనిచేస్తాయో తెలుసుకున్నామన్నారు. AI సాయంతో సంక్లిష్ట వాక్సెల్ ప్యాటర్న్‌లను ఇందులో రీడింగ్ చేసేందుకు వీలుగా ఉంటుంది. విద్యుత్ లేకున్నా డేటా భద్రంగా ఉంటుంది.

Advertisement

Also Read: స్మార్ట్ టీవీలో టైపింగ్ చేయడం ఇబ్బందిగా ఉందా? ఈ సింపుల్ ట్రిక్‌తో ఈజీగా చేసేయండి

భవిష్యత్తు టెక్నాలజీ

ప్రస్తుత స్టోరేజ్ పరికరాలు కొన్ని దశాబ్దాల్లోనే పాడవుతాయి. హార్డ్ డిస్క్‌లు, SSDలు నిరంతరం మెయింటెనెన్స్, రీప్లేస్‌మెంట్ అవసరం. క్లౌడ్ స్టోరేజ్ కూడా ఎనర్జీ, డేటా సెంటర్లపై ఆధారపడుతుంది. ఈ గాజు చిప్ ఎనర్జీ లేకుండా దీర్ఘకాలిక ఆర్కైవ్ సొల్యూషన్ ఇస్తుంది. ప్రభుత్వాలు, సంస్థలు, మ్యూజియంలు, రీసెర్చ్ సెంటర్లు ముఖ్య సమాచారాన్ని శాశ్వతంగా భద్రపరచవచ్చు. జ్ఞానాన్ని డిజిటల్ డేటా రూపంలో భద్రపరించేందుకు ఇది పెద్ద ముందడుగు. ప్రాజెక్ట్ సిలికా సస్టైనబుల్ డేటా స్టోరేజ్ దిశగా గొప్ప అడుగు.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×