E-Paper
Advertisement

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?
Advertisement

Dyson CameraJet: టెక్నాలజీ మన జీవితాలను ఎన్నో విధాలుగా మార్చేసింది. కానీ, పళ్లు తోముకునే బ్రష్‌లో కూడా కెమెరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వస్తాయని ఎవరైనా ఊహించారా? ప్రీమియం బ్రాండ్ డైసన్ ఇదే చేసి చూపించింది. ‘కెమెరాజెట్’ పేరుతో ఒక సరికొత్త ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రోజువారీ ఓరల్ కేర్‌ను పూర్తిగా డిజిటల్ అనుభవంగా మార్చేస్తున్న ఈ క్రేజీ గ్యాడ్జెట్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

బ్రష్ లోపలే కెమెరా..

ఈ బ్రష్ హెడ్‌లో 100,000 పిక్సెల్స్ ఉన్న ఒక చిన్న మ్యాక్రో కెమెరా ఉంటుంది. పళ్ల మధ్య ఉన్న ఖాళీలను ఇది సెకనుకు 28 చిత్రాలు తీస్తూ రియల్ టైమ్‌లో పరిశీలిస్తుంది. ఎక్కడైనా మురికి లేదా పంటి సందుల్లో ఖాళీలు కనిపిస్తే.. కేవలం 100 మిల్లీసెకన్లలో అక్కడ మౌత్ వాష్‌ను స్ప్రే చేస్తుంది. నోరంతా కాకుండా, అవసరమైన చోటే స్ప్రే చేయడం దీని ప్రత్యేకం.

Advertisement

Also Read: శాంసంగ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఆ పాపులర్ ఫోన్ల ధరలు విపరీతంగా పెంపు!

ఫోన్‌లోనే లైవ్ స్ట్రీమింగ్..

మన పళ్ల వెనుక భాగాన్ని మనం స్వయంగా చూడటం కష్టం. కానీ ఈ బ్రష్‌లోని కెమెరా సహాయంతో మైడైసన్ యాప్ ద్వారా ఫోన్‌లోనే మన నోటి లోపలి భాగాలను లైవ్‌గా చూడవచ్చు. అయితే ఈ కెమెరా దృశ్యాలు ఎక్కడా సేవ్ కావు, క్లౌడ్‌లోకి వెళ్లవని, యూజర్ల ప్రైవసీకి పూర్తి భద్రత ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

ఆరేళ్ల శ్రమ.. 16 మిలియన్ల కోడింగ్..

Advertisement

ఒక టూత్ బ్రష్ కోసం డైసన్ 6 సంవత్సరాలు పరిశోధనలు చేసింది. దాదాపు 661 మంది ఇంజనీర్లు కష్టపడి 16 మిలియన్ లైన్ల కోడింగ్ రాశారు. సుమారు 4,70,000 దంతాల చిత్రాలను ఉపయోగించి ఈ ఏఐ సిస్టమ్‌ను తయారుచేశారు. ఇది బ్రష్ చేయడం, వాటర్ ఫ్లాసింగ్, లైవ్ వ్యూ అనే మూడు పనులను ఒకేసారి చేస్తుంది.

ధర ఎంత? మనకు అవసరమేనా?

ఈ ఏఐ టూత్ బ్రష్ ధర 499 డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.42,000 వరకు ఉంటుంది. ఇది సెరామిక్ పింక్, బ్లూ రంగుల్లో లభిస్తుంది. మనదేశంలో బ్రష్‌పై రూ.42,000 ఖర్చు చేయడం ఎంతవరకు సాధ్యమనేది పక్కన పెడితే.. ఓరల్ కేర్‌లో టెక్నాలజీని ఈ స్థాయికి తీసుకెళ్లడం నిజంగా వింతే.

Also Read: లెనోవో నుంచి కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్.. 165Hz స్క్రీన్, RTX 3050తో అదరగొట్టే ఫీచర్లు!

Tags

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×