E-Paper
Advertisement

లెనోవో నుంచి కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్.. 165Hz స్క్రీన్, RTX 3050తో అదరగొట్టే ఫీచర్లు!

లెనోవో నుంచి కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్.. 165Hz స్క్రీన్, RTX 3050తో అదరగొట్టే ఫీచర్లు!
Advertisement

Lenovo LOQ Essential 15IRH11: గేమింగ్ ల్యాప్‌టాప్ అంటే భారీ బడ్జెట్ పెట్టాల్సిందే అనుకుంటున్నారా? అయితే తాజాగా లెనోవో కంపెనీ తీసుకొచ్చిన కొత్త LOQ Essential 15IRH11 ఒకసారి చూడాల్సిందే. 165Hz డిస్‌ప్లే, RTX 3050 గ్రాఫిక్స్, ఇంటెల్ ప్రాసెసర్ వంటి ఫీచర్లతో వచ్చిన ఈ ల్యాప్‌టాప్.. గేమింగ్‌తో పాటు రోజువారీ పనులకు కూడా ఉపయోగపడేలా కనిపిస్తోంది. ముఖ్యంగా మొదటిసారి గేమింగ్ ల్యాప్‌టాప్ కొనేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

ఈ LOQ Essential 15IRH11లో 15.3 అంగుళాల WUXGA IPS డిస్‌ప్లే ఉంది. 16:10 యాస్పెక్ట్ రేషియోతో వచ్చే ఈ స్క్రీన్‌లో గరిష్ఠంగా 165Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. వేగంగా కదిలే గేమ్స్‌లో మూవ్‌మెంట్స్ స్మూత్‌గా కనిపించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 100% sRGB కవరేజ్ కూడా ఉంది.

Advertisement

Also Read: iPhone 18 Proలో బ్లాక్ కలర్ ఉండదా? తాజా లీక్‌తో యాపిల్ ప్రియుల్లో పెరిగిన టెన్షన్!

ఇక పనితీరు విషయానికి వస్తే.. ఇంటెల్ కోర్ 200 సిరీస్ ప్రాసెసర్లు, NVIDIA RTX 3050 Laptop GPU ఉన్నాయి. RTX 3050ను 4GB, 6GB వేరియంట్లలో ఎంచుకునే అవకాశం ఉంది. DLSS, రే ట్రేసింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో సాధారణ గేమింగ్‌కు మంచి పెర్ఫార్మెన్స్ ఆశించొచ్చు. అయితే హెవీ AAA గేమ్స్‌ను హై సెట్టింగ్స్‌లో ఆడాలంటే కొంత సర్దుబాటు అవసరం కావచ్చు.

Advertisement

ఈ ల్యాప్‌టాప్‌లో రెండు మెమరీ, SSD స్లాట్లు ఉన్నాయి. కాన్ఫిగరేషన్‌ను బట్టి 32GB వరకు RAM, 1TB SSD వరకు వెళ్లొచ్చు. అంటే.. భవిష్యత్తులో అవసరం పెరిగితే ల్యాప్‌టాప్‌ను అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 60Wh బ్యాటరీ, ర్యాపిడ్ ఛార్జ్ ప్రో కూడా ఉన్నాయి.

కంపెనీ ప్రకారం LOQ Essential 15IRH11 ప్రారంభ ధర రూ.92,600. కొన్ని మార్కెట్లలో ఇది ఇప్పటికే అందుబాటులోకి రాగా.. విస్తృతంగా అక్టోబర్ నుంచి లభించే అవకాశం ఉంది. భారత్‌లో ధర, లభ్యతపై లెనోవో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మొత్తంగా చూస్తే.. 165Hz డిస్‌ప్లే, RTX 3050, అప్‌గ్రేడ్ ఆప్షన్లు కావాలనుకునే బడ్జెట్ గేమర్లకు ఈ ల్యాప్‌టాప్ ఆసక్తికరమైన ఆప్షన్‌గా కనిపిస్తోంది.

Also Read: కొత్త టీవీని గోడకు పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ 5 విషయాలు ముందే తెలుసుకోండి!

Tags

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×