E-Paper
Advertisement

30000mAh Battery Phone: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 రోజులు నడిచే ఫోన్.. 30000mAh బ్యాటరీ, రగ్డ్ డిజైన్‌తో ఫుల్ బ్యాకప్

30000mAh Battery Phone: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 రోజులు నడిచే ఫోన్.. 30000mAh బ్యాటరీ, రగ్డ్ డిజైన్‌తో ఫుల్ బ్యాకప్
Advertisement

Energizer P30K Apex| ఎనర్‌జైర్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ త్వరలో కొత్త పవర్ ఫోన్ లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ పేరు ఎనర్‌జైర్ P30K అపెక్స్. ఈ ఫోన్ ప్రధానంగా ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోసం రూపొందించబడింది. టెక్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఇందులో 30000mAh బ్యాటరీ ఉండవచ్చు. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో 4,000 నుంచి 6,000mAh బ్యాటరీలుంటాయి. వాటితో పోలిస్తే ఇది చాలా పెద్ద బ్యాటరీ. ఈ ఫోన్ చాలా రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ ఇవ్వాలనుకునే వారికి బాగా సరిపోతుంది. సన్నగా డిజైన్ కంటే బలమైన బ్యాటరీ, డ్యూరబిలిటీకి కంపెనీ ప్రాధాన్యత ఇచ్చింది.

30,000mAh పెద్ద బ్యాటరీతో లాంగ్ బ్యాకప్

ఈ ఫోన్‌లో అతి పెద్ద హైలైట్ 30,000mAh బ్యాటరీ. ఫోన్ సాధారణ స్థాయి యూసేజ్‌లో దాదాపు ఒక నెల రోజుల పాటు బ్యాటరీ ఉండవచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. హెవీ యూసేజ్‌లో కూడా చాలా రోజులు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఇంత పెద్ద బ్యాటరీని సపోర్ట్ చేయడానికి 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. USB Type-C పోర్ట్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. అయితే ఇంత పెద్ద బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు.

పర్‌ఫామెన్స్, హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్

Advertisement

ఈ ఫోన్ రోజువారీ ఉపయోగానికి బలమైన పర్‌ఫామెన్స్ ఇస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉండవచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ చిప్‌సెట్ మల్టీటాస్కింగ్, మోడరేట్ గేమింగ్ సులభంగా చేస్తుంది. 12GB ర్యామ్ ఉండవచ్చు. దీంతో యాప్స్ స్మూత్‌గా నడుస్తాయి. 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండవచ్చు. వీడియోలు, ఫైల్స్, యాప్స్ సులభంగా స్టోర్ చేయవచ్చు.

డిస్‌ప్లే, కెమెరా సెటప్

ఎనర్‌జైజర్ P30K అపెక్స్‌లో పెద్ద డిస్‌ప్లే ఉండవచ్చు. 6.95 ఇంచ్ IPS స్క్రీన్ ఉండవచ్చని రిపోర్టులు. రిజల్యూషన్ 2460*1080 పిక్సెల్స్ వరకు ఉండవచ్చు. స్క్రీన్ క్లియర్‌గా, సౌకర్యవంతంగా చూడవచ్చు. కెమెరా సెటప్ కూడా బలంగా ఉంది. 200MP ప్రైమరీ రియర్ కెమెరా ఉండవచ్చు. అదనంగా 50MP, 5MP సెన్సార్లు ఉండవచ్చు. సెల్ఫీ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.

రగ్డ్ డిజైన్, టఫ్ ఎన్విరాన్‌మెంట్‌కు సరిపోతుంది

Advertisement

ఈ ఫోన్ రగ్డ్ స్మార్ట్‌ఫోన్ కేటగిరీలోకి వస్తుంది. డ్యూరబిలిటీ, రెసిస్టెన్స్ కోసమే ప్రధానంగా దీన్ని తయారు చేశారు. IP69K రేటింగ్ ఉండవచ్చు. అంటే దుమ్ము, నీటి నుంచి రక్షణ ఇస్తుంది. ఎండ, వర్షం లాంటి తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో కూడా బాగా పనిచేస్తుంది. ట్రావెలర్లు, ఔట్‌డోర్ వర్కర్లకు బాగా సరిపోతుంది.

Also Read: ప్రకృతి నాశనం.. మనుషుల కంటే ఎక్కువ నీరు తాగేస్తున్న ఏఐ టెక్నాలజీ

లాంచ్, ధర

రిపోర్టుల ప్రకారం ఈ ఫోన్ జూన్ 2026లో లాంచ్ అవుతుంది. ధర సుమారు 399 యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ.42,300) ఉండవచ్చు. ఈ ఫోన్ చాలా రోజుల బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే వారిని ఆకర్షిస్తుంది. తరచూ ఛార్జ్ చేయడం ఇబ్బందిగా ఉన్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలిపిన స్మార్ట్‌ఫోన్, దాని ప్రత్యేకతలు టెక్ మీడియా రిపోర్ట్స్ ఆధారంగా సేకరించినవి. పూర్తి సమాచారం త్వరలోనే అధికారికంగా తెలుస్తుంది. కథనంలో పేర్కొన్న ఫోన్ ఫీచర్స్ కస్టమర్లు కొనుగోలు చేసే సమయంలో మారిపోయి ఉండొచ్చు. పై తెలిపిన వివరాలకు ‘బిగ్ టీవీ’ మీడియా బాధ్యత వహించదు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×