Sayaji Shinde:వృక్షో రక్షతి రక్షితః.. వృక్షాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని అర్థం. ఇక అందుకే ఈ మధ్యకాలంలో ఒకవైపు ధర్మాన్ని తప్పకుండా పాటిస్తూనే…వేలాదిగా మొక్కలు నాటుతూ.. నాటిస్తూ ప్రకృతి ప్రేమికులుగా ఎంతోమంది దర్శనమిస్తున్నారు. ఎంత బిజీ పనుల్లో ఉన్నప్పటికీ కూడా మొక్కలు నాటుతూ భవిష్యత్తు తరాలకు పాటుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఒక నటుడు తన తల్లిపై ఉన్న ప్రేమతో భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా తీసుకున్న నిర్ణయం నేడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. తన తల్లి మీద ప్రేమతో ఆయన తీసుకున్న నిర్ణయమే నేడు మహా వనముగా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది.
అసలు విషయంలోకి వెళ్తే.. షియాజీ షిండే తన తల్లి మరణించినప్పుడు తన తల్లి మీద ప్రేమతో ఆమె బరువుకి సమానమైన విత్తనాలను తీసుకొని నాటాడట. అయితే ఆ విత్తనాలే మొక్కలుగా మారి నేడు మహా వృక్షాలుగా మారుతున్నాయి. ఇదే విషయంపై షియాజే షిండే మాట్లాడుతూ.. “మా అమ్మ చనిపోయినప్పుడు ఆమె బరువుకి సమానమైన విత్తనాలను తీసుకొని నాటాను. ఇప్పుడు అవి 6,50,000 చెట్లుగా ఎదిగి.. మా అమ్మలాగే నాతో ఉన్నాయి ” అంటూ తన తల్లిపై ఉన్న ప్రేమను చాటుకుంటూ నేడు మహా యాగానికి కంకణం కట్టారు. ప్రస్తుతం వృక్షాలుగా మారుతూ భవిష్యత్తు తరాలకు మంచి ఉపయోగాన్ని కలిగించనున్నాయి. ఏది ఏమైనా నటుడు షియాజీ షిండే తీసుకున్న ఈ నిర్ణయం, అమలు చేస్తున్న పద్ధతిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
షియాజీ షిండే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠీ చిత్రాలలో నటించి పాపులర్ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు. ఈయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ఠాగూర్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈయిన ఆ తర్వాత అతడు, వీడే, లక్ష్మి, పోకిరి, కిక్ ,డాన్ శీను, టచ్ చేసి చూడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా సుమారుగా 50 కి పైగా చిత్రాలలో నటించి మెప్పించారు..
ALSO READ:Monalisa Father: మోనాలిసా పెళ్లిపై తండ్రి కీలక వ్యాఖ్యలు.. అల్లుడి గురించి విస్తుపోయే నిజాలు!
ఇకపోతే షియాజీ షిండే ఉండే ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు వృక్షాలపై ఉన్న ప్రేమతో ఒకవైపు అంతరించిపోతున్న భారత వృక్షజాతులను కాపాడడానికి కూడా “ట్రీ లవ్ ఫౌండేషన్” అనే ఎన్జీవో సంస్థను కూడా స్థాపించారు. ఈ సంస్థ సహాయంతో అనేక నగరాలలో “సయాజీ పార్క్స్” కూడా నిర్మించారు. వీటిలో అనేక భారతీయ వృక్షజాతుల మొక్కలు సంరక్షించబడుతున్నాయి. సయాజీ పార్క్సుతోపాటు ప్రతి పాఠశాలలో కూడా షిండే నర్సరీలను నిర్మించడంలో చొరవ తీసుకోవడం ప్రశంసనీయమనే చెప్పాలి . అటు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ మొక్కల బాధ్యతను తీసుకొని.. ప్రతి విద్యార్థి ఒక్కో మొక్క బాధ్యతను తీసుకొని ..ఆ చెట్లు పెరిగిన తర్వాత ఆ చెట్టుకు వాళ్ళ పేర్లే పెట్టడం ఇప్పుడు విశేషంగా మారింది. అటు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను చెట్లను పెంచేలా ప్రోత్సహిస్తున్నారు. ఏదిఏమైనా షియాజీ షిండే తీసుకున్న నిర్ణయం నిజంగా ప్రశంసనీయమని చెప్పాలి.