E-Paper
Advertisement

Ugadi Travel Alert: ఉగాది ట్రావెలర్స్ కు బ్యాడ్ న్యూస్.. నో రైల్వే టిక్కెట్ రిజర్వేషన్స్!

Ugadi Travel Alert: ఉగాది ట్రావెలర్స్ కు బ్యాడ్ న్యూస్.. నో రైల్వే టిక్కెట్ రిజర్వేషన్స్!
Advertisement

Bad News For Ugadi Travellers: ఉగాది పండుగ వస్తున్న నేపథ్యంలో తెలుగు ప్రయాణీకులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ముందస్తుగానే రైల్వే టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే ప్రయాణీకులకు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. రైల్వే రిజర్వేషన్ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణీకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన సూచించింది.

ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..

ఇప్పటికే షెడ్యూల్ చేయబడిన సిస్టమ్ అప్‌ గ్రేడ్ కారణంగా మార్చి 14, 15 తేదీల్లో రైల్వే రిజర్వేషన్ సేవలు  అందుబాటులో ఉండవని భారతీయ రైల్వే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మార్చి 19న జరుపుకునే ఉగాదికి ముందు ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న ప్రయాణికుల మీద ఈ ఎఫెక్ట్ పడనుంది. టికెట్ బుకింగ్‌లు, రద్దులు, వెయిటింగ్ లిస్ట్‌ లు,  PNR స్టేటస్ ఎక్వంయిరీలను మెయింటెయిన్ చేసే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్(PRS) పని చేయదు. మెయింటెనెన్స్ సమయంలో ఢిల్లీ PRS సిస్టమ్‌ కు లింక్ చేయబడిన సేవలు అన్నీ టెంపరరీగా నిలిపివేయబడుతాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ సమయంలో ప్రయాణీకులు రైలు టిక్కెట్లను బుక్ చేసుకోలేరు. రిజర్వేషన్‌లను రద్దు చేయలేరు. అదే సమయంలో PNR స్టేటస్‌ ను చెక్ చేసుకోలేరు. ఈ సస్పెన్షన్ ఆన్‌ లైన్ తో పాటు ఆఫ్‌ లైన్ టికెటింగ్ సేవలకూ వర్తిస్తుందన్నారు.

ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకే..

Advertisement

ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు ఉద్దేశించిన సిస్టమ్ అప్‌ గ్రేడ్‌ లో భాగంగా టెంపరరీ షట్‌డౌన్ ఉందని రైల్వే అధికారులు తెలిపారు. అసౌకర్యాన్ని తగ్గించడానికి, అప్‌ గ్రేడ్ చేసే టైమ్ ను రాత్రి పూట నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆ సమయంలో రైలు టిక్కెట్ల బుకింగ చాలా తక్కువగా ఉంటుందన్నారు. మార్చి 14, మార్చి 15 తేదీలలో రాత్రి సమయంలో దాదాపు మూడు గంటల పాటు సేవలు అందుబాటులో ఉండవని తెలిపారు. ఈ టైమ్ లో రైల్వే రిజర్వేషన్ వ్యవస్థ పూర్తిగా అందుబాటులో ఉండదన్నారు.

అటు ప్రయాణీకులు 139 రైల్వే ఎంక్వైరీ నంబర్ ద్వారా ఈ డిమాండ్ రిజిస్ట్రేషన్‌ ను కూడా యాక్సెస్ చేయలేరని అధికారులు తెలిపారు. ప్లాట్‌ ఫామ్ టిక్కెట్లను కొనుగోలు చేయలేరు. PNR స్టేటస్ గురించి వివరాలు తెలుసుకోలేరు. అసౌకర్యాన్ని నివారించడానికి షెడ్యూల్ చేసిన షట్‌ డౌన్ కు ముందే ఏవైనా అత్యవసర టికెట్ బుకింగ్స్, ఎంక్వయిరీలు ఉంటే పూర్తి చేసుకోవాలని ప్రయాణీకులకు రైల్వే అధికారులు సూచించారు.

రైల్వే సర్వీసులను నిర్వహించంలో PRS కీలకపాత్ర

Advertisement

దేశ వ్యాప్తంగా టికెట్ రిజర్వేషన్లు, వెయిటింగ్ లిస్ట్‌ లు, సీట్ల లభ్యత, బుకింగ్ స్టేటస్, ఇతర ప్రయాణీకులకు సంబంధించిన సేవలను నిర్వహించడంలో ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తుంది. PRS అప్‌ గ్రేడ్ ద్వారా ప్రతిరోజూ రైలు ప్రయాణం చేసే లక్షలాది మంది ప్రయాణీకులకు మరింత సురక్షితమైన, సమర్థవంతమైన సేవలను అందించనుంది.

Read Also: హైదరాబాదీయులకు గుడ్ న్యూస్… ఆ స్పెషల్ రైళ్లు రెగ్యులర్ సర్వీసులు అందిస్తాయ్!

Related News

ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!

విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌరసత్వం వస్తుంది? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

చలికాలానికి ముందే మంచు అందాలను చూడాలనుందా? దేశంలో 7 అదిరిపోయే ప్లేసెస్ ఇవే!

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!

ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!

అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×