E-Paper
Advertisement

eSIM vs Physical SIM: రెండింటికి తేడా ఏంటి? నెట్ స్పీడ్, కాల్స్ నాణ్యతకు.. ఏది బెస్ట్ ఛాయిస్!

eSIM vs Physical SIM: రెండింటికి తేడా ఏంటి? నెట్ స్పీడ్, కాల్స్ నాణ్యతకు.. ఏది బెస్ట్ ఛాయిస్!
Advertisement

eSIM vs Physical SIM: గత కొన్నేళ్ల వ్యవధిలో స్మార్ట్ ఫోన్లలో విఫ్లవాత్మక మార్పులు వచ్చాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా.. అధునాతన ఫీచర్లతో కొత్త మోడల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే అనేక కొత్త మెుబైల్స్.. ప్రస్తుతం ఇ-సిమ్ (e-SIM) సపోర్టుతో లాంచ్ అవుతున్నాయి. ఫిజికల్ సిమ్ ను మెుబైల్ లో వేయాల్సిన పనిలేకుండానే వీటి సాయం టెలి సేవలు పొందవచ్చు. ప్రస్తుతం ఇ-సిమ్ కల్చర్ పెరుగుతున్న నేపథ్యంలో ఫిజికల్ సిమ్ కు దానికి మధ్య తేడాలు ఏంటి? సేవల పరంగా రెండింటిలో ఏది బెస్ట్? ఈ కథనంలో చూద్దాం.

ఇ-సిమ్ అంటే ఏంటి?

మనం సాధారణంగా వినియోగించే సిమ్ కార్డులు.. ప్లాస్టిక్ తో చేయబడి ఫోన్లలో అమర్చేందుకు వీలుగా ఉంటాయి. దానిని ఫోన్ లోని సిమ్ ట్రేలో ఫిక్స్ చేయడం ద్వారా టెలికాం సేవలను పొందవచ్చు. కానీ ఇ-సిమ్ ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇది ఫోన్ లోనే ఇన్ బిల్ట్ అయ్యి వస్తుంది. ఫోన్ మదర్ బోర్డుకు ఒక చిన్న చిప్ లాగా ఇది అంటిపెట్టుకొని ఉంటుంది. టెలికాం ప్రొవైడర్లు ఇచ్చే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా.. దీనిని యాక్టివేట్ చేసుకోవచ్చు.

కాల్ నాణ్యత, డేటా స్పీడ్..

Advertisement

ఫిజికల్ సిమ్, ఇ- సిమ్ ఏదైనా ఒకే విధమైన నెట్ వర్క్ టవర్లను వినియోగిస్తాయి. కాబట్టి ఫిజికల్ సిమ్ ఏ స్థాయిలో డేటా స్పీడ్, కాల్స్ నాణ్యతను అందిస్తాయో ఇ-సిమ్ కూడా అదే తరహాలే పనిచేస్తుంది. డేటా స్పీడ్, సిగ్నల్ నాణ్యత పరంగా రెండింటి మధ్య ఎలాంటి తేడా ఉండదు.

4G, 5G టెక్నాలజీ

రెండు సిమ్స్ కూడా కంపెనీలు అందించే 4G, 5G టెక్నాలజీకి అనుగుణంగా నెట్ వేగాన్ని అందిస్తాయి. అయితే ఫోన్, ప్రీమియం మోడల్, మీ నెట్ వర్క్ ప్రొవైడర్ ఇచ్చే సిగ్నల్స్ ఆధారంగా సిమ్ పనితీరు ఉంటుంది.

రోజువారి వియోగం..

Advertisement

ఫిజికల్ సిమ్‌ను ఒక ఫోన్ నుండి మరొక ఫోన్‌కు మార్చడం చాలా సులభం. పాత ఫోన్ నుండి తీసి కొత్త ఫోన్‌లో వేస్తే సరిపోతుంది. కానీ ఇ-సిమ్ విషయంలో సిమ్ మార్పు అనేది చాలా శ్రమతో కూడుకున్న పని. మీరు ఫోన్ మార్చాలనుకున్నప్పుడు పాత ఫోన్‌లోని ప్రొఫైల్‌ను తొలగించి కొత్త ఫోన్‌లో నెట్‌వర్క్ ప్రొవైడర్ సహాయంతో మళ్లీ రిజిస్టర్ చేసుకోవాలి. అయితే ఇ-సిమ్ వల్ల.. సిమ్ కార్డు పోగొట్టుకునే లేదా విరిగిపోయే ప్రమాదం ఉండదు.

భద్రతా పరంగా..

ఫిజికల్ సిమ్ తో పోలిస్తే భద్రతాపరంగా ఇ-సిమ్ బెస్ట్ అని చెప్పవచ్చు. సాధారణంగా ఫోన్ ను దొంగతనం చేసిన వెంటనే.. తమను కనిపెట్టకుండా సిమ్ కార్డ్ ను దొంగలు తీసేస్తుంటారు. కానీ ఇ-సిమ్ ఫోన్ లోపలే ఉండటం వల్ల దానిని తొలగించడం సాధ్యం కాదు. ఫోన్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉన్నంత వరకు దానిని సులభంగా ట్రాక్ చేసే వీలుంటుంది.

Also Read: Tiny Desktop PC: టీవీని కంప్యూటర్‌లా మార్చే.. బుల్లి సీపీయూ.. దీంతో మీ డబ్బంతా ఆదా!

ఇ-సిమ్ వల్ల మరికొన్ని లాభాలు..!

ఇ-సిమ్ ను స్టోర్ కు వెళ్లాల్సిన పని లేకుండానే ఆన్ లైన్ లో యాక్టివేట్ చేసుకునేందుకు వీలుంది. అంతేకాదు ఒకే ఫోన్ లో ఒకటి కంటే ఎక్కువ ఇ-సిమ్ లను సేవ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆఫీసు, వ్యక్తిగత అవసరాలకు దీనిని ఉపయోగించుకోవచ్చు. తరుచూ విదేశాలకు వెళ్లే వారికి. ఇ-సిమ్ ఫీచర్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే తరుచూ ఫోన్లు మారుస్తూ ఉండేవారికి మాత్రం.. ఇ-సిమ్ వల్ల కాస్త ఇబ్బంది తలెత్తవచ్చు.

Also Read: AC Buying Guide: ఇన్వర్టర్ vs డ్యూయల్ ఇన్వర్టర్.. రెండింటికి తేడా ఏంటి? కూలింగ్‌కు ఏది బెస్ట్?

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×