E-Paper
Advertisement

జవాబుదారీతనం ఎక్కడ? నిర్మాత మండలిని ప్రశ్నిస్తూ పదవికి నట్టి కుమార్ గుడ్ బై!

జవాబుదారీతనం ఎక్కడ? నిర్మాత మండలిని ప్రశ్నిస్తూ పదవికి నట్టి కుమార్ గుడ్ బై!
Advertisement

Natti Resignation : తెలుగు సినీ ఇండస్ట్రీలో మరోసారి కుమ్ములాటలు బయటపడుతున్నాయి తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ (TFPC) సంయుక్త కార్యదర్శిగా ఉన్న సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ తన పదవికి తక్షణమే రాజీనామా చేస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయిపొయింది. ముఖ్యంగా చిన్నసినిమాలు పరిస్థితి మరింత దిగజారిపోతున్న ఈ సమయంలో నట్టి కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

చిన్న సినిమాల పరిస్థితి మరీ దారుణం

Advertisement

గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో పర్సెంటేజ్ విధానం, థియేటర్ల వ్యవస్థపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే నట్టి కుమార్ తన రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలు అత్యంత కీలకంగా మారాయి. పర్సెంటేజ్ విధానాన్ని సరిగ్గా నిర్వహించడంలో కౌన్సిల్ ఘోరంగా విఫలమైందని, దీనివల్ల ఎగ్జిబిటర్లు ఆధిపత్యం చెలాయిస్తుంటే, సొంతంగా సినిమాలు నిర్మించే నిర్మాతలు మాత్రం రోడ్డున పడుతున్నారని  మనసులోని మాటని బయటపెట్టారు.గతంలో రిలీజ్ అయిన చిన్న సినిమాలకి సరైన థియేటర్లు దొరకక, దొరికినా పర్సెంటేజ్ షేర్ లో అన్యాయం జరిగి భారీ నష్టాలను ఫేస్ చేశాయని ఆయన గుర్తు చేశారు. 2025-26 సీజన్ లో విడుదలైన పలు భారీ బడ్జెట్ చిత్రాల సమయంలో చిన్న సినిమాల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని, మండలి కేవలం పెద్ద నిర్మాతల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని ఆయన ఫైర్ అయ్యారు.

also read :చిరంజీవి హీరోయిన్ మిస్టరీ డెత్.. స్టార్ హీరోలతో సినిమాలు.. 26 ఏళ్ల పెద్దవాడితో ప్రేమ.. చివరకు ఇలా

Advertisement

జవాబుదారీతనం లేని చోట ఉండటం వేస్ట్

ఇక మండలిలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, కనీస సమాచారం కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే సీక్రెట్ మీటింగ్స్ పెట్టేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. గిల్డ్ లో జరిగే ఏ కార్యక్రమమైన వన్ సైడ్ గానే జరుగుతుందని,అసలు సామాన్య సభ్యులంతా కౌన్సిల్ ఏం చేస్తోందో తెలియని డైలమాలో ఉన్నారని తెలిపారు. ఖాతాల నిర్వహణ, ఆడిటింగ్ మరియు ఆర్థిక వ్యవహారాల్లో ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా పోయిందని, జవాబుదారీతనం లేని చోట తాను పదవిలో ఉండటం వేస్ట్ అంటూ కుండబద్దలు కొట్టేశాడు.”నిర్మాతల సంక్షేమం కోసం ఉండాల్సిన సంస్థ, కొందరి స్వప్రయోజనాల కోసం అడ్డాగా మారడం దురదృష్టకరం” అంటూ కామెంట్స్ చేశారు.

నట్టి రాజీనామకి కారణం

అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్నికలని నిర్వహించే విషయంలో నట్టి కుమార్ తెగ ఫైర్ అయ్యారు. ఎన్నికలు జరపాల్సిన సమయంలో జరపకుండా ప్రజాస్వామ్య పద్ధతులకు పాటించకుండా కొంతమంది వ్యక్తులు మండలిని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్ లో అయినా కౌన్సిల్ బాధ్యతాయుతమైన అకౌంటెంట్లను, ఆడిటర్లను నియమించుకుని, ప్రతి పైసాకు లెక్క చెప్పేలా పారదర్శకత పాటించాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్న మరియు మీడియం నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలవాల్సిన మండలి,వారు నష్టపోతున్నా మౌనంగా చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయకపోవడమే నట్టి రాజీనామకి కారణం అని సమాచారం.

మొత్తానికి ఈ రోజు (మే 13న) నట్టి వదిలిన ఈ లెటర్  ఇపుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.మరి నట్టి కుమార్ ఇచ్చిన ఈ షాక్ తో మండలిలోని ఇతర సభ్యులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో,రానున్న రోజుల్లో టాలీవుడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాల్సిందే.

also read :రాయచోటి నుంచి టాలీవుడ్ హీరోగా…హీరో సువిక్షిత్ ఇంటర్వ్యూ

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×