E-Paper
Advertisement

EV Salt Water: ఉప్పు నీటితో నడిచే ఈవీ కార్లు.. ఖరీదైన లిథియన్ బ్యాటరీలకు చెక్..

EV Salt Water: ఉప్పు నీటితో నడిచే ఈవీ కార్లు.. ఖరీదైన లిథియన్ బ్యాటరీలకు చెక్..
Advertisement

EV Salt Water Battery | పెట్రోల్-డీజిల్ తో నడిచే కార్లు, భారీ వాహనాలకు ప్రత్యామ్నంగా బ్యాటరీ వాహనాలు వచ్చాయి. కాలుష్య రహిత, పర్యావరణానికి మేలు ఈ కార్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఈవీ కార్లు ప్రధానంగా లిథియం బ్యాటరీ ఆధారంగా పనిచేస్తాయి. అందుకే ఇప్పుడు ప్రతిదేశంలో లిథియం బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అయితే ఈ లిథియం బ్యాటరీలు చాలా ఖరీదైనవి. దీంతో సామాన్యులకు వీటిని కొనుగోలు చేయడం కష్టం. అయితే ఈ టెక్నాలజీని మించిన టెక్నాలజీ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది. అదే సాల్ట్ వాటర్ బ్యాటరీ (ఉప్పు నీటి బ్యాటరీ). ఇది చవకగా, సేఫ్‌గా, ఎక్కడైనా తయారు చేయగలిగే బ్యాటరీ. ఈ బ్యాటరీలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. లిథియం బ్యాటరీకి కాలం చెల్లినట్లే అనే వాదన ఇప్పుడు ఊపందుకుంది.

ఉప్పు నీటి బ్యాటరీలు ఎలా పని చేస్తాయి?

ఇది చాలా సింపుల్. ఉప్పు కలిపిన నీటిలో సోడియం అయాన్స్ ఒక ఎలక్ట్రోడ్ నుంచి మరొకటి వెళ్తూ-వస్తూ కరెంట్ ఉత్పత్తి చేస్తాయి. ఛార్జింగ్-డిశ్చార్జింగ్ రెండింటిలోనూ ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఇవి చాలా స్టేబుల్, సురక్షితమైనవి.

లిథియం బ్యాటరీలకు ఉప్పు నీటి బ్యాటరీలకు తేడా ఏంటి?

Advertisement

ఉప్పు నీటి బ్యాటరీలకు మంటలు పట్టవు. ఎంత ఓవర్ ఛార్జ్ చేసినా పేలుడు సంభవించదు. అగ్ని ప్రమాదాలు జరగవు.
లిథియం, కోబాల్ట్ లాంటి ఖరీదైన రేర్ మెటల్స్ అవసరం లేదు. ఉప్పు, సోడియం ఎక్కడైనా దొరుకుతాయి.
ధర చాలా తక్కువ. భారత్ లాంటి దేశాలకు ఈ టెక్నాలజీ పర్ఫెక్ట్
రీసైక్లింగ్ చాలా సులువు కావడంతో పర్యావరణానికి హాని అవకాశాలు తక్కువ.

ఇప్పటికే వినియోగంలో ఉప్పు నీటి బ్యాటరీలు

ప్రస్తుతం ఈ బ్యాటరీలు ఇంటి ఇన్వర్టర్లలో, సోలార్ ప్యానల్స్ ఎనర్జీ స్టోరేజ్‌లో, మైక్రో-గ్రిడ్స్‌లో, బ్యాకప్ సిస్టమ్స్‌లో బాగా పని చేస్తున్నాయి. చల్లని గదుల్లో వస్తువులు నిల్వ ఉంచే వేర్‌హౌస్‌లలో కూడా ఉపయోగిస్తున్నారు. దీని ప్రధాన కారణం వీటితో ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ. ఇవి ఎప్పుడూ స్టేబుల్‌గా ఉంటాయి.

ఎలక్ట్రిక్ కార్లలో పూర్తి స్థాయి ఉపయోగానికి దూరం

Advertisement

ఈవీ కార్లలో ఉప్పు నీటి బ్యాటరీలు పూర్తి స్థాయిలో వినియోగానికి రాలేదు. ఎందుకంటే దీనికి ఒక ప్రధాన సమస్య ఉంది. అదే ఎనర్జీ డెన్సిటీ (ఒక కిలో బ్యాటరీలో ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుంది). ఉప్పు నీటి బ్యాటరీలలో ఎనర్జీ డెన్సిటీ చాలా తక్కువ. లిథియం బ్యాటరీలతో పోలిస్తే సాల్ట్ వాటర్ బ్యాటరీలు చాలా పెద్దవి, బరువు కూడా ఎక్కువ. అందుకే ఒక్క ఛార్జ్‌కు కారు ఎక్కువ దూరం వెళ్లలేదు. కాబట్టి ఇప్పట్లో కార్లలో రిప్లేస్ చేయడం కష్టం.

ప్రపంచంలో ఏం జరుగుతోంది?

ఆస్ట్రేలియా, యూరప్‌లో సాలిడ్-స్టేట్ సోడియం బ్యాటరీలపై రీసెర్చ్ జోరుగా సాగుతోంది. చైనాలో సోడియం-అయాన్ బ్యాటరీలతో స్కూటర్లు టెస్ట్ చేస్తున్నారు. గ్రిడ్ స్టోరేజ్ కోసం చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. కానీ కార్లలో వినియోగ స్థాయికి రావడానికి ఇంకా సమయం పడుతుంది.

Also Read: స్వయంగా పనులన్నీ చేసే ఫోన్ లాంచ్.. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏజెంటిక్ AI  స్మార్ట్‌ఫోన్.. టచ్ చేయాల్సిన అవసరం లేదు

భారత్‌కు ఈ టెక్నాలజీ చాలా ముఖ్యం

భారత్‌లో లిథియం, కోబాల్ట్ దిగుమతి చేసుకోవాలి. ఇవి చాలా ఖరీదు. కానీ సోడియం, ఉప్పు మన దేశంలోనే దొరుకుతాయి. గ్రామీణ ప్రాంతాలు, ఆఫ్-గ్రిడ్ ఏరియాలకు ఇది గొప్ప ఆప్షన్. ఎనర్జీ డెన్సిటీ పెరిగితే ఒక్కసారి భారత్‌లోనే బ్యాటరీలు తయారు చేసుకుని ధరలు భారీగా తగ్గొచ్చు.

సాల్ట్ వాటర్ బ్యాటరీలు త్వరలోనే వాహన వినియోగానికి సరిపోయే ప్రయోగాలు సక్సెస్ అయ్యే ఛాన్సులు మెండుగా ఉన్నాయి. అయితే ఈ బ్యాటరీలు వచ్చినా లిథియం బ్యాటరీలు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎనర్జీ డెన్సిటీ విషయంలో లిథియం బ్యాటరీలకు సమానంగా లేక అంతకు మించి పనితీరు కనబరిచే వరకు ఇలాగే జరుగుతుంది.

 

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×