E-Paper
Advertisement

బయట 45°C ఎండ.. ఇంట్లో ఫ్యాన్, ఏసీ, కూలర్.. ఏది వాడితే నెలకు ఖర్చు ఎంత?

బయట 45°C ఎండ.. ఇంట్లో ఫ్యాన్, ఏసీ, కూలర్.. ఏది వాడితే నెలకు ఖర్చు ఎంత?
Advertisement

Fan vs Air Cooler vs AC: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అడుగు తీసి బయటకు పెట్టలేని పరిస్థితి చాలాచోట్ల కనిపిస్తోంది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లపై ఆధారపడుతున్నారు. ఎండ తీవ్రత తగ్గిన తర్వాత బయటకు వస్తున్నారు. అయితే భగభగలాడే 45 డిగ్రీల ఎండలో ఇంటిని చల్లబరుచుకోవడానికి ఏది వాడితే ఎంత ఖర్చు వస్తుంది? అన్న సందేహాం చాలామందిలో ఉంది. కాబట్టి ప్రస్తుతం యూనిట్ కరెంటూ రూ.7-8 అనుకుంటే.. నెలవారీ ఖర్చు ఎంత అవుతుందో ఈ కథనంలో అంచనా వేసే ప్రయత్నం చేద్దాం.

సీలింగ్ ఫ్యాన్ (Ceiling Fan)

సీలింగ్ ఫ్యాన్ అనేది కేవలం గాలిని మాత్రమే అందిస్తుంది. గతి ఉష్ణోగ్రతను పెంచడం గానీ, తగ్గించడం గానీ చేయదు. బయట 45°C వేడి ఉన్నట్లైతే ఫ్యాన్ ఏమాత్రం ప్రభావవంతంగా ఉండదు. ఇక విద్యుత్ వినియోగానికి వస్తే సీలింగ్ ఫ్యాన్ ఒక గంటకు 0.075 యూనిట్లు (75 Watts) ఖర్చు చేస్తుంది. యూనిట్ కరెంటు రూ.7-8 అనుకుంటే గంటకు 50 పైసలు అవుతుంది. రోజుకు 8 గంటల చొప్పున రోజులు వాడినట్లు భావిస్తే.. సుమారు రూ.125 ఖర్చు అవుతుంది.

ఎయిర్ కూలర్ (Air Cooler)

Advertisement

ఫ్యాన్ తో పోలిస్తే కూలర్.. చల్లదనం విషయంలో బెటర్ గా ఉంటుంది. 45°C వంటి పొడి వాతావరణంలో ఎయిర్ కూలర్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది గాలి వేడిని 5-10°C వరకు తగ్గిస్తుంది. విద్యుత్ వినియోగానికి వస్తే.. కూలర్లు గంటకు 0.15 – 0.25 యూనిట్లు (150-250 Watts) ఖర్చు చేస్తాయి. అంటే గంటకు రూ.1 నుండి రూ.1.50 ఖర్చు అవుతుంది. నెలవారీగా చూస్తే కూలర్ కు సుమారు రూ.250-350 వరకూ విద్యుత్ బిల్లు రావొచ్చు.

Also Read: Redmi Phones: షావోమీ బడ్జెట్ ఫోన్లు.. నిజంగా బాగున్నాయ్ మాష్టారు.. హై రేంజ్ ఫీచర్లు చాలా తక్కువ ధరలో!

ఎయిర్ కండీషనర్ (AC)

Advertisement

ఫ్యాన్, కూలర్ తో పోలిస్తే.. ఏసీ చాలా ఖర్చుతో కూడుకున్నది. అయితే బయట 45°C ఉన్నప్పుడు.. గదిని 24-26°C వద్ద స్థిరంగా ఉంచగలిగే ఏకైక సాధనం ఏసీ అని చెప్పవ్చచు. ఇక విద్యుత్ వినియోగం విషయానికి వస్తే.. 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీ గంటకు సుమారు 1.0 – 1.2 యూనిట్లు తీసుకుంటుంది. అంటే గంటకు సుమారు రూ.7 నుండి రూ.9 భారం పడుతుంది. నెల పూర్తయ్యే సరికి ఒక్క విద్యుత్ బిల్లే రూ.1,700-2,200 వరకూ రావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: Congress vs BRS: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ.. మళ్లీ ENOకి పనిబడిందా? బీఆర్ఎస్‌పై సెటైర్లు!

Related News

ఫోన్ బ్యాటరీని సైలెంట్‌గా ఖాళీ చేస్తున్న 5G.. ఈ ఒక్క సెట్టింగ్ మారిస్తే.. మైండ్ బ్లోయింగ్ రిజల్ట్!

ఇంతవరకు ఏ ఇయర్‌బడ్స్‌లోనూ లేని ఫీచర్లు..లుక్ చూస్తే మైండ్ బ్లాకే!

తడిసిన ఇయర్‌బడ్స్‌ను ఎలా కాపాడుకోవాలి? ఈ తప్పులు అస్సలు చేయకండి!

మీ స్మార్ట్‌ఫోన్ కొత్తదా లేక వాడిందా? ఈ చిన్న ట్రిక్స్‌తో..2 నిమిషాల్లో కనిపెట్టండి!

ఫిలిప్స్, షావోమీ, నోవా.. రూ. 1,500 లోపు ఏ ట్రిమ్మర్ కొంటే బెటర్?

ఇండిపెండెన్స్ డే ధమాకా సేల్స్..ఐఫోన్లు,వన్‌ప్లస్ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు!

వైఫై రూటర్ మీద యాంటెనాలు దేనికోసమో తెలుసా? ఇప్పటివరకు మీకు ఎవ్వరూ చెప్పని షాకింగ్ ఫ్యాక్ట్స్!

మార్కెట్లోకి All-in-One మిక్సీ.. 1 మిషన్, 10 రకాల పనులు.. హెవీ డ్యూటీకి కేరాఫ్!

Big Stories

Advertisement
×