E-Paper
Advertisement

వారెవ్వా.. ఏం ఐడియా ఓకేయాప్‌లో బస్, మెట్రో, సఫారీ టికేట్లు.. నిమిషాల్లో పని పూర్తి..!

వారెవ్వా.. ఏం ఐడియా ఓకేయాప్‌లో బస్, మెట్రో, సఫారీ టికేట్లు.. నిమిషాల్లో పని పూర్తి..!
Advertisement
Mee Ticket: స్వేచ్ఛ బ్యూరో: ‘ఈ వీకెండ్ సరదాగా.. ఫ్యామిలీతో బయటకు వెళ్లాలనుకుంటున్నారా.. మెట్రో లో ప్రయాణం… టెంపుల్ విజిట్, ఏదైనా పార్క్.. లేదంటే గోల్కొండ ఫోర్ట్, మ్యూజియం సందర్శన చేయాలనుకుంటున్నారా.. పిల్లలకు సెలవులొచ్చాయి కానీ.. ఎండాకాలం అని భయపడుతున్నారా.. తీరా అక్కడికి వెళ్లాక టికెట్ కౌంటర్, క్యూ లైన్ అని వెనక్కుతగ్గుతున్నారా.? ఇప్పుడు అవసరం లేదు.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. జస్ట్ ఒక్క క్లిక్ తో వీకెండ్ ప్లాన్ అంతా సాఫీగా జరిగిపోతోంది. మీ స్మార్ట్ ఫోన్ ద్వారా సింపుల్ గా ప్లే స్టోర్ నుంచి మీ టికెట్ యాప్(MEE TICKET APP) డౌన్లోడ్ చేసుకుని, మన ప్రయాణ టికెట్లతో సహా, విజిటింగ్ ప్లేస్ టికెట్లు కూడా ఇంటి దగ్గరి నుంచే బుక్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ శాఖ పరిధిలో ఉన్న మీ సేవ ద్వారా తెచ్చిన ఈ మీటికెట్ యాప్ ఇప్పుడు ఎన్నో సర్వీసులను ఫోన్ ద్వారా పొందే సౌకర్యాన్ని కల్పిస్తోంది.

ఒకే యాప్ ద్వారా..

బస్, మెట్రో ప్రయాణ టికెట్లు మొదలు, టెంపుల్స్, పార్కులు, మ్యూజియం, ఫారెస్ట్ సఫారీ సందర్శన ఇలా చాలా రకాల సౌకర్యాలు, వాటి టికెట్లను అక్కడి క్యూ లైన్ తో సంబంధంలేకుండా నేరుగా మనమే బుక్ చేసుకోవచ్చు. ఒక వేళ మీరు మీ ఎలక్ట్రిక్ కారులో (ఈవీ కార్) ప్రయాణిస్తే సమీపంలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్ లోకేషన్ ను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకునే వెసలుబాటు కూడా ఉంది. ఇలా ఇండోర్, అవుట్ డోర్ యాక్టివిటీస్ తో పాటు వివిధ సేవలను ఒకే యాప్ ద్వారా అందించటమే మీ టికెట్ యాప్ లక్ష్యం. అందుబాటులోకి తీసుకొచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ యాప్ మంచి ప్రజాదరణ పొందుతోంది. ఇప్పటికే సుమారు రెండున్నర లక్షల మంది ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆరు లక్షలకు పైగా సేవలను పౌరులు బుక్ చేసుకున్నారు. నాలుగు కోట్ల రూపాయలకుపైగా విలువైన లావాదేవీలు సురక్షితంగా జరిగాయి. వివిధ ప్రభుత్వ శాఖలు నిర్వహించే 219 లోకేషన్లలో ఈ మీ టికెట్ యాప్ ద్వారా అక్కడి సేవలకు సంబంధించిన ప్రవేశటికెట్లను నేరుగా యాప్ లోనే ప్రజలు పొందుతున్నారు.

నిత్య జీవితంలో..

టికెట్ ఏదైనా.. యాప్ ఒక్కటే నినాదంతో ఈ మీటికెట్ యాప్ ప్రజాదరణ పొందుతోంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని సేవలను ఈయాప్ పరిధిలోకి తీసుకువస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఐటీ సేవలను పౌరసమాజం నిత్య జీవితంలో మరింతగా వాడుకునేలా విస్తరిస్తామని వెల్లడించారు. సందర్శించే ప్రాంతం ఏదైనా, అక్కడిదాకా వెళ్లి క్యూలైన్ లో నిరీక్షించే బదులు మీటికెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని సులభంగా, సౌకర్యవంతంగా అక్కడి ఎంట్రీ టికెట్లను, సౌకర్యాలను బుక్ చేసుకోవచ్చని మీ సేవ కమిషనర్ టీ.రవి కిరణ్ వెల్లడించారు. ప్రజలకు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే యాప్ లను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.

Related News

మీనాక్షినటరాజన్ కేసులో బిగ్ ట్విస్ట్.. బీజేపీ ఎంపీలు, ఎన్నికల అధికారికి హైకోర్టు నోటీసులు జారీ..!

దౌల్తాబాద్‌లో షాకింగ్ ఘటన.. గడ్డి మందు పిచికారీతో 8 ఎకరాల వరి పంట ధ్వంసం!

ఇకపై పోలీస్, అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ అన్నింటికీ ఒకే నంబర్.. ఏంటో తెలుసా..!

తుమ్మిడిహెట్టికి ‘ఎత్తు’ పెంచుతాం.. మహారాష్ట్రను ఒప్పించండి.. జల్‌శక్తి మంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్!

అప్పుడు ఏపీకి మద్దతిచ్చి.. ఇప్పుడు మొసలి కన్నీరా.. కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్!

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మరికాసేపట్లో కుండపోత వర్షం!

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మరో రెండు భారీ ఫ్లైఓర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ సీపీగెట్ ఫలితాలు విడుదల

Big Stories

Advertisement
×