Huge Discount on Mobiles in Flipkart Big Saving Days: ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. ఇది మే 9 వరకు జరుగుతుంది. ఈ సేల్ సందర్భంగా పలు బ్రాండెడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఇవ్వనుంది. సేల్ సమయంలో iPhone, Pixel, Poco వంటి ఫోన్ బ్రాండ్‌లపై ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా అనేక ఫేమస్ 5G స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ జాబితాలో iPhone 15, Samsung Galaxy S23, Nothing Phone (2), Poco M6 Pro వంటి స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. మీరు SBI బ్యాంక్ కార్డ్‌పై 10 శాతం అదనపు తగ్గింపును పొందవచ్చు. వీటి గురించి పూర్తి సమాచారం ఈ కథనంలో చూడండి.
iPhone 15
iPhone 15 తగ్గిన ధర రూ. 63,999తో టీజ్ చేయబడింది. ఈ ఫోన్ అసలు ధర రూ. 79,900గా ఉంది.
అంటే మీరు ఇప్పటికే ఫోన్‌పై రూ.15,901 తగ్గింపును పొందుతున్నారు. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 3,200 అదనపు తగ్గింపును పొందవచ్చు. ఇది కాకుండా మీరు రూ. 50000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
nothing phone (2)
ఫ్లిప్‌కార్ట్ నథింగ్ ఫోన్ (2) 128GB స్టోరేజ్ మోడల్‌ను రూ. 36,999 ధరతో టీజ్ చేసింది. అయితే ఈ ఫోన్ రూ. 44,999 ధరతో విడుదల చేశారు. మీరు SBI క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా 2500 రూపాయల అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. ఇది కాకుండా, ఇ-కామర్స్ సైట్ దీనికి రూ. 36,999 ఎక్స్ఛేంజ్ ఆప్షన్‌ను కూడా ఇస్తోంది.
Also Read: 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో వివో నుంచి కొత్త ఫోన్.. పిచ్చెక్కిస్తున్న ఫీచర్లు!
Samsung Galaxy S23
ఇది Samsung ప్రీమియం ఫోన్. మీరు Flipkartలో కేవలం రూ.46,999కి కొనుగోలు చేయవచ్చు.
మీరు SBI క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఈ ఫోన్‌పై 10 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు.
కంపెనీ ఈ ఫోన్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తుంది. ఫోన్ పెర్ఫామెన్స్, పిన్‌కోడ్‌పై ఇది ఆధారపడి ఉంటుంది.
Pixel 8
ఇది Google తాజా ఫ్లాగ్‌షిప్ ఫోన్. ఇది రూ.75,999 ధరతో విడుదల చేశారు. మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 62,999 ఫ్లాట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అంటే పిక్సెల్ 8 రూ. 13,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: ఐక్యూ నుంచి న్యూ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్!
Poco M6 Pro
మీరు బడ్జెట్‌లో 5G ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Poco M6 ప్రో మీకు మంచి స్మార్ట్‌ఫోన్‌గా ఉంది.
ఈ పోకో ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ రూ. 2,500 ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది. కాబట్టి ఈ ఫోన్‌ను రూ.9,499కి కొనుగోలు చేయవచ్చు.