Vivo Y38 5G Mobile With 6000mah Battery 50MP Camera Launch: ప్రస్తుత కాలంలో నిద్రలేచినప్పటి నుంచి పడుకునే వరకు యవతకు స్మార్ట్‌ఫోన్ చేతిలోనే ఉండాలి. లేదంటే ఆ రోజంగా ఏదో కోల్పోయినట్లుగా ఫీల్ అవుతారు కొందరు. టెక్ మార్కెట్‌లో కూడా మొబైల్ ప్రియులను అట్రాక్ట్ చేసేందుకు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు రకరకాల ఫీచర్లు, లెటెస్ట్ టెక్నాలజీతో ఫోన్లను తీసుకొస్తున్నాయి. కుప్పలు కప్పలుగా కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌ను చుట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ మొబైల్ దిగ్గజం వివో తైవాన్‌లోని తన కస్టమర్ల కోసం కొత్త ఫోన్‌ను విడుదల చేసింది.
Vivo తన బ్రాండ్ నుంచి Vivo Y38 5G స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాను చూడొచ్చు.ఈ డివైజ్ Vivo Y200i 5G వేరియంట్‌లా ఉంటుందని సమాచారం. ఇది ఒకే కాన్ఫిగరేషన్‌లో ఉంటుంది. రెండు కలర్ ఆప్షన్స్‌లో ఫోన్‌ను తీసుకురావచ్చు. అయితే ఇప్పటి వరకు దీని ధర కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. భారత్‌లో ఈ ఫోన్ త్వరలో లాంచ్ అయే అవకాశం ఉంది. Vivo Y200i 5Gని కంపెనీ ఇప్పటికే చైనాలో విడుదల చేసింది. దీని ఫీచర్లు Vivo Y38 5Gకి సరిపోతాయి. దాని గురించి వివరంగా తెలుసుకోండి.
Also Read: ఈ నెలలో రిలీజ్ కానున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. లిస్ట్ చూసేయండి!
Vivo Y38 5G స్పెసిఫికేషన్‌లు విషయానికి వస్తే ఇందులో 5G 6.68-అంగుళాల IPS LCD ప్యానెల్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 1612 x 720 పిక్సెల్‌ల HD+ రిజల్యూషన్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1000 nits వరకు పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. Y38 5G స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది 8GB LPDDR4x RAMతో పాటుగా 256GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
Vivo Y38 5G స్మార్ట్‌ఫోన్‌లో డ్యాయల్ కెమెరా సెటప్ చూడొచ్చు. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP కెమెరా. రింగ్ LED ఫ్లాష్ ఉన్నాయి. ఇది కాకుండా ఈ ఫోన్‌లో 8MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఫోన్ పవర్ కోసం 6000mAh బ్యాటరీని ప్యాక్‌ను ఉపయోగించారు. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
Also Read: ఒప్పో నుంచి బడ్జెట్ ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే?
Vivo Y38 5G కేవలం 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం దీని ధర గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. ఈ పరికరం పసిఫిక్ బ్లూ, డార్క్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు.