iQOO Neo 9s Features Leaked Check the Details: టెక్ దిగ్గజం ఐక్యూ చైనా మార్కెట్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. తన బ్రాండ్ Neo 9sను విడుదల చేయనుంది. త్వరలో ఇండియన్ మార్కెట్‌లో ప్రీమియం మిడ్-రేంజ్ విభాగంలో iQOO నియో 9s స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ లాంచ్‌కు ముందే కొన్ని స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. హ్యండ్‌సెట్ 1.5k గేమింగ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది బెటర్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో గేమింగ్ కోసం ప్రత్యేక చిప్ కూడా అందించబడుతుంది. చైనా 3c సర్టిఫికేషన్ సైట్‌లో ఫోన్ ప్రాసెసర్ అందుబాటులో ఉంది.
iQOO భారత్ మార్కెట్‌లో iQOO నియో 9 ప్రోను బడ్జెట్ సెగ్మెంట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ Qualcomm పవర్‌ఫుల్ చిప్‌సెట్‌తో 120 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో తీసుకొచ్చారు. ఇప్పుడు కంపెనీ దాని తర్వాత జనరేషన్ ఫోన్ iQOO Neo 9s ప్రో తీసుకురానుంది. iQOO Neo 9s ప్రో ఫోన్ చైనా 3c సర్టిఫికేషన్ సైట్‌లో లాంచ్‌కు ముందే కొన్ని స్పెసిఫికేషన్‌లతో లిస్ట్ చేయబడింది.
Also Read: 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో వివో నుంచి కొత్త ఫోన్.. పిచ్చెక్కిస్తున్న ఫీచర్లు!
iQOO Neo 9s స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఫోన్ పెర్ఫామెన్స్ కోసం Qualcomm Snapdragon Gen 3 SoC చిప్‌సెట్ ఉంటుంది. ఇది కంపెనీ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌గా వెల్లడించింది. ఈ ఫోన్‌ను మే మధ్యలో చైనా మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ మోడల్ నంబర్ V2339FAతో రిజిస్టర్ చేయబడింది.
ఫోన్‌లో 5,160mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని అడాప్టర్ మోడల్ నంబర్ V12060L0A0-CNతో గుర్తించబడింది. అదే సమయంలో, Google Play కన్సోల్ జాబితా 12GB RAM ఉంటుంది.
Also Read: Apple, Hp, Dell ల్యాప్‌ట్యాప్‌లపై ఎన్నడూ లేని ఆఫర్లు.. రూ.45 వేల వరకు తగ్గింపు!
Google Play కన్సోల్ ప్రకారం.. ఫోన్ MediaTek ప్రాసెసర్‌పై వస్తుంది. Qualcomm కాదు. ఇది MediaTek డైమెన్షన్ 8300 SoC ప్రాసెసర్. ఇది OISతో కూడిన 50MP కెమెరాను కలిగి ఉంది. 6.78 అంగుళాల ఫ్లాట్ 8T LTPO OLED FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.