CBSE Results 2024 Date: 10వ తరగతి, 12వ తరగతి సీబీఎస్ఈ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల పది, ఇంటర్ ఫలితాలు రిలీజ్ కాగా ఇక సీబీఎస్ఈ ఫలితాల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలోనే ఫలితాలపై కీలక ప్రకటన వెలువడింది. త్వరలోనే సీబీఎస్ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు సీబీఎస్ఈ బోర్డు వర్గాలు సమాచారం.
ఇప్పటి వరకు ఫలితాలపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా ఈనెల 20వ తేదీ తర్వాత ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలను విడుదల చేసేందుకు సీబీఎస్ఈ బోర్డు కసరత్తు చేస్తున్నట్లు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.
ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు జరగ్గా.. ఫిబ్రదరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 39 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
Also Read: New Born Baby Murder : బాత్రూమ్ లో బిడ్డను కని.. రోడ్డుపైకి విసిరేసిన తల్లి
ఇందులో 22 లక్షలకు పైగా పదోతరగతి పరీక్షలకు హాజరు కాగా, 16 లక్షల మంది విద్యార్థులు 12వ తరగతి పరీక్షలకు హాజరైనట్లు బోర్డు వెల్లడించింది. కాగా, ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతీ సబ్జెక్టులో 33 శాతం మార్కులు రావాలి. సీబీఎస్ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ cbse.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు.