E-Paper
Advertisement

Apple Laptops : వామ్మో ఏం ఆఫర్ గురూ.. యాపిల్ మ్యాక్ బుక్ పై ఏకంగా రూ. 45వేల ఫ్లాట్ డిస్కౌంట్

Apple Laptops : వామ్మో ఏం ఆఫర్ గురూ.. యాపిల్ మ్యాక్ బుక్ పై ఏకంగా రూ. 45వేల ఫ్లాట్ డిస్కౌంట్
Advertisement

Apple Laptops : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌ 2024లో యాపిల్ ల్యాప్టాప్స్ పై అదిరే ఆఫర్స్ నడుస్తున్నాయి. లేటెస్ట్ మ్యాక్‌బుక్ ఎయిర్ M3తో పాటు పాత మోడళ్లపై సైతం భారీ తగ్గింపును అందిస్తుంది. ఇక ఈ ఆఫర్ లో ఏ ఏ ల్యాప్టాప్స్ ఉన్నాయి. వాటి ధరలెంతో తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌ 2024లో ఐఫోన్ 15, ఐఫోన్ 14తో పాటు యాపిల్ కంపెనీకు చెందిన టాప్ గ్యాడ్జెట్స్ పై అదిరే ఆఫర్స్ ఉన్నాయి. వీటిపై డిస్కౌంట్స్ తో పాటు ఎక్స్ ఛేంజ్ ఆఫర్స్ సైతం ఉన్నాయి. ఇక తక్కువ ధరకే యాపిల్ మ్యాక్ బుక్ కొనాలనుకునే కస్టమర్లకు ఇదే బెస్ట్ ఆఫ్షన్. ఇక ఈ సేల్ లో మ్యాక్‌బుక్ ఎయిర్ M3 బెస్ట్ ఛాయిస్.

Advertisement

MacBook Air M3 (మ్యాక్‌బుక్ ఎయిర్ M3) – మ్యాక్‌బుక్ ఎయిర్ M3 అసలు ధర రూ. 1,07,990 కాగా ఇండియన్ మార్కెట్లో దీని ధర రూ. 1,14,900గా ఉంది. అయితే ఫ్లిప్కార్ట్ లో ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ. 6,910 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.  దీనితో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 10వేల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో మ్యాక్ బుక్ Air M3ను రూ.97,990కే కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ లో ఈ ఎయిర్ M3 మోడల్ ను ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై కొనుగోలు చేస్తే రూ. 20వేల డిస్కౌంట్ పొందవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం కొనాలనుకునే కస్టమర్స్ తప్పకుండా ట్రై చేసేయండి.

స్పెషిఫికేషన్స్ – 

Advertisement

13.6 అంగుళాల 2,560×1,664 లిక్విడ్ రెటీనా LED బ్యాక్‌లిట్ డిస్‌ప్లేతో వచ్చేసిన ఈ మ్యాక్ బుక్ CPU Apple M3 చిప్ 8 కోర్ CPU, 16GB మెమోరీ, యాపిల్ 10 కోర్ GPU, 512GB SSD స్టోరేజ్, Wi-Fi, బ్లూటూత్ కనెక్టివిటీతో వచ్చేసింది. ఇక ఇందులో Apple macOS Sonoma 14.4 ఆపరేటింగ్ సిస్టమ్ సైతం ఉంది

MacBook Air M3 (మ్యాక్‌బుక్ ఎయిర్ M2) – మ్యాక్‌బుక్ ఎయిర్ M2 మోడల్‌పై సైతం ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ ల్యాప్టాప్ అసలు ధర రూ.1,19,900 కాగా ఫ్లిప్కార్ట్ ఆఫర్ లో రూ. 73,990కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంటే ఈ ల్యాప్టాప్ పై రూ. 45,910 ఫ్లాట్ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ కార్డ్‌లపై కొనుగోలు చేసే కస్టమర్స్ కు అదనంగా మరో రూ. 5వేలు తగ్గింపు లభిస్తుంది.

స్పెషిఫికేషన్స్ – 

ఈ మ్యాక్ బుక్ 13.6 అంగుళాల బ్యాక్‌లిట్ డిస్‌ప్లే, యాపిల్ M2 8-core CPU, 8GB RAM, 10 కోర్ Apple GPU, 512GB SSD స్టోరేజ్, Wi-Fi వైర్‌లెస్ నెట్‌వర్కింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ, MacOS Monterey 12.4 ఆపరేటింగ్ సిస్టమ్ ను కలిగి ఉంది.

ఇక ఇంకెందుకు ఆలస్యం.. ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ మరికొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ యాపిల్ ల్యాప్టాప్స్ ను సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్స్ ఓ సారి ట్రై చేసేయండి.

ALSO READ : ఐక్యూ మెుబైల్స్ పై అదిరే ఆఫర్స్.. రూ.25వేల మెుబైల్ కేవలం రూ.16వేలకే!

 

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×