BigTV English

TG RERA: ఫ్లాట్ కొంటున్నారా? కచ్చితంగా ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే!

TG RERA: ఫ్లాట్ కొంటున్నారా? కచ్చితంగా ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే!

Real Estate Frauds: రియల్ ఎస్టేట్ కంపెనీల మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రీ లాంఛ్ పేరుతో పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్నాయి. పలువురి నుంచి కోట్లాది రూపాయలు వసూళు చేసి నిట్టనిలువునా ముంచుతున్నాయి. మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఫ్లాట్ కొనాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసకోవాలి? మోసపోకుండా ఏ పత్రాలను ముందుగా పరిశీలించాలి? అంటే..


రేరా అనుమతులు తప్పనిసరి!

రియల్ ఎస్టేట్ కంపెనీల మాయ మాటలు నమ్మి మోసపోకుండా ఉండాలంటే కస్టమర్లు కొన్ని కీలక విషయాలను పరిశీలించాలని చెప్తున్నారు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(RERA) సెక్రెటరీ శ్రీనివాసరెడ్డి. రేరా అనుమతి లేకుండా ఎలాంటి ఫ్లాట్లు కొనుగోలు చేయకూడదన్నారు. “రేరా అనుమతులు లేకుండా ఏ రియల్ ఎస్టేస్ సంస్థ సేల్స్ చేయకూడదు. రియల్ ఎస్టేట్ సంస్థ ముందుగా HMDA, DTCP, GHMC ప్లానింగ్ డిపార్ట్ మెంట్స్ నుంచి అనుమతులు తీసుకోవాలి. వీటితో పాటు లోకల్ అథారిటీస్(గ్రామ పంచాయితీ లేదంటే మున్సిపాలిటీ) నుంచి లేఅవుట్ శాంక్షన్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలి. వాటితో పాటు సీఏ రిపోర్టు, ఇంజినీర్స్ రిపోర్టు, ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు రేరా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత రెరా స్క్రూటినీ టీమ్ పరిశీలిస్తుంది. లీగల్ గా కరెక్ట్ ఉంటే అనుమతులు ఇస్తాం. రెరా అనుమతి ఉన్న ఫ్లాట్లు కొనడం వల్ల ఎలాంటి మోసాలకు ఆస్కారం ఉండదు. ఒకవేళ ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీ కస్లమర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రేరా దగ్గర ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటుంది” అన్నారు.


ప్రీలాంఛ్ ఆఫర్లు చట్ట ప్రకారం నేరం

రెరా చట్టంలోని సెక్షన్ 3, 4 ప్రకారం ప్రతి రియల్ ఎస్టేట్ సంస్థ తమ ప్రాజెక్టులకు సంబంధించి రెరా అప్రూవర్ తీసుకోవాలని శ్రీనివాసరెడ్డి తెలిపారు. “చట్ట ప్రకారం ప్రీలాంచ్ ఆఫర్లు అనేవి నేరం. కొంత మంది సెలబ్రిటీలతో ప్రచారం చేస్తున్నారు. వాటిని గమనిస్తున్నాం. ఇప్పటికే చాలా సంస్థలకు నోటీసులు ఇచ్చాం. కొన్ని సంస్థలకు జరిమానాలు విధించాం. ఆ తర్వాత కొన్ని సంస్థలు రేరా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఈ విషయానికి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రెరా పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నాం. వాటిని ఫాలో అయితే సరిపోతుంది” అని చెప్పారు.

ఆఫర్ల పేరుతో మోసపోకండి!

రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇచ్చే ఆఫర్లను చూసి మోసపోకూడదని శ్రీనివాసరెడ్డి తెలిపారు. “కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు మార్కెట్ వ్యాల్యూ కంటే తక్కువ ధరకు ఫ్లాట్లు ఇస్తామని ప్రీ లాంఛ్ ఆఫర్లు పెడుతున్నాయి. కొంత మంది తక్కువ ధరకు వస్తున్న ఆశతో డబ్బులు ఇస్తున్నారు. మోసపోతున్నారు. కచ్చితంగా ఫ్లాట్ కొనే ముందు అన్ని అనుమతులు ఉన్నాయా? లేవా? అనేది పరిశీలించాలి. ముందుగా రియల్ ఎస్టేట్ కంపెనీలను రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా? లేదా? అని అడగాలి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తే రేరా వెబ్ సైట్ లో అన్ని వివరాలు ఉంటాయి. వాటిని పరిశీలించి ఫ్లాట్లు కొనుగోలు చేయడం ద్వారా నష్టపోయే అవకాశం ఉండదు” అన్నారు.

Read Also: నాగార్జున కొన్న కొత్త కారు లోపల ఎలా ఉంటుందో చూశారా? దీని ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్!

Related News

Rental Areas in Hyderabad: హైదరాబాద్ లో అద్దె ఇల్లు కావాలా? ఏ ఏరియాల్లో రెంట్ తక్కువ అంటే?

EPFO Atm Withdrawal: ఈపీఎఫ్ఓ నుంచి మరో బిగ్ అప్డేట్.. త్వరలో ఏటీఎం తరహాలో నగదు విత్ డ్రా!

Maruti Suzuki – GST: ఓ వైపు దసరా సేల్స్, మరోవైపు జీఎస్టీ తగ్గింపు.. అమ్మకాల్లో దుమ్మురేపిన మారుతి సుజుకి!

BSNL Offers: రీఛార్జ్ చేసుకోండి.. 2% డిస్కౌంట్ పొందండి, కస్టమర్లకు BSNL క్రేజీ ఆఫర్!

GST 2.0: కొత్త జీఎస్టీతో పన్ను తగ్గలేదా? నెంబర్ ఇదిగో, సామాన్యుడు ఫిర్యాదు చేయొచ్చు

Dasara Offers: ఫ్లిప్‌ కార్ట్ కళ్లు చెదిరే దసరా ఆఫర్లు, ఎథ్నిక్ వేర్ పై ఏకంగా 85 శాతం తగ్గింపు!

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

Big Stories

×