iQOO Z9 : ఎప్పటికప్పుడు తన కస్టమర్స్ కోసం లేటెస్ట్ ఆఫర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తాజాగా టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపును అందిస్తుంది. ఐక్యూ మెుబైల్స్ పై అదిరే ఆఫర్స్ ను అందిస్తోంది. ఈ మెుబైల్స్ పై దాదాపు రూ.9వేల వరకూ తగ్గింపును అమెజాన్ అందించగా ఆ ఆఫర్స్ ఏంటో ఓ సారి చూసెద్దాం.
రూ. 20వేల లోపు ఆండ్రాయిడ్ కొనాలని చూస్తున్నారా.. అందులో అదిరే టాప్ బ్రాండ్ మెుబైల్ కావాలనుకుంటున్నారా.. ఇంకెందుకు ఆలస్యం అమెజాన్ ఐక్యూ మెుబైల్స్ పై అందుస్తున్న ఆఫర్స్ పై ఓ లుక్కెయ్యాల్సిందే. అతి తక్కువ ధరకే బెస్ట్ మెుబైల్ కొనాలనుకునే కస్టమర్స్ కు ఐక్యూ Z9 బెస్ట్ ఆప్షన్. ఈ ఐక్యూ జెడ్ 9 మెుబైల్ అసలు ధర రూ. 24,999 ఉండగా ఆఫర్ లో రూ. 18,498కే కొనుగోలు చేయవచ్చు. అంటే అసలు ధర కన్నా 26శాతం తక్కువకే ఈ మెుబైల్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక ఎలా అనే విషయంతో పాటు ఈ మెుబైల్ ఆఫర్స్ పై సైతం ఓ లుక్కేద్దాం.
iQOO Z9 5G – అమెజాన్ లో ఐక్యూ Z9 5G మెుబైల్ లో 8జీబీ+ 128జీబీ మోడల్ ధర రూ. 24,999గా ఉంది. అయితే ఈ మెుబైల్ ను ఆఫర్ లో రూ.18,498కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే ఇందులో బ్యాంక్ ఆఫర్‌లతో మరింత డిస్కౌంట్ సదుపాయం సైతం కలదు. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లేదా వన్ కార్డ్ వంటి సపోర్టు క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తే బెస్ట్ డీల్స్ ను పొందవచ్చు. ఇక అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి మరింత డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంది. అమెజాన్ యాప్ ఫుల్ పేమెంట్‌పై రూ. 2,500 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ మెుబైల్ ను రూ. 15,998కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక వన్‌కార్డ్ యూజర్లు ఈఎంఐ లావాదేవీలను సైతం నిర్వహించి రూ. 1,500 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఈ మెుబైల్ ను అతి తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది.
iQOO Z9స్పెసిఫికేషన్స్ – ఈ ఐక్యూ మెుబైల్ ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. Z9 మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్‌సెట్, 5G సామర్థ్యంతో ప్రాసెసర్, 8 GB RAM + 128 GB స్టోరేజ్ కలదు. ఇక డిస్ ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమోల్డ్ ప్యానెల్ తో వచ్చేసింది. 1800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేసేలా ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీను కలిగి ఉంది.
కెమెరా విషయానికి వస్తే.. ఐక్యూ Z9లో 50MP సోనీ ఐఎమ్ఎక్స్882 ప్రైమరీ కెమెరా, 4K వీడియో రికార్డింగ్, సూపర్ నైట్ మోడ్ తో పాటు 2X ఆప్టికల్ జూమ్ సామర్థ్యం సైతం ఉంది. ఇక సెల్ఫీ కెమెరా సైతం అదిరిపోయేలా ఉంది. ఇందులో 2MP సెకండరీ కెమెరా, 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి.
ALSO READ : ఆహా! ఏమి ఆఫర్స్ బాసూ.. బ్లూటూత్ స్పీకర్స్ పై ఏకంగా వేలల్లో తగ్గింపు